Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
డైట్ పిల్స్‌తో బరువు తగ్గుతారా? ఈ పిల్స్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? నిజమేనా..
బరువు తగ్గాలనుకునే వారు కొంతమంది డైట్ పిల్స్ వాడుతుంటారు. ఈ డైట్ పిల్స్ తీసుకుంటే త్వరగా బరువు తగ్గవచ్చని అంటున్నారు. ఈ ఫ్యాట్ బర్నర్ సప్లిమెంట్లు బరువు తగ్గడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. కానీ మొత్తంగా వీటిపైనే ఆధారపడి బరువు తగ్గవచ్చా.. ఈ డైట్ పిల్స్ తీసుకుంటే ఏమైనా దుష్ప్రభావాలు ఉన్నాయా.. ఈ వెయిట్ లాస్ పిల్స్ గురించి సాధారణంగా చాలా మందిలో అపోహలు.. వాటి వెనక అసలు నిజాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మందులు వేసుకుంటే చాలు బరువు తగ్గొచ్చు!
వెయిట్ లాస్ పిల్స్, డైట్ పిల్స్, ఫ్యాట్ బర్నర్ సప్లిమెంట్స్ ఎలా పిలుచుకున్నా ఒకటే. అయితే వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గడం మరింత ప్రభావవంతంగా ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే సరైన డైట్ పాటించకుండా, వ్యాయామం చేయకుండా కేవలం డైట్ పిల్స్ తీసుకుంటే మాత్రం బరువు తగ్గలేని స్పష్టం చేస్తున్నారు నిపుణులు. వ్యాయామం చేస్తూ ఈ డైట్ పిల్స్ తీసుకోవడం వల్ల మరింత వేగంగా కొవ్వు కరుగుతుంది. కండరాలు వేగంగా పెరగడానికి, మంచి ఆకృతి సాధించడానికి ఈ వెయిట్ లాస్ పిల్స్ చక్కగా పని చేస్తాయి.

డైట్ పిల్స్ తీసుకోవడం వ్యసనంలా మారుతుంది!
డైట్ పిల్స్ సాధారణం మందుల్లాగే ఉంటాయి. ఏ పని కోసం అయితే వాటిని అభివృద్ధి చేశారో ఆ పని చేస్తాయి. అయితే డైట్ పిల్స్ తీసుకుంటే వ్యసనంలా మారుతుంది అనే దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు.
డైట్ పిల్స్‌తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు!
డైట్ పిల్స్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ తప్పకుండా ఉంటాయి. నోరు పొడిబారడం, తలతిరగడం, తలనొప్పి, ఆందోళన లాంటి దుష్ప్రభావాలు ఉంటాయి. మీరు డైట్ పిల్స్ తీసుకున్నప్పుడు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్లయితే వైద్యులను సంప్రదించాలని గుర్తుంచుకోండి.
డైట్ పిల్స్‌తో ఎక్కడ కావాలంటే అక్కడ కొవ్వు కరిగించొచ్చు!
పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు, తొడల వద్ద పేరుకుపోయిన కొవ్వును ఇట్టే కరిగిస్తాయని ప్రకటనలు కనిపిస్తూనే ఉంటాయి. అలాగే డైట్ పిల్స్ తీసుకోవడం వల్ల పొట్ట కొవ్వు, తొడ కొవ్వు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ కొవ్వు కరిగించుకోవచ్చని అనుకోవడం అపోహే అవుతుంది. డైట్ పిల్స్ తీసుకోవడం వల్ల ఏదో మ్యాజిక్ చేసినట్లుగా ఇట్టే బరువు తగ్గిపోరు. సరైన వ్యాయామం, మంచి డైట్ పాటిస్తూ సప్లిమెంట్లు తీసుకుంటేనే ప్రయోజనం ఉంటుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications