Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
గుండె జబ్బు మనకెందుకు వస్తుంది.. అనుకుంటున్నారేమో? అపోహలు వద్దు, నిజాలు తెలుసుకోండి
ఈ మధ్య గుండెపోటు వచ్చి పిల్లలు, యువకులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. అప్పటి వరకు మన ముందే చలాకీగా ఉన్న వారు కూడా ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు వదిలేస్తున్నారు. ఎవరికి వస్తుంది, ఎప్పుడు వస్తుంది అని ఊహించలేకపోతున్నాం. ఒకప్పుడు లావుగా ఉన్నవారికి, ఊబకాయంతో బాధపడే వారికి, వయస్సు పెరిగిన వారికి గుండె పోటు, గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా వచ్చేవి. కానీ ఈమధ్య యువకులు కూడా ప్రాణాలు కోల్పోతుండటం కలవరపెడుతోంది.

నేను ఫిట్‌గా ఉన్నా, పొట్ట కూడా లేదు నాకు గుండెపోటు రాదు.. నాకేంటి నేనూ రోజూ జిమ్ చేస్తా గుండెపోటు వచ్చే సమస్యే లేదు.. పొట్ట లేదు, బరువు కూడా లేను నాకస్సలే రాదు.. అని చాలా మంది అనుకుంటారు. కానీ జిమ్ చేస్తూ గుండెపోటుతో ఈమధ్య కాలంలోనే చాలా మంది చనిపోయారు. కాబట్టి గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే చాలా మందిలో గుండె జబ్బులు పట్ల ఉన్న అపోహలు ఏంటో, నిజాలేంటో తెలుసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
అపోహ: యువతులకు గుండె జబ్బు వచ్చే ప్రమాదం లేదు
వాస్తవం: అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం గుండె జబ్బులు అన్ని వయస్సుల మహిళలను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా గర్భనిరోధక మాత్రలు, పొగ త్రాగే యువతులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 20 శాతం ఎక్కువ. కదలకుండా ఉండే జీవనశైలిని అవలంబిస్తుంటే ఆ ప్రమాదం మరింత పెరుగుతుంది.
అపోహ: గుండె జబ్బులు మహిళల్లో కంటే పురుషుల్లో అధికం
వాస్తవం: అమెరికన్ హార్ట అసోసియేషన్ ప్రకారం, పురుషుల కంటే స్త్రీలకే ప్రమాదం ఎక్కువ. 65 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న మహిళల్లో గుండె జబ్బులే మరణానికి ప్రధాన కారణంగా ఉంది. 65 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు గుండెపోటు, స్ట్రోక్ లేదా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆన్ ఏజింగ్ తెలిపింది.
అపోహ: డయాబెటిక్ మందులు తీసుకునేవారిలో గుండె జబ్బులు రావు
వాస్తవం: మధుమేహానికి మందులు తీసుకోవడం వల్ల రక్తం చక్కెర స్థాయిలో నియంత్రణలో ఉంటాయి. కంటి చూపు కోల్పోవడం, నరాలు దెబ్బతినడం, మూత్రపిండ వ్యాధులు మొదలైన వాటిని నివారిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం వల్ల రక్తనాళాలపై ప్రభావం పడుతుంది. అది గుండె జబ్బులను తెచ్చిపెట్టగలదు.
అపోహ: వారసత్వంగా గుండె జబ్బులు ఉంటే, మందులు తీసుకున్నా ప్రయోజనం ఉండదు
వాస్తవం: కుటుంబ చరిత్రలో గుండె జబ్బులు ఉంటే ఇతరులకు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే కొన్ని చర్యల వల్ల ఆ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. శారీరక శ్రమ, గుండెకు ఆరోగ్యాన్ని చేకూర్చే ఆహారం, కొలెస్ట్రాల్, రక్తపోటును నింయత్రణలో ఉంచుకోవడం, ధూమపానానికి దూరంగా ఉండటం, ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.
అపోహ: ధూమపానం మానేస్తే గుండె జబ్బుల ప్రమాదం తగ్గదు
వాస్తవం: ఇలా ధూమపానం మానేయగానే అలా రిజల్ట్స్ వచ్చేయదు. హార్వర్డ్ హెల్త్ ప్రకారం, స్మోకింగ్ మానేసిన సంవత్సరం తర్వాత గుండెపోటు వచ్చే ప్రమాదం 50 శాతం తగ్గుతుంది.
అపోహ: రోజూ వ్యాయామం చేస్తే గుండె జబ్బులు రావు
వాస్తవం: శారీరకంగా చురుకుగా ఉంచుకోవడం ఒక్కటే గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గించదు. హార్ట్ ఫౌండేషన్ ప్రకారం క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారు అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు, ధూమపానం, ఊబకాయం వంటి గుండె జబ్బులకు కారణమయ్యే ఇతర ప్రమాద కారకాలను కలిగి ఉండే అవకాశం ఉంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications