Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Breast Cancer: మహిళలకు బిగ్ షాకింగ్..బరువు ఎక్కువగా ఉంటే రొమ్ము క్యాన్సర్!
క్యాన్సర్ పేరు వింటేనే కొంతమందికి గుండెల్లో దడ పుడుతుంది. కొందరికి అయితే చివరి స్టేజీ వరకు తమకు క్యాన్సర్ ఉందన్న సంగతి కూడా తెలియట్లేదు..తీరా తెలిసేసరికి ప్రాణాలు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. మనదేశంలో క్యాన్సర్ ఒక నిశ్శబ్ద మహమ్మారిలా విస్తరిస్తోంది. ప్రతి సంవత్సరం సుమారు 14 లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడుతుండగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ అత్యంత సాధారణంగా కనిపిస్తోంది. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే ఏటా లక్ష మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి ప్రధాన కారణం 70శాతం కేసులు వ్యాధి ముదిరిన మూడవ దశలో కానీ బయటపడకపోవడమే.
ఇప్పటిదాకా రొమ్ము క్యాన్సర్ కు పేలవమైన జీవనశైలి, ఆలస్య వివాహాలు,శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలను చూశాం. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చేసిన ఒక సంచలన అధ్యయనం మహిళలకు పొంచి ఉన్న మరో పెను ప్రమాదాన్ని బయటపెట్టింది.

ఊబకాయం, గుండె జబ్బులు
ప్రఖ్యాత అమెరికన్ క్యాన్సర్ సొసైటీ జర్నల్ లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం అధిక బరువు ఉండటం రొమ్ము క్యాన్సర్ ముప్పును పెంచుతుంది. ముఖ్యంగా రుతుక్రమం ఆగిపోయిన తర్వాత అధిక బరువుతో పాటు గుండె జబ్బులతో బాధపడుతున్న మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం చాలా రెట్లు పెరుగుతోందని ఈ అధ్యయనం తేల్చిచెప్పింది. ఊబకాయం అనేది డయాబెటిస్ ఉన్నా లేకపోయినా రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతోందని స్పష్టమైంది. అంటే మెనోపాజ్ దశ, ఊబకాయం, గుండె జబ్బులు అనే ఈ మూడు అంశాలు కలిస్తే అది అత్యంత ప్రమాదకరమైన కలయికగా మారుతుంది.
ఈ నిర్ధారణకు రావడానికి పరిశోధకులు దాదాపు 1.68 లక్షల మంది రుతుక్రమం ఆగిన మహిళల డేటాను 10-11 సంవత్సరాల పాటు విశ్లేషించారు. ఈ కాలంలో అధిక బరువు, గుండె జబ్బులు ఉన్న ప్రతి లక్ష మంది మహిళల్లో ప్రతి సంవత్సరం 153 అదనపు రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదయ్యాయని కనుగొన్నారు.
కేవలం రొమ్ము క్యాన్సరే కాదు..
ఊబకాయం కేవలం రొమ్ము క్యాన్సర్ కే కాదు గర్భాశయం, మూత్రపిండాలు, కాలేయం, కొలొరెక్టల్ క్యాన్సర్ వంటి మరో 12 రకాల క్యాన్సర్లకు కూడా కారణమవుతుందని గత పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. అంతేకాకుండా నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురితమైన మరో అధ్యయనం ప్రకారం అధిక బరువు ఉన్న మహిళల్లో ఏర్పడే క్యాన్సర్ కణితులు పెద్దవిగా ఉండటమే కాకుండా వ్యాధి దశ కూడా తీవ్రంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications