Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మెరుపు వచ్చినప్పుడు మాత్రమే పెరిగే కూరగాయ..వెజిటేరియన్ మటన్ 'రుగ్రా' ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
వానాకాలం వచ్చిందంటే చాలు చల్లటి వాతావరణంలో మన నాలుక కొత్త రుచుల కోసం తహతహలాడుతుంది. మార్కెట్లో రోజూ చూసే కూరగాయలు కాకుండా,ఏదైనా ప్రత్యేకమైనది తినాలనిపిస్తుంది. అయితే మనకు తెలియని, అద్భుత ప్రయోజనాలున్న ఎన్నో అరుదైన కూరగాయలు ప్రకృతిలో దాగి ఉన్నాయని మీకు తెలుసా? అలాంటి ఓ రహస్యమైన, అపురూపమైన కూరగాయే రుగ్రా. దీని రుచి మాంసాహారాన్ని మరిపించడంతో దీన్ని వెజిటేరియన్ మటన్ అని కూడా పిలుస్తుంటారు.
రుగ్రా కేవలం రుచిలోనే కాదు అది పెరిగే విధానంలోనూ ఓ పెద్ద అద్భుతం దాగి ఉంది. ఇది భూమి లోపల పుట్టగొడుగులా పెరుగుతుంది. అసలైన ఆశ్చర్యం ఏమిటంటే ఈ కూరగాయ పెరగడానికి ఆకాశంలో మెరుపులు అవసరం. వర్షాకాలంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసినప్పుడు మాత్రమే ఈ రుగ్రా భూమిలో వేగంగా వృద్ధి చెందుతుంది. మెరుపులోని శక్తి దీని పెరుగుదలకు దోహదపడుతుందని గిరిజనులు నమ్ముతారు. ఈ కారణంగానే దీనిని ప్రత్యేకంగా పండించలేరు.

ఈ అరుదైన కూరగాయ ప్రధానంగా జార్ఖండ్ అడవుల్లో, తుఫానులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో మాత్రమే దొరుకుతుంది. ప్రకృతి సిద్ధంగా, కేవలం కొన్ని రోజులు మాత్రమే దొరకడం వల్ల దీనికి డిమాండ్ చాలా ఎక్కువ. అందుకే దీని ధర ఆకాశాన్ని తాకుతుంది. కిలో రుగ్రా ధర సుమారు వెయ్యి రూపాయల వరకు పలుకుతుంది. దీనిని భూగర్భ పుట్టగొడుగు అని కూడా పిలుస్తారు. రుచిలో పుట్టగొడుగులను పోలి ఉన్నప్పటికీ దీని ప్రత్యేకమైన ఫ్లేవర్ మాంసం కూరను గుర్తుకు తెస్తుంది.
రుగ్రాలో ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా హై బీపీ సమస్యతో బాధపడేవారికి ఇది ఒక సహజ ఔషధంలా పనిచేస్తుందని చెబుతుంటారు నిపుణులు. ఇందులో దాదాపు 12 రకాలు ఉండగా తెల్లటి రకం రుగ్రా అత్యంత శ్రేష్ఠమైనదిగా, ఎక్కువ ప్రయోజనాలు ఇచ్చేదిగా భావిస్తారు. కాబట్టి కేవలం రుచికే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేసే ఈ వెజిటేరియన్ మటన్ ఎంతో ప్రత్యేకమైనది. దొరకడం కష్టమైనా, దాని అద్భుత ప్రయోజనాలు, అసాధారణమైన రుచి కోసం దీనిని కొనేందుకు చాలామంది వెనుకాడరు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications