Latest Updates
-
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.?
షుగర్ వ్యాధిలో కొత్త రకం..భయాందోళనలు పుట్టిస్తున్న టైప్ 5 డయాబెటిస్!..ఇది ఎందుకు,ఎవరికి వస్తుంది?
షుగర్ వ్యాధి లేదా డయాబెటిస్ పేరు వింటేనే చాలామంది హడలెత్తిపోతారు. మనదేశంలో కోట్ల మందిని వేధిస్తున్న సమస్య ఇది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది షుగర్ వ్యాధిగ్రస్థులు ఉన్నది కూడా మన దేశంలోనే. అందుకే మనదేశాన్ని వరల్డ్ డయాబెటిస్ రాజధాని అని కూడా పిలుస్తుంటారు. అయితే ఇప్పటిదాకా మనకు తెలిసిన డయాబెటిస్ లేదా మధుమేహం రెండు రకాలు మాత్రమే. టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ గురించి మాత్రమే ఇప్పటిదాకా సామాన్య జనానికి తెలిసేది. అయితే టైప్ 5 డయాబెటిస్ ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చింది. పోషకాహార లోపం ఉన్న టీనేజర్లు, యువకులను ఎక్కువగా బాధిస్తున్న ఓ కొత్త రకం డయాబెటిస్ ను సైంటిస్టులు గుర్తించారు.
ఏప్రిల్ 7,2025 నుంచి ఏప్రిల్ 10 వరకు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో నిర్వహించిన వరల్డ్ డయాబెటిస్ కాంగ్రెస్ 2025 వేదికగా ఇంటర్నేషన్ డయాబెటిస్ ఫెడరేషన్(IDF) దీనిని అధికారికంగా టైప్ 5 డయాబెటిస్ గా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 2.5 కోట్ల మందికి టైప్ 5 డయాబెటిస్ బారిన పడ్డారని అంచనా. వీరిలో ఎక్కువగా ఆసియా,ఆఫ్రికా దేశాలకు చెందినవాళ్లే ఉన్నట్లు అంచనా. ఆశ్చర్యకరంగా..చాలామందికి ఇన్సులిన్ కూడా అసరం లేకుండా ఉంది. వాస్తవానికి టైప్ 1 డయాబెటిస్ లో ఇంజెక్షన్లు తప్పనిసరి కానీ దీని పరిస్థితి వేరుగా ఉంది.

ఈ రకమైన డయాబెటిస్ ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఎప్పటినుంచో ఉన్నప్పటికీ సరైన అవగాహన లేక చాలామంది దీన్ని టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటిస్ గా పొరబడ్డారు. అయితే ఇప్పుడు డాక్టర్ మెరెడిత్ హాక్సిన్ నేతృత్వంలోని పరిశోధనలు ఈ వ్యాధికి ప్రత్యేక గుర్తింపుని తీసుకొచ్చింది.
టైప్ 5 డయాబెటిస్ అంటే ఏమిటి?
సాధారణంగా దీనిని పోషకాహార లోపం సంబంధిత డయాబెటిస్ అని కూడా అంటారు. చిన్న వయస్సులో సరైన పోషహాకారం అందని బలహీనంగా ఉండే వ్యక్తు..టైప్ 2 డయాబెటిస్ ఊబకాయం,ఇన్సులిన్ నిరోధకతతో ముడిపడి ఉండగా..టైప్ 5 డయాబెటిస్ మాత్రం పోషకాహారం సరిగ్గా లేకపోవడం వల్ల క్లోమం సరిగ్గా డెవలప్ అవకపోవడం వల్ల వస్తుంది. టైప్ 5 డయాబెటిస్ ఉన్నోళ్లలో ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువ ఉంటుంది..అయితే టైప్ 2 డయాబెటిస్ వాళ్లలో ఉండే మాదిరి శరీరం ప్రతిస్పందించకపోవడంలా ఉండదు. అందుకే టైప్ 5 డయాబెటిస్ ఉన్నోళ్లకి ఇన్సులిన్ ఇంజెక్షన్లు అక్కర్లుదు. కేవలం నోటి మెడిసిన్ తోనే దీన్ని కంట్రోల్ చేయవచ్చు.
ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు
ఈ కొత్త రకం డయాబెటిస్ పై మరింత లోతైన అధ్యయనం చేయడానికి, సరైన రోగ నిర్థారణ, ట్రీట్మెంట్ కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించడానికి ఓ ప్రత్యేక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటైనట్లు ఐడీఎఫ్ ప్రెసిడెంట్ పటర్ స్క్వార్డ్ ప్రకటించారు.
WHO ఏం చేసింది
వాస్తవానికి 1950లలోనే పోషహాకారంలోపం వల్ల వచ్చే డయాబెటిస్ ను గుర్తించినప్పటికీ ప్రపంచ పరిశోధనల్లో దీనికి తగిన ప్రాధాన్యం లభించలేదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1985లో దీనిని ప్రత్యేక రకంగా గుర్తించి..సరైన డేటా లభించకపోవడంతో 199లో ఆ గుర్తింపుని తొలగించింది. అయితే 2010లో డాక్టర్ హాకిన్స్ గ్లోబల్ డయాబెటిస్ ఇనిస్టిట్యూట్ ని స్థాపించి ఈ పరిస్థితిపై ప్రత్యేకంగా పరిశోధనలు ప్రారంభించింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications