Latest Updates
-
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.?
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.!
అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ ఈ ఆధునిక జీవనశైలి, కాలుష్యం, జంక్ ఫుడ్ కారణంగా చర్మం సున్నితత్వాన్ని కోల్పోతుంది. ఫలితంగా ముఖంపై మచ్చలు, ముడతలు, జుట్టు పొడిబారడం, తెల్ల జుట్టు ఇలా చాలా రకాల సమస్యలు వస్తున్నాయి. అయితే వీటన్నిటికీ ఇంట్లోనే శాశ్వత పరిష్కారం ఉందని చర్మ సంరక్షణ నిపుణులు చెబుతున్నారు.

ముఖం కొంచెం నల్లగా మారినా, ముడతలు వచ్చినా, బ్లాక్‌హెడ్స్, మెడ నల్లగా అవడం, జుట్టు పగుళ్లు ఏర్పడటం ఇలా ఏ సమస్య వచ్చినా చాలా మంది వెంటనే బ్యూటీ పార్లర్లకి పరుగులు తీస్తుంటారు. అయితే పార్లర్ ప్రొడక్ట్స్‌లో చాలా వరకు రసాయనాలు ఉంటాయనే విషయం చాలా మందికి తెలియనిది కాదు. వీటి ఫలితం ఆ క్షణం కొందరిలో మంచిగా కనిపించినా కొన్ని రోజులకి దుష్ప్రభావాలు కనిపించడం చూస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో వీటికి దూరంగా ఉండటం ఉత్తమం. మన ఇంట్లోని వంటగదిలో ప్రకృతి ఇచ్చిన ఎన్నో సౌందర్య ఉత్పత్తులు ఉన్నాయి. వాటిని తరచూ సరైన రీతిలో ఉపయోగిస్తే పార్లర్ ఇచ్చే అందాన్ని మించిన సౌందర్యం మీ సొంతం అవుతుంది.
ఎవరికైనా ముఖం ఒక్కటే అందంగా కనిపిస్తే సరిపోతుందా.? అంటే కాదనే చెప్పాలి. మృదువైన, ఒత్తైన, నల్లటి కురులు, సహజంగా అందంగా కనిపించే పెదాలు, మచ్చలు, ముడతలు లేని ఫేస్ ఇవన్నీ కీలకమనే చెప్పాలి. ఇందుకోసం మీ వంట గదిలో ఉండే వస్తువులతో ఐదు చిట్కాలతో సహజమైన సౌందర్యాన్ని పొందవచ్చు.
పచ్చి పాలు, పసుపు: పచ్చి పాలు, పసుపులోని సహజ ఔషధ గుణాలు ముఖానికి నిగారింపును తీసుకొస్తాయి. ఒక గిన్నెలో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల పచ్చి పాలు తీసుకుని అందులో చిటికెడు పసుపు కలపాలి. తర్వాత ఆ పాలను ముఖానికి సున్నితంగా మర్దనా చేసుకుంటూ ఫేస్‌ప్యాక్‌లా చేసుకోవాలి. ఒక 30 నిమిషాల తర్వాత గోరు వెచ్చటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం ద్వారా మీ ముఖానికి సహజ కాంతి వచ్చి చేరుతుంది.
సహజమైన జుట్టు రంగు: దుమ్ము, కాలుష్యం, రసాయన షాంపూల కారణంగా జుట్టు రాలిపోవడం ఎక్కువవుతుంటుంది. దీనికి పరిష్కారంగా ముందు ఒక బీట్‌రూట్ ముక్కను, ఒక గ్లాసు నీటిని కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ఐదు నిమిషాల పాటు స్టవ్‌పైన ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు హెన్నా పౌడర్‌లో కొద్దిగా కాఫీ కలపాలి. బీట్‌రూట్ పేస్ట్ నుంచి తీసిన రసాన్ని ఇందులో కలిపి ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తం కుదుళ్ల వరకూ కలిసేలా పట్టించాలి. గంట తర్వాత చల్లటి నీటితో జుట్టుని కడిగేసి స్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం ద్వారా ఫలితం ఉంటుంది. అంతేకాకుండా బియ్యం కడిగిన నీటితో జుట్టు కడగడం వల్ల జుట్టు మెరుస్తూ ఆరోగ్యకరంగా ఉంటుంది. తద్వారా జుట్టు కూడా పెరుగుతుంది.

శుభ్రమైన దంతాల కోసం: దంతాల ఆరోగ్యం చాలా ముఖ్యం. ఇందుకోసం బ్రష్ చేయడమే కాకుండా వారానికి రెండు సార్లు దంతాల సంరక్షణకి సమయం కేటాయించాలి. చిటికెడు ఉప్పును కొంచెం ఆవనూనెతో కలిపి ఈ మిశ్రమాన్ని దంతాలు, చిగుళ్లపైన మర్దన చేయాలి. ఇలా చేయడం ద్వారా దంతాలు శుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంటాయి.
పెదవుల కోసం: కాలాన్ని బట్టి పెదవులు పొడిబారడం, పగలడం వంటివి జరుగుతుంటాయి. వచ్చే వానాకాలం దృష్ట్యా పెదవుల సంరక్షణ చాలా ముఖ్యం. టీస్పూన్ నిమ్మరసంలో పంచదార కలిపి ఈ మిశ్రమాన్ని పెదవులపై కొన్ని నిమిషాల పాటు మర్దనా చేసుకోవాలి. రోజూ రాత్రి ఇలా చేయడం ద్వారా నల్ల మచ్చలను తొలగించి పెదాలు సహజంగా గులాబీ రంగులోకి మారేందుకు దోహదపడుతుంది.
ముఖంపై మచ్చల కోసం: గోరువెచ్చని నీటిలో అలోవేరా జెల్ కలిపి ఆ నీటితో ముఖానికి ఆవిరి పట్టాలి. దీని వల్ల ముఖంపై మచ్చలు, మలినాలు తొలగిపోతాయి. అంతేకాకుండా గోరువెచ్చని నీటిలో చిన్న టవల్‌ను నానబెట్టి పావు గంట పాటు ముఖంపై పెట్టుకోవడం ద్వారా చర్మంపై రంధ్రాల్లో చేరిన మురికిని తొలగిస్తుంది. తెల్లటి, నల్లటి మచ్చలను మాయం చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications