Latest Updates
-
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే..
ఈ ఆకులే షుగర్ కు అసలైన మందు!
ఈ రోజుల్లో షుగర్ అనేది కామన్ సమస్యగా మారిపోయింది. చిన్నా పెద్ద అని తేడా లేకుండా ఏ వయస్సులో అయినా షుగర్ ఎటాక్ అవుతుంది. ప్రపంచంలో అత్యధిక షుగర్ పేషెంట్లు మనదేశంలోనే ఉన్నారు. ఒక్కసారి షుగర్ వ్యాధి బారినపడితే జీవితాంతం దాన్ని కంట్రోల్ లో ఉంచగలం తప్ప దానిని పూర్తిగా నయం చేసే మెడిసిన్ ఇప్పటివరకు రాలేదు.
జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా మాత్రమే దీనిని నియంత్రణలో ఉంచుకోగలం. ఒకప్పుడు డయాబెటిస్ అనేది కేవలం వంశపారంపర్యంగా పిల్లలకు సంక్రమించే వ్యాధిగానే పరిగణించేవారు. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జన్యుపరమైన కారణాలు ఉన్నప్పటికీ మారిన ఆహారపు అలవాట్లు, విపరీతమైన ఒత్తిడి, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల చిన్నవయసులోనే ఈ మహమ్మారి తలుపు తడుతోంది.

ముఖ్యంగా ముప్పై ఏళ్లు దాటిన వారిలో ఈ సమస్య తీవ్రంగా పెరుగుతోంది. అయితే మందులతో పాటు ప్రకృతి ప్రసాదించిన కొన్ని అద్భుతమైన ఔషధ మొక్కల ద్వారా మధుమేహాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని మీకు తెలుసా?
బాదం ఆకులు - మధుమేహానికి సహజ ఔషధం
సాధారణంగా మనం బాదం పప్పును ఆరోగ్యానికి మంచిదని తింటూ ఉంటాం. కానీ బాదం ఆకులలో షుగర్ ని కంట్రోల్ లో ఉంచే అద్భుత గుణాలు దాగి ఉన్నాయి. ఆయుర్వేద నిపుణుల ప్రకారం ఈ ఆకులలో జాంబోలిన్,జాంబోసిన్ అనే ప్రత్యేకమైన పదార్థాలు ఉంటాయి. మనం తీసుకున్న ఆహారంలోని స్టార్చ్ (పిండిపదార్థం) వేగంగా చక్కెరగా మారకుండా ఇవి అడ్డుకుంటాయి. తద్వారా రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ అకస్మాత్తుగా పెరగకుండా నియంత్రించబడతాయి.
ఉపయోగించే విధానం
బాదం ఆకులను శుభ్రం చేసి, నీటిలో వేసి బాగా మరిగించి టీ (కషాయం) లాగా తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
పొడి రూపంలో: బాదం ఆకులను నీడలో ఎండబెట్టి, మెత్తటి పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని రోజూ గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
లేత ఆకులు: ముదురు రంగు ఆకుల కంటే, లేత రంగులో ఉండే ఆకులను నమిలి తినడం లేదా వాటి రసాన్ని తీసుకోవడం వల్ల ప్యాంక్రియాస్ పనితీరు మెరుగుపడుతుంది.
ఇతర ఆరోగ్య ప్రయోజనాలు
బాదం ఆకులు కేవలం షుగర్ వ్యాధికే కాదు రక్తపోటు సమస్యతో బాధపడేవారికి కూడా ఒక వరం లాంటివి. ఈ ఆకులలో ఉండే యాంటీఆక్సిడెంట్లు బీపీని అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. అలాగే నోటి దుర్వాసన సమస్య ఉన్నవారు బాదం ఆకులను నమలడం ద్వారా తక్షణ ఉపశమనం పొందవచ్చు.
ప్రకృతి ఒడిలో మరికొన్ని ఔషధాలు
బాదం ఆకులతో పాటు మన పెరట్లో దొరికే ఇతర ఆకులు కూడా షుగర్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి.
మామిడి ఆకులు: వీటిలో ఉండే ఆంథోసైనిడిన్లు, టానిన్లు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి.
వేప ఆకులు: వేప రసం తాగడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగుపడి, ప్యాంక్రియాస్ ఆరోగ్యంగా ఉంటుంది.
కరివేపాకు: మనం కూరల్లో వాడే కరివేపాకును పారేయకుండా నమిలి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుముఖం పడతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
