Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
35 ఏళ్లు దాటితే పిల్లలు పుట్టరా? సంతానలేమికి ఆడవాళ్లే కారణమా?
సంతానలేమి ఈ మధ్యకాలంలో చాలా మంది జంటలను ఇబ్బంది పెడుతున్న సమస్య. సాధారణంగా భారత్ లో పెళ్లి అయిన రెండూ, మూడు నెలల నుంచే ఇంట్లో వారి నుంచి పోరు మొదలవుతుంది. ఏదైనా విశేషమా, విశేషం చెబుతున్నావా, గుడ్ న్యూస్ వినిపిస్తున్నావా, మాకెప్పుడు మనవడు లేదా మనవరాలిని ఇస్తున్నావ్ అంటూ తెగ ఆరాటపడిపోతుంటారు. అలాంటి పరిస్థితుల్లో పిల్లలు త్వరగా కలగకపోవడం అంటే వారి నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకోవడం కొద్దిగా కష్టంగానే ఉంటుంది.
అయితే ఈ మధ్యకాలంలో చాలా మంది జంటలు పెళ్లై ఏళ్లకు ఏళ్లు గడుతున్నారు గర్భం దాల్చడం లేదు. సంతానలేమి సమస్యలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఎయిమ్స్ నివేదిక ప్రకారం మన దేశంలో సంతానలేమి సమస్య 10-14 శాతం ఉన్నట్లు తేలింది. అయితే పిల్లలు కలగకపోవడానికి, గర్భం ధరించకపోవడానికి చాలా మంది ఆడవాళ్లనే నిందిస్తుంటారు. కానీ సంతానలేమికి స్త్రీ, పురుషులిద్దరూ కారణమే అని వైద్యులు చెబుతున్నారు.

సంతానలేమి గురించి సమాజంలో చాలా రకాల అపోహలు ఉన్నాయి. మహిళలు 35 ఏళ్లు దాటితే సంతానం కలగదని, అధిక బరువు ఉంటే గర్భం ధరించలేరని, సంతానలేమికి ఆడవాళ్లే ఎక్కువ కారణమని అంటుంటారు. మరి అవన్నీ అపోహలా.. నిజాలా.. అందులో నిజాలేమైనా ఉన్నాయా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
సంతానలేమికి ఆడవాళ్లే కారణమా!
పిల్లలు పుట్టడానికి ఆడవాళ్లను ఒక్కరినే బాధ్యులను చేయడం చాలా తప్పని వైద్యులు చెబుతున్నారు. సంతానలేమికి స్త్రీ, పురుషులు ఇద్దరూ కారణమని అంటున్నారు. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, వాటి నాణ్యత గర్భం ధరించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే ఆడవారిలో పీసీఓడీ, పీసీఓఎస్ లాంటి అనారోగ్య కారణాల వల్ల గర్భం ధరించడం కష్టమవుతుంది. సంతానలేమికి కారణం ఏంటో తెలుసుకుంటే కానీ లోపం ఎవరిలో ఉందో తెలుసుకోలేమని వైద్యులు చెబుతున్నారు.
లైంగిక వ్యాధులతో పిల్లలు పుట్టరా!
లైంగిక వ్యాధులు కూడా సంతానలేమికి కారణం కావొచ్చు. అలాగే లైంగిక వ్యాధులు దంపతులు ఇద్దరి ఎవరికైనా ఉండవచ్చు. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ వంటివి పునరుత్పత్తి సమస్యకు దారి తీస్తాయి. లైంగిక వ్యాధులకు సరైన చికిత్స చేయకపోతే సంతాన సమస్యలు ఎదురవుతాయి. ఈ ఆరోగ్య సమస్యల వల్ల వీర్యం నాణ్యత దెబ్బతినడం, సంఖ్య పడిపోవడం, అలాగే అండం విడుదలో సమస్యలు రావొచ్చు.
ఆడవాళ్లకు 35 ఏళ్లు దాటితే పిల్లలు పుట్టరా!
చాలా మందిలో ఈ అపోహ ఉంటుంది. ఆడవాళ్లకు 35 ఏళ్లు దాటితే సంతాన సమస్యలు వస్తాయని, పిల్లలు పుట్టడం కష్టం అవుతుంది అని అంటారు. అయితే ఇందులో కొంత వరకు నిజం ఉంది. చాలా మందిలో జీవన శైలి అలవాట్ల వల్ల అండోత్పత్తిలో సమస్యలు వస్తాయి. అలాగే సమయానికి అండాలు ఉత్పత్తి అవకపోవడం లాంటివి జరుగుతాయి. ఇలాంటి సమస్యలు ఉన్న వారు గర్భం ధరించడం కాస్తంత కష్టం. సరైన చికిత్స తీసుకుంటే 40 ఏళ్ల వరకు కూడా గర్భం ధరించవచ్చు.
వయస్సు కారణంగా వచ్చే సంతానలేమిని IVFతో నయం చేయవచ్చా!
వివిధ కారణాల వల్ల సంతానలేమి సమస్యలు ఎదుర్కొనే వారికి IVF అత్యంత విశ్వసనీయమైన మార్గం. కానీ వయస్సు పైబడటం వల్ల సంతానలేమి సమస్యను ఎదుర్కొనే వారిలో IVFతో గర్భం ధరించడం కాస్త కష్టం.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications