Latest Updates
-
బరువు త్వరగా తగ్గాలంటే ఎక్సర్ సైజ్ ఏ టైమ్ లో చేయాలి? -
భర్త/భార్య పక్కనే ఉన్నా 'నాకు అర్థమయ్యే వాళ్లెవరూ లేరు' అనిపిస్తోందా? కారణం ఇదే -
నెలాఖరులో డబ్బు తక్కువైనప్పుడు భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఎలా మాట్లాడతారో తెలుసా? -
సమ్మర్లో చల్లచల్లగా మిల్క్‌షేక్, మాక్‌టెయిల్.. ఈ ఫ్రూట్స్‌తో స్పెషల్ డ్రింక్స్ -
కొవిడ్ తెచ్చిన కష్టాలు.. యువతలో పెరుగుతున్న తుంటి మార్పిడి సర్జరీలు.! -
కళ్లలో నీళ్లు తిరుగుతున్నా ఆపకుండా తినేంత టేస్టీ..మహారాష్ట్ర స్పెషల్ తేచ్చా చికెన్..ఈజీగా ఎలా చేయాలంటే.. -
బీట్రూట్, అటుకులతో హాట్ అండ్ స్వీట్ హెల్తీ స్నాక్స్ -
మధురై స్పెషల్ బంగాళాదుంప ఫ్రై..జన్మలో మర్చిపోలేని టేస్ట్..ఇంట్లోనే ఎలా చేయాలంటే.. -
అధిక మాసంలో ఈ 4 వస్తువులు ఇంట్లో ఉంటే చాలా డేంజర్.. వెంటనే తీసేయండి.! -
World cycle day 2026: ప్రపంచ సైకిల్ దినోత్సవం.. ఈ ఏడాది ప్రత్యేక థీమ్ ఇదే.!
చెడు కొలెస్ట్రాల్ తో జాగ్రత్త..ఉదయాన్నే ఈ చిన్న మార్పులు చేసుకుంటే గుండెకు ఢోకా ఉండదు
ఆరోగ్యం బాగుంటే చాలు అదే కోట్ల రూపాయల ఆస్తి అని ఈ రోజుల్లో అందరూ చెప్పే మాట. మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవం గుండె. గుండె ఆగిపోతే మనకు మరణమే. అయితే గుండె పనితీరును దెబ్బతీసే ప్రధాన శత్రువు చెడు కొలెస్ట్రాల్(LDL). శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ పెరగడం అనేది గుండె జబ్బులకు ముందస్తు హెచ్చరిక లాంటిది.
మనం ఉదయం నిద్రలేచిన తర్వాత చేసే పనులు తీసుకునే ఆహారం మన రోజంతా ప్రభావితం చేయడమే కాక దీర్ఘకాలికంగా మన గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. మీ కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుకుని, గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఉదయం పూట అలవర్చుకోవాల్సిన కొన్ని మంచి అలవాట్లు ఏవో ఇక్కడ చూడండి.

గోరువెచ్చని నీటితో రోజును ప్రారంభించండి
పొద్దున్నే లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో రోజును ప్రారంభించండి. అందులో కాస్త నిమ్మరసం పిండుకుని తాగితే ఇంకా మంచిది. ఇది మీ శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. జీవక్రియను మెరుగుపరచి, కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
ఉదయం నడక
శారీరక శ్రమ లేకపోవడమే కొలెస్ట్రాల్ పెరగడానికి ప్రధాన కారణం. వారానికి కనీసం 5 రోజులు, రోజుకు 30 నిమిషాల పాటు వేగంగా నడవడాన్ని అలవాటు చేసుకోండి. ఉదయం పూట స్వచ్ఛమైన గాలిలో చేసే బ్రిస్క్ వాకింగ్ వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది మంచి కొలెస్ట్రాల్ ను పెంచి, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
ఫైబర్ అధికంగా ఉండే అల్పాహారం
మీ అల్పాహారం మీ గుండె కు రక్షణ కవచంలా ఉండాలి. ఉదయం పూట ఓట్స్, కిడ్నీ బీన్స్, చియా సీడ్స్, తాజా పండ్లు వంటి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. ఫైబర్, రక్తప్రవాహంలోకి కొలెస్ట్రాల్ త్వరగా కలవకుండా అడ్డుకుంటుంది. ఇది కడుపు నిండిన భావనను కలిగించి, అనవసరమైన చిరుతిళ్లు తినకుండా నియంత్రిస్తుంది.
నట్స్
కొవ్వులన్నీ చెడ్డవి కావు. బాదం, వాల్‌నట్, అవిసె గింజలు వంటి వాటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె కు మిత్రులుగా పనిచేస్తాయి. మీ బ్రేక్ ఫాస్ట్ లో గుప్పెడు నట్స్ చేర్చుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
సంతృప్త కొవ్వులకు నో చెప్పండి
ఉదయం తీసుకునే ఆహారంలో ఎర్ర మాంసం, అధిక కొవ్వు ఉన్న పాల పదార్థాలను నివారించండి. ఇవి నేరుగా కొలెస్ట్రాల్ లెవల్స్ ను పెంచుతాయి. బదులుగా స్కిమ్డ్ మిల్క్ లేదా ప్రోటీన్ రిచ్ ఆహారాలను ఎంచుకోండి.
ట్రాన్స్ ఫ్యాట్స్ ప్రమాదకరం
బేకరీ ఐటమ్స్ చూడటానికి బాగుంటాయి కానీ గుండెకు ప్రమాదకరం. కేకులు, కుకీలు, ప్రాసెస్ చేసిన ఆహారాలలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ధమనులలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి. కాబట్టి బ్రేక్ ఫాస్ట్ లో వీటికి పూర్తిగా దూరంగా ఉండటం బెటర్.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications