Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
31st నైట్ ఎంత తాగినా ఎక్కకూడదంటే.. ఈ టిప్స్ కచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే!
పార్టీలు అంటే చాలు చాలా మంది తెగ తాగేస్తుంటారు. మందుతో పాటు చిందులేస్తూ ఊగేస్తుంటారు. కొత్త సంవత్సరం కూడా వచ్చేస్తుంది కాబట్టి, డిసెంబర్ 31న చాలా మంది తాగేసి జనవరి 1st నాడు తెగ ఇబ్బందులు పడుతుంటారు. హ్యాంగ్ ఓవర్ కారణంగా ఏ పని చేయకుండా అలానే ఉండిపోతుంటారు. అయితే హ్యాంగోవర్ కాకుండా మందు బాబులు కొన్ని టిప్స్ పాటించాలి. ఆ టిప్స్ పాటించడం వల్ల హ్యాంగోవర్ కాదు. అలాగే ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. ఆ టిప్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
హ్యాంగోవర్ తగ్గించుకోవడానికి టిప్స్
మందుబాబులు హ్యాంగోవర్ కాకుండా ఉండాలంటే ముందుగా పార్టీకి వెళ్లే ముందే ఎంత తాగాలని దానిపై ఒక క్లారిటీతో ఉండాలి. కేవలం రెండు పెగ్గులు మాత్రమే అని ముందే అనుకుంటే అతిగా తాగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీని కారణంగా హ్యాంగోవర్ కాకుండా ఉంటారు.

ఖాళీ కడుపుతో మందు తాగితే మత్తు ఎక్కువగా ఎక్కుతుంది. దీంతో హ్యాంగోవర్ అవడంతో పాటు ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. అందుకే పార్టీకి వెళ్లేముందు కడుపు నిండా తినేసి వెళ్ళాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. హ్యాంగోవర్ నుంచి తప్పించుకుంటారు.
అతిగా తాగమని ఒత్తిడి చేసే స్నేహితుల నుంచి దూరం ఉండాలి. ఒక్క పెగ్గే ఏమవుతుందిలే అని అనే స్థితి నుంచి స్మార్ట్‌గా తప్పించుకోవడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మద్యం అతిగా తాగకుండా ఉంటారు.
ఎంత తాగుతున్నారో లెక్కిస్తూ ఉండాలి. అలాగే ఎంత మొత్తంలో ఆల్కహాల్ ఉన్న మందు తాగుతున్నారో తెలుసుకోవాలి. దీనివల్ల ఎంత తాగుతున్నారు? ఎంత తాగితే మంచిది అనే దానిపై ఒక క్లారిటీ వస్తుంది. దీని ద్వారా హ్యాంగోవర్ నుంచి కూడా తప్పించుకోవచ్చు.
మందు తాగడానికి బదులు వేరేది ఏదైనా ఆరోగ్యానికి మేలు చేసే పానీయాలను ఎంచుకోవాలి. ఆరోగ్యాన్ని పాడు చేసే ఆల్కహాల్‌కి బదులు, టేస్టీగా, హెల్తీగా ఉండే మాక్ టెయిల్స్ తాగడం మంచి ఆప్షన్. ఇవి చూడడానికి మాక్ టెయిల్స్ మాదిరిగానే ఉంటాయి. కానీ ఇందులో ఒక్క చుక్క ఆల్కహాల్ ఉండదు. అలాగే ఆరోగ్యాన్ని కాపాడతాయి. రిఫ్రెష్మెంట్స్ కోసం ఆల్కహాల్‌కి బదులు వీటిని ట్రై చేయొచ్చు.
కొంచెం కొత్తగా ఆరోగ్యకరంగా ఉండాలంటే వేరే డ్రింక్స్ కూడా ప్రయత్నించొచ్చు. వాటిలో కొంబుచా మంచి ఆప్షన్ అవుతుంది. దీని రుచి అద్భుతంగా ఉంటుంది. ఇది పుల్లగా రుచికరంగా ఉంటుంది. క్లాసిక్ ఫ్లేవర్స్ కావాలనుకునే వాళ్లకి వర్జిన్ బ్లడీ మేరీ, పినా కొలాడా ఉన్నాయి. మరీ బీర్లు, వైన్స్ తాగాలనుకునే వారికి నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ అందుబాటులో ఉంటాయి. వాటిని తాగి పార్టీ చేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదు.
గమనిక: ఈ స్టోరీలో మేము చెప్పిన పాయింట్స్ అన్ని ఇంటర్నెట్‌లో దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. ఇవే కచ్చితమైనవని మేము నిర్ధారించడం లేదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications