Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఊబకాయం వారసత్వంగా వస్తుంది.. తినుడు తగ్గిస్తే తగ్గిపోతుంది.. ఇవి అపోహలా? నిజాలా?
ప్రపంచవ్యాప్తంగా అతి ఎక్కువ మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్య ఊబకాయం. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. మారిపోయిన జీవనశైలి, ఉదయం నుంచి ఏమాత్రం శరీరాన్ని కదపకుండా ఉండటం, వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తింటుండటం లాంటి కారణాల వల్ల చాలా మంది ఊబకాయం బారిన పడుతున్నారు.
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం అమెరికాలో 42.4 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 650 మిలియన్ల మంది ఊబకాయం కలిగి ఉన్నారు.

ఊబకాయం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. శారీరకంగా, మానసికంగా కూడా ఊబకాయం ప్రభావం చూపిస్తుంది. కరోనా తర్వాత చాలా మందిలో ఆరోగ్య స్పృహ పెరగ్గా, అదే సమయంలో చాలా మంది ఊబకాయం బారిన పడ్డారు. నిశ్చలమైన జీవనశైలికి అలవాటు పడి బరువు పెరిగిపోతున్నారు. అది కాస్త ఊబకాయానికి దారితీస్తోంది. ఒబెసిటీ చుట్టూ చాలా మందికి అనేక రకాల అపోహలు ఉంటాయి. కొందరు వాటినే నిజం అనుకుంటారు కూడా. ఆ అపోహలు ఏంటో, నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. తికపోతే చాలు ఊబకాయం తగ్గిపోతుంది!
శరీరానికి అవసరమైన దాని కంటేఎక్కువ కేలరీలు తీసుకోవడం ఊబకాయం రావడానికి ప్రధాన కారణం. అయితే ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి తినకుండా ఉంటే చాలు అని చాలా మంది అనుకుంటారు. కానీ అలా చేయడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. శరీరానికి అందాల్సిన పోషకాలు అందక శరీర వ్యవస్థ గాడి తప్పుతుంది. అలాగే శరీర రోజువారీ కార్యకలాపాలకు ఎనర్జీ లేక నీరసించిపోతారు.
ఊబకాయం తగ్గించుకోవాలంటే.. తినడాన్ని కంట్రోల్ చేయడంతో పాటు వ్యాయామం చేయాలి. కంటి నిండా నిద్ర పోవాలి. మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకు ప్రాణాయామం వంటివి కూడా చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.
2. ఊబకాయం వల్ల డయాబెటిస్ వస్తుంది!
ఊబకాయం లేదా స్థూలకాయం వల్ల డయాబెటిస్ రాదు. మధుమేహం రావడానికి ఊబకాయం కూడా ఒక కారణంగా ఉంటుంది కానీ కేవలం ఒబెసిటీ వల్ల మాత్రమే డయాబెటిస్ రాదు. ఊబకాయం ఉన్న ప్రతి ఒక్కరికీ డయాబెటిస్ ఉండదు. డయాబెటిస్ పేషెంట్లు అందరూ ఊబకాయులు కారు.
3. ఊబకాయం ఉన్న వారు లేజీగా ఉంటారు!
శారీరక కదలిక ఎక్కువగా లేని వారిలో ఊబకాయం వచ్చే అవకాశాలు ఉంటాయి. వారు రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గిపోతారు. అయితే ఊబకాయులు అందరూ లేజీగా ఉంటారని, ఏ పనీ చేయరని, సోమరిపోతులుగా ఉంటారని అనుకోవడం తప్పే. చాలా మంది ఊబకాయంతో ఉన్నప్పటికీ చాలా యాక్టివ్ గా ఉంటారు. కానీ వాళ్లు వ్యాయామం చేయరంతే..
4. ఊబకాయం వారసత్వంగా వస్తుంది!
గుండె జబ్బులు, క్యాన్సర్లు, డయాబెటిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు వారసత్వంగా రావొచ్చు. అంటే ఇంట్లోని కుటుంబ సభ్యులకు ఉంటే మిగతా వారికి, తరువాతి తరం వారికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కొందరు ఎం తినకపోయినా చాలా లావుగా ఉంటారు. చిన్నప్పటి నుంచే వారు చాలా లావుగా ఉంటారు. అయితే ఊబకాయం వారసత్వంగా వస్తుంది అనడానికి చాలా పరిమితంగానే అధ్యయనాలు ఉన్నాయి.
5. ఊబకాయంతో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు!
ఊబకాయంతో ఆరోగ్య సమస్యలు వస్తాయి. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబందిత వ్యాధులు, ఆస్టియో ఆర్థరైటిస్, స్లీప్ ఆప్నియా వంటి వ్యాధులు వస్తాయి. ఊబకాయుల్లో చాలా మందికి గుండె సంబంధిత వ్యాధులు ఉంటాయి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications