Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
Best Tea For Liver: మిల్క్ టీ vs గ్రీన్ టీ..లివర్ కు ఏ టీ మంచిది?
మనదేశంలో సగానికి పైగా జనం పోద్దున్నే టీ లేదా కాఫీ వంటివి తాగనిదే వారికి రోజు గడవదు. ఇక కొంతమంది అయితే రోజులో నాలుగైదు సార్లు టీ,కాఫీలు తాగుతుంటారు. అయితే సాధారణంగా కాఫీ కన్నా టీ వాళ్లే సంఖ్య ఎక్కువగా ఉండటం తరుచూ మన చుట్టూ ఉన్న వ్యక్తుల్లోనే గమనిస్తుంటాం. అయితే టీలో కూడా ఎక్కువగా తీసుకునే రెండు రకాలు గ్రీన్ టీ,మిల్క్ టీ. అయితే టీ ఆరోగ్యానికి మంచిదేనని, టీ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదని కొంతమంది భావిస్తుంటారు. వాస్తవానికి టీ తాగడం అనేది పెద్ద అనారోగ్యకరమైన అలవాటేం కాదని అనేక పరిశోధనలు రుజువు చేశాయి.
టీ తాగడం కాలేయానికి ప్రయోజనకరమైనని నిపుణులు చెబుతుంటారు. అయితే ఏ టీ తాగాలి? గ్రీన్ టీ తాగడం కాలేయానికి మేలు చేస్తుందా లేక మిల్క్ టీ లివర్ కి మేలు చేస్తుందా? అనే ప్రశ్న చాలామందిలో తలెత్తుతుంది. అయితే పరిశోధనల ఆధారంగా ఏ టీ మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది,కాలేయ ఆరోగ్యానికి ఏది బెస్ట్ టీనో ఇప్పుడు చూద్దాం.

మిల్క్ టీ తాగడం వల్ల లివర్ కి ఇబ్బందా?
మన ఇళ్లలో బయట బజార్లో దొరికే ఘుమఘుమలాడే పాల టీ అంటే చాలా మందికి ప్రాణం. ఉదయం లేవగానే ఓ కప్పు వేడి వేడి టీ పడితే గానీ రోజు మొదలవ్వదు. అయితే ఈ అలవాటు మన కాలేయానికి అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే. మనం సాధారణంగా తాగే పాల టీలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. పాలు, టీ ఆకులను కలిపి స్ట్రాంగ్ గా ఉండాలని బాగా మరగబెడతాం. ఈ ప్రక్రియలో కొన్ని హానికరమైన పదార్థాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇవి కాలేయానికే కాకుండా కడుపులో మంట, అసిడిటీ వంటి సమస్యలనూ తెచ్చిపెడతాయి రోజుకు లెక్కలేనన్ని సార్లు టీ తాగేవారికి ఇది డేంజర్.
మరి పాల టీ ఎలా తాగాలి?
పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పాల టీని కూడా ఆస్వాదించవచ్చని నిపుణులు చెబుుతన్నారు. పాలు, టీ పొడి, నీళ్లు అన్నీ మితంగా ఉండాలి. చక్కెర వీలైనంత తగ్గించండి, లేదా పూర్తిగా మానేస్తే మరీ మంచిది. టీని అతిగా మరగబెట్టకండి. రోజుకు ఒకటి లేదా రెండు కప్పులకు మించకుండా చూసుకోండి. ఇలా చేస్తే పాల టీ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు.
గ్రీన్ టీ వల్ల కాలేయానికి ఏంటీ?
గ్రీన్ టీ విషయానికొస్తే ఇది మన కాలేయానికి నిజంగా ఓ సూపర్ హీరో లాంటిదని ఎన్నో పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. 2020లో నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం, గ్రీన్ టీ ఫ్యాటీ లివర్ వంటి కాలేయ వ్యాధులను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. నాణ్యమైన గ్రీన్ టీ తీసుకోవడం కాలేయానికి చాలా మేలు చేస్తుంది. 2017లో జరిగిన మరో పరిశోధనలో గ్రీన్ టీ తాగే వారికి కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని తేలింది. దీన్నిబట్టి గ్రీన్ టీ మన కాలేయ ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుందని అర్థం చేసుకోవచ్చు.
గ్రీన్ టీ కేవలం కాలేయానికే కాదు, మొత్తం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మెదడు పనితీరును చురుగ్గా ఉంచుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఏది బెస్ట్
పరిశోధనల ఆధారంగా చెప్పాలంటేకాలేయ ఆరోగ్యానికి గ్రీన్ టీనే ఉత్తమమైన ఎంపిక అని స్పష్టమవుతోంది. అయితే పాల టీని పూర్తిగా దూరం పెట్టాల్సిన అవసరం లేదు.తక్కువ చక్కెరతో, మితంగా, సరైన పద్ధతిలో అప్పుడప్పుడు తీసుకుంటే ఫర్వాలేదని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications