Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
చలికాలంలో ఇవి తింటే మీరు రేస్ గుర్రం అయిపోతారు.. గోడను గుద్దినా ఎముకలు విరగవు!
చలికాలం వచ్చేసింది. రోజు రోజుకూ చలి తీవ్రత పెరిగిపోతుంది. ఎముకలు కొరికే ఈ చలిలో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. దగ్గు, జలుబు, అలసట, నీరసం, బలహీనత వంటి సమస్యలు మనిషి కుంగించేస్తాయి. దీనితో పాటు రోగ నిరోధక శక్తి తగ్గడం, వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం, పోషకాహార లోపం వల్ల ఎముకలు బలహీనంగా మారడం, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు మనిషిని ఎంతగానో వేధిస్తాయి.
ఎందుకంటే చలికాలంలో ఆహరం తీసుకోకపోవడంతో పాటు వ్యాధులు ప్రబలేందుకు చాలా ఆస్కారం ఉంటుంది. అందుకే ఆ వ్యాధులను ఎదుర్కొనేందుకు సరైన పోషకాలు కలిగిన ఆహరం అవసరం. ఈ చలికాలంలో ఎలాంటి రోగాలు రాకపోవడంతో పాటు ఎముకలు ధృడంగా ఉండాలంటే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో జత చేసుకోవాలి. ఆ ఆహర పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రాగి జావ
రాగి జావతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే చాలా మంది రాగిజావను తింటూ ఉంటారు. మన పూర్వికులు సైతం ఈ రాగితో ఆహరం చేసుకొని తినేవారు అందుకే వారు సంవత్సరాల తరబడి రోగాలు లేకుండా జీవించగలుగుతున్నారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ రాగి జావను తినడం వల్ల.. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో యాంటీ యాక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనిషి ఆరోగ్యంగా ఉంచడంతో పాటు ఎముకలను ధృడంగా చేస్తాయి. కీళ్ల నొప్పులను దూరం చేస్తాయి. ఎముకలను బలం చేకూర్చి, శక్తిని అందిస్తాయి. ఈ రాగితో రాగి సంగటి, రొట్టెలు కూడా చేసుకొని తినొచ్చు.
డ్రై ఫ్రూట్స్..
డ్రై ఫ్రూట్స్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్న విషయం తెలిసిందే. ఇందులో శరీరానికి కావాల్సిన ప్రోటీన్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అన్నీ రకాల డ్రై ఫుట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. క్రమం తప్పకుండా ఈ డ్రై ఫ్రూట్స్‌ను తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. అలాగే ఎముకలు బలంగా ధృడంగా మారుతాయి. ఆర్థరైటిస్, బోలు ఎముకలు వంటి వ్యాధులను కూడా ఈ డ్రై ఫ్రూట్స్ తగ్గిస్తాయి. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరానికి కావాల్సిన పోషకాలను పుష్కలంగా అందజేస్తాయి.
పైనాపిల్..
సీజన్‌తో సంబంధం లేకుండా మన ఇండియన్ మార్కెట్‌లో ఈ పైనాపిల్ పండు దొరుకుతుంది. ఈ పైనాపిల్ ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. మరీ ముఖ్యంగా ఎముకలను ధృడంగా ఉంచేందుకు సహాయపడతాయి. ఈ పినాపైల్‌లో విటమిన్స్, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి కీళ్ల నొప్పులను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అలాగే ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడతాయి.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. మేము కేవలం సమాచారం అందించడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాము. వీటిని ఎంతవరకు విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. దీనికి బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications