Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
షుగర్ వ్యాధికి, సూర్యకాంతికి లింక్ ఏంటి? తాజా పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయాలు
ఈ రోజుల్లో మనదేశంలో కోట్ల మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల దాకా వయస్సుతో సంబంధం లేకుండా ఈ వ్యాధి అందరినీ టెన్షన్ పెడుతోంది. షుగర్ ఒక్కసారి వస్తే దాన్ని కంట్రోల్ చేసే అవకాశాలు ఉన్నాయి తప్ప దాన్ని పూర్తిగా నయం చేసే మెడిసిన్స్ ఏవీ ఇప్పటికైతే లేవు.
అయితే మీరు టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతున్నారా? మందులు, ఎక్సర్ సైజ్, కఠినమైన ఆహార నియమాలు పాటిస్తున్నా రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉండటం లేదా? అయితే మీ దినచర్యలో ఒక చిన్న మార్పు చేసుకుంటే సరిపోతుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. కేవలం కిటికీ దగ్గర కూర్చుని సహజమైన సూర్యకాంతిని ఆస్వాదించడం ద్వారా షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవచ్చని నెదర్లాండ్స్ సైంటిస్టులు కనిపెట్టారు.

ఆసక్తికరమైన అధ్యయనం ఏం చెబుతోంది?
నెదర్లాండ్స్ లోని ప్రముఖ మాస్ట్రిక్ట్ యూనివర్సిటీ మెడికల్ స్కూల్ కు చెందిన హ్యూమన్ బయాలజీ విభాగం ప్రొఫెసర్ జోరిస్ హోక్స్ ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరిగింది. ఈ అధ్యయన వివరాలు ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ జర్నల్ సెల్ మెటబాలిజంలో పబ్లిష్ అయ్యాయి.
సహజమైన సూర్యకాంతి మన శరీరంపై ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడమే ఈ ప్రయోగం ప్రధాన ఉద్దేశం. దీని కోసం పరిశోధకులు సుమారు 70 ఏళ్ల వయసున్న 13 మంది టైప్ 2 డయాబెటిస్ పేషెంట్లను సెలెక్ట్ చేశారు. వారిని రెండు దశల్లో పరీక్షించారు.
మొదటి దశ: పెద్ద కిటికీలు ఉన్న గదిలో 4.5 రోజుల పాటు ఉంచారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కేవలం కిటికీ నుండి వచ్చే సహజ సూర్యకాంతిలో గడిపారు.
రెండవ దశ: కొన్ని రోజుల విరామం తర్వాత అదే వ్యక్తులను కిటికీలు లేని, కేవలం కృత్రిమ లైట్లు మాత్రమే ఉన్న గదిలో మరో 4.5 రోజులు ఉంచారు.
రెండు సందర్భాల్లోనూ వారికి ఒకే రకమైన ఆహారం, మందులు, నిద్రవేళలు పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఫలితాలు చూసి ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు
ఈ ప్రయోగం ఫలితాలు చాలా స్పష్టమైన వైవిధ్యాన్ని చూపించాయి. సహజమైన సూర్యకాంతిలో గడిపినప్పుడు, వారి రక్తంలో షుగర్ లెవల్స్ ఎక్కువ సమయం (సుమారు 50శాతం సమయం) సాధారణ పరిధిలోనే ఉన్నాయి.
అదే వ్యక్తులు కృత్రిమ కాంతిలో గడిపినప్పుడు వారి షుగర్ లెవెల్స్ కేవలం 43శాతం సమయం మాత్రమే అదుపులో ఉన్నాయి.
చూడటానికి ఈ వ్యత్యాసం చిన్నదిగా అనిపించవచ్చు. కానీ రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణ పరిధి దాటి ఎంత ఎక్కువ సమయం ఉంటే గుండె జబ్బులు వంటి తీవ్రమైన సమస్యల ముప్పు అంత పెరుగుతుంది. కాబట్టి ఈ చిన్న మార్పు కూడా దీర్ఘకాలిక ఆరోగ్యానికి చాలా కీలకమైనది అని ప్రొఫెసర్ హోక్స్ నొక్కిచెప్పారు.

అసలు సూర్యకాంతికి, షుగర్ కి లింక్ ఏంటి?
దీనికి ప్రధాన కారణం మన శరీరంలోని సిర్కాడియన్ రిథమ్(Circadian Rhythm). దీనిని జీవ గడియారం అని కూడా అంటారు. మన శరీర విధులన్నీ 24 గంటల చక్రంపై ఆధారపడి ఉంటాయి. సూర్యకాంతి, ముఖ్యంగా అందులోని నీలి కాంతి తరంగాలు, మన కళ్ళలోని ప్రత్యేక కణాలను ప్రేరేపిస్తాయి.
జీవక్రియ మెరుగుదల: సూర్యకాంతి తగలగానే శరీరం చురుగ్గా మారుతుంది. ఇది కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది మరియు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది.
మంచి నిద్ర: పగలు తగినంత సూర్యకాంతి తగిలితే రాత్రివేళ నిద్రకు సహాయపడే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి సక్రమంగా జరుగుతుంది. మంచి నిద్ర కూడా షుగర్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది.
కండరాల ఆరోగ్యం: సహజ కాంతిలో కండరాల కణాల పనితీరు మరింత స్థిరంగా ఉంటుందని, తద్వారా శక్తి వినియోగం బాగుంటుందని అధ్యయనం తెలిపింది.
నిపుణుల సలహా
యూనివర్సిటీ కాలేజ్ లండన్ కు చెందిన ప్రొఫెసర్ గ్లెన్ జెఫ్రీ ఈ అధ్యయనాన్ని ప్రశంసిస్తూ..మన శరీరానికి పగటి వెలుతురు ఎంత అవసరమో చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ అని తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











