Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
చిన్న జ్వరానికే మందులు మింగుతున్నారా? ఆగండి.. కేంద్రం కొత్త రూల్ ఇదే!
చిన్న జ్వరానికో, జలుబుకో మెడికల్ షాపుకు వెళ్లి ఇష్టారాజ్యంగా ట్యాబ్లెట్స్ కొని వేసుకుంటున్నారా? అయితే మీరు కాస్త ఆగాల్సిందే. దేశంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న యాంటీబయాటిక్స్ వాడకానికి అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది.
ఇకపై మీరు కొనే మందు బిళ్ళల ప్యాకెట్ (Strip) చూస్తే చాలు.. అది యాంటీబయాటిక్ అవునో కాదో ఇట్టే తెలిసిపోతుంది.

ఎందుకీ ఆకస్మిక నిర్ణయం?
ప్రస్తుతం మన దేశాన్ని యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్(AMR) అనే సమస్య తీవ్రంగా భయపెడుతోంది. అతిగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల.. మన శరీరంలోని బ్యాక్టీరియా ఆ మందులకు అలవాటుపడిపోతోంది.
ఫలితంగా భవిష్యత్తులో ఏదైనా పెద్ద ఇన్ఫెక్షన్ వచ్చి నిజంగా మందులు అవసరమైనప్పుడు అవి మన శరీరంపై పనిచేయడం మానేస్తాయి. సాధారణ జబ్బులు కూడా ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. ఈ ముప్పును నివారించడానికే ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చింది.
ప్యాకేజింగ్ లో రాబోతున్న మార్పులేంటి?
యాంటీబయాటిక్స్ ను సులభంగా గుర్తించడానికి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది.
దీని ప్రకారం యాంటీబయాటిక్ మందుల స్ట్రిప్స్ లేదా బాక్సులకు ఒక నిర్దిష్టమైన రంగు ఉదాహరణకు ఎరుపు గీత వంటివి తప్పనిసరి చేయనున్నారు.
ప్యాకేజింగ్‌పై స్పష్టమైన చిహ్నాలు, ఆల్ఫాన్యూమరిక్ కోడ్స్ లేదా క్యూఆర్ కోడ్ లను ముద్రిస్తారు. దీనివల్ల రోగులే కాదు, ఫార్మసిస్ట్ లు కూడా మందులు ఇచ్చేటప్పుడు అది యాంటీబయాటిక్ అని సులభంగా గుర్తించి అప్రమత్తమవుతారు.
ప్రధాని మోదీ ఆవేదన..ఢిల్లీ మహిళ ఉదంతం
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ ..యాంటీబయాటిక్స్ దుర్వినియోగంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీకి చెందిన ఒక మహిళ ఉదంతాన్ని ఆయన ఉదహరించారు.
ఆమెకు ఏకంగా 15 రకాల వేర్వేరు యాంటీబయాటిక్స్ ఇచ్చినా, ఆమె శరీరంలోని ఇన్ఫెక్షన్ తగ్గలేదని, ఏ మందూ ఆమెపై ప్రభావం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మందులు పనిచేయని ఇలాంటి స్థితి ఎవరికీ రాకూడదనేదే ప్రభుత్వ ఉద్దేశం.
ప్రజలు ఏం చేయాలి?
కేంద్రం జాతీయ స్థాయి అవగాహన ప్రచారాన్ని ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగానే ప్యాకేజింగ్ మార్పులు జరుగుతున్నాయి. సామాన్యులుగా మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే.. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ కొనకూడదు.
ప్యాకేజింగ్ పై వచ్చే కొత్త గుర్తులను గమనించి, అవి యాంటీబయాటిక్స్ అని తెలిస్తే డాక్టర్ల సలహా మేరకే వాడాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications