Latest Updates
-
నాన్‌వెజ్ రుచిని మరిపించే మష్రూమ్ కర్రీ.. గ్రేవీ ఇలా చేశారంటే అద్భుతః అనాల్సిందే.! -
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
తల్లి కావడం అనేది ప్రతి మహిళ జీవితంలో అత్యంత అందమైన, మధురమైన ఘట్టం. అయితే ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించడానికి ముందు సరైన ప్రణాళిక, శారీరక సంసిద్ధత చాలా ముఖ్యం. కేవలం మానసికంగా సిద్ధపడితే సరిపోదు, శరీరంలో ఎలాంటి పోషక లోపాలు లేకుండా చూసుకోవాలి.
గర్భధారణకు ప్లాన్ చేసుకునే ముందు మహిళలు తప్పనిసరిగా సరిదిద్దుకోవాల్సిన ముఖ్యమైన సమస్య ఐరన్ లోపం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం చాలామంది మహిళలు ఈ సమస్యను తేలికగా తీసుకుంటారు. కానీ ఇది తల్లితో పాటు పుట్టబోయే బిడ్డపై తీవ్రమైన ప్రభావాన్ని చూపతుంది. అసలు ఐరన్ ఎందుకు అంత ముఖ్యం? గర్భధారణ సమయంలో ఇది తగ్గితే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయి? అనే విషయాలను ఇక్కడ చూడండి.

శరీరానికి ఐరన్ ఎందుకు అంత కీలకం?
సాధారణంగా మన శరీరంలో రక్తం ఉత్పత్తికి, ముఖ్యంగా హిమోగ్లోబిన్ తయారీకి ఐరన్ అత్యంత అవసరం. శరీరంలో ఐరన్ స్థాయిలు తగ్గితే, సహజంగానే హిమోగ్లోబిన్ శాతం పడిపోతుంది. మన శరీరంలోని ప్రతి కణానికి, అన్ని అవయవాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేసే అతిపెద్ద బాధ్యత హిమోగ్లోబిన్ దే. కాబట్టి ఐరన్ లోపిస్తే ఆక్సిజన్ సరఫరాకు ఆటంకం ఏర్పడి, మొత్తం ఆరోగ్య వ్యవస్థ దెబ్బతింటుందని నిపుణులు సూచిస్తున్నారు.
గర్భధారణ సమయంలో ఐరన్ లోపం ఎందుకు ప్రమాదకరం?
సాధారణ సమయాల్లో కంటే గర్భంతో ఉన్నప్పుడు మహిళలకు రెట్టింపు రక్తం, ఐరన్ అవసరం అవుతాయి. గర్భధారణకు ముందే మహిళల్లో ఐరన్ లోపం ఉంటే గర్భం దాల్చిన తర్వాత ఆ సమస్య మరింత తీవ్ర రూపం దాలుస్తుంది. దీనివల్ల కడుపులోని బిడ్డ ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
ముఖ్యంగా శిశువు నెలలు నిండకుండానే జన్మించే ప్రమాదం ఉంటుంది. పుట్టిన బిడ్డ బరువు సాధారణం కంటే చాలా తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా, ప్రసవ సమయంలో తల్లికి అధిక రక్తస్రావం జరిగే ముప్పు కూడా పొంచి ఉంటుంది. ఇది కొన్నిసార్లు తల్లి ప్రాణాలకే ప్రమాదకరం కావచ్చు.
మహిళల్లో ఈ లోపానికి ప్రధాన కారణాలు, లక్షణాలు
సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, పోషక విలువలు లేని ఆహారం తినడం వల్లే ప్రధానంగా మహిళల్లో ఐరన్ లోపం తలెత్తుతోంది. అయితే ఈ సమస్య ముదిరిపోక ముందే శరీరం మనకు కొన్ని సంకేతాల ద్వారా హెచ్చరిస్తుంది.
-చిన్న పనికే విపరీతమైన అలసట రావడం.
-శారీరక బలహీనత, నీరసం ఆవహించడం.
-తరచుగా తలతిరగడం.
-శరీరంలో ఎప్పుడూ శక్తి లేనట్లుగా అనిపించడం.
పరిష్కారం ఏమిటి?
గర్భధారణకు ప్లాన్ చేసుకుంటున్నట్లయితే, ముందుగా డాక్టర్లను సంప్రదించి రక్త పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. ఒకవేళ లోపం ఉంటే, దాన్ని అధిగమించడానికి ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారంలో మార్పులు చేసుకోమని డాక్టర్లు సూచిస్తారు. అవసరాన్ని బట్టి ఐరన్ సప్లిమెంట్స్ (మందులు) కూడా ఇస్తారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications