Latest Updates
-
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్ -
శని తిరోగమనం..ఈ 5 రాశుల వాళ్లు ఆ పని చేయకుంటే అగమాగం ఐపోతరు! -
రొటీన్ బజ్జీలు, పకోడీలు బోర్ కొట్టాయా? అయితే ఈసారి పొటాటో లాలిపాప్ ట్రై చేయండి -
రాత్రంతా తేనెలో ఓట్స్ నానబెట్టి ఉదయాన్నే తింటే ఏమవుతుందో తెలుసా?
కొలెస్ట్రాక్ ప్రాబ్లమ్ కి వంటగదిలోనే మెడిసిన్..తెలిస్తే ఆశ్చర్చపోవాల్సిందే
ఈ రోజుల్లో చాలామందిని ఇబ్బందిపెడుతున్న అనారోగ్య సమస్యల్లో కొలెస్ట్రాల్ కూడా ఒకటి. కొలెస్ట్రాల్ అనేది ఒక రకమైన కొవ్వు, ఇది సాధారణంగా మన రక్తంలో ఉంటుంది. ఇది మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అని రెండు రకాలు ఉంటాయి. పరిమిత పరిమాణంలో ఇవి శరీరానికి అవసరం. అయితే చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే గుండె సంబంధిత జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందువల్ల కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం చాలా ముఖ్యం. అయితే వంటగదిలో ఉండే కొన్ని మసాలాలు కొలెస్ట్రాల్ లెవల్ ని తగ్గించగలవలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూడండి.
దాల్చిన చెక్క
దాల్చిన చెక్క రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. దాల్చిన చెక్కలో ఉండే కొమారిన్ అనే సమ్మేళనం బ్లడ్ లో షుగర్ లెవల్స్ ని తగ్గించడంలో సహాయపడుతుంది,ఇది కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది.

వెల్లుల్లి
ప్రతి భారతీయ వంటగదిలొ ఉండే వెల్లుల్లి కొలెస్ట్రాల్ ని తగ్గించండంలో హెల్ప్ చేస్తుంది. వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. వెల్లుల్లిని రోజూ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గుతుంది. అంతేకాకుండా ఇది వాపును కూడా తగ్గిస్తుంది..ధమనులను ఆరోగ్యంగా ఉంచుతుంది.
నల్ల మిరియాలు
నల్ల మిరియాలు లేదా బ్లాక్ పెప్పర్ వంటగదిలో ఉండే చాలా సాధారణ మసాలా. ఇందులో పైపెరిన్ అనే సమ్మేళనం ఉంటుంది..ఇది శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది
పసుపు
పసుపు లేని భారతీయ వంటగది ఉండదు. పేదలైనా,ధనవంతులైనా ప్రతి ఒక్కరి ఇంట్లో పసుపు ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. కర్కుమిన్ కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నిరోధించడంలో సహాయపడుతుంది..తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
మెంతులు
మెంతులు రుచికి, ఔషధ గుణాలకు ప్రసిద్ధి. ఇందులో ఫినోలిక్ యాసిడ్ ఉంటుంది, ఇది కొలెస్ట్రాల్ లెవల్స్ ని తగ్గించడంలో సహాయపడుతుంది
వాము
వాములో థైమోల్ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.. కొలెస్ట్రాల్ శోషణను తగ్గిస్తుంది. చిన్న పిల్లలకు అజీర్తితో కడుపునొప్పికి వాము ఆకు మంచి ఔషధం. వాము ఆకు రసంలో తేనె కలిపి చిన్న పిల్లలకు ఇస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications