Latest Updates
-
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్..
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.!
నేటి ఆధునిక జీవనశైలి కారణంగా శారీరకంగా మానసికంగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వివిధ ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రుల బాట పడుతున్నారు. అయితే ఈ సమస్యలకి మెయిన్ రీజన్ మనం తీసుకుంటున్న ఆహారమే అనేది వాస్తవం. అందుకే ఇటీవలి కాలంలో చాలా మంది జీవితాల్లో తమ డైట్‌లో చాలా మార్పులు చేసుకున్నారు. ఎంత తినాలి, ఏం తినాలి అనేది ఒక లెక్కకి వస్తున్నారు. కానీ ఒక దాని విషయంలో మాత్రం కొన్నిసార్లు కాంప్రమైజ్ కాలేకపోతున్నారు. ఇది ఆల్కహాల్ కంటే చాలా డేంజర్ అని.. దీని వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి అదేంటి.. డాక్టర్ ఇస్తున్న సలహాలు ఏంటి చూద్దాం..

ఆడవారైనా, మగవారైనా ఈ డ్రింక్ అస్సలు తాగకూడదని డాక్టర్ స్మృతి మువ్వ అంటున్నారు. ఈ డ్రింక్ ఆల్కహాల్ కంటే చాలా ప్రమాదకరమైనదనే విషయం చాలా మందికి తెలియదని హెచ్చరిస్తున్నారు. చాలా మందిలో బరువు పెరగడానికి, ఒత్తిడి, పలు ఆరోగ్య సమస్యలకి ఈ పానీయమే కారణమట. అదే కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్..
ఫంక్షన్స్‌లో, పండుగల్లో భోజనం తర్వాత, బిర్యానీ తిన్న తర్వాత చాలా మందికి కూల్ డ్రింక్స్ లేదా సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవడం అలవాటు. ఇవి తీసుకోనిదే వారికి కడుపు నిండా తృప్తిగా తిన్న ఫీల్ ఉండదు. కానీ ఈ అలవాటు కారణంగా స్త్రీ, పురుషుల్లో అనేక రకాల సమస్యలకి దారితీస్తుంది.
అధిక బరువు
కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్‌లో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మీ ప్రమేయం లేకుండానే బరువు పెరిగే ప్రమాదం ఉంది. ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి డయాబెటిస్(మధుమేహం) వచ్చే అవకాశాలు ఉన్నాయి.

డెంటల్ ప్రాబ్లమ్స్
ఈ చక్కెర పానీయాలు తీసుకోవడం వల్ల డెంటల్ సమస్యలు తలెత్తే ఉందని డాక్టర్ అంటున్నారు. ఈ చల్లని పానీయాల ప్రభావం పళ్లపై తీవ్రంగా పడుతుంది. వీటిలో ఉండే ఆమ్లాలు పళ్లపై ఉండే ఎనామిల్ పొరను దెబ్బతీయవచ్చు. దీంతో త్వరగా పళ్లు అరిగిపోవడం, దెబ్బతినడం జరిగే ప్రమాదం ఉంది.
ఎముకల ఆరోగ్యం
వీటిని ఎక్కువగా తీసుకుంటే ఎముకల ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావం చూపిస్తుంది. బీపీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. గుండె ఆరోగ్యంలో సైతం ప్రతికూల మార్పులు కనిపిస్తాయని అంటున్నారు.
మీరు ఎంత డైట్ పాటించినా ఈ ఒక్క అలవాటుతో వాటి ఫలితం కనిపించదు. అందుకే ఈ అలవాటును వీలైనంత త్వరగా మానేయడం మంచిదని సూచిస్తున్నారు. సాఫ్ట్ డ్రింక్స్, కూల్‌డ్రింక్స్‌కి బదులుగా కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ, ఇంట్లోనే చేసుకునే తాజా పండ్ల రసాలు లేదా డాక్టర్ సూచించిన ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటిని తాగడం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
