Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Heart Attack Vaccine: ఇక నో టెన్షన్..గుండెపోటుకి వ్యాక్సిన్ వచ్చేసింది..
ఈ మధ్య కాలంలో గుండెపోటు లేదా స్ట్రోక్ మరణాలు విపరీతంగా పెరిగిపోయాయి. కూర్చున్నవాళ్లు కూర్చున్నచోటే కూలబడి..నడుస్తూనే సడెన్ గా కిందపడి మరణించడం ఇలాంటివి నిత్యం మనం సోషల్ మీడియాలో చూస్తేనే ఉన్నాం. ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు గుండెపోటుకి వ్యాక్పిన్ వచ్చేసింది. ఒక్కసారి షింగిల్స్ వ్యాక్సిన్ తీసుకుంటే 8 ఏళ్ల వరకు టెన్షన్ పడక్కర్లేదని నిపుణులు చెబుతున్నారు.
షింగిల్స్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. చికెన్ పాక్స్ కు కూడా ఈ వైరస్ కారణం. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నోళ్లపై ఈ వైరస్ ఎటాక్ చేస్తుంది. 50 ఏళ్లు పైబడిన వాళ్లకు ఎక్కువగా వస్తుంది. అయితే దీనిని నివారించడానికి వ్యాక్సిన్లు ఉన్నాయి. అయితే షింగిల్స్ వ్యాక్సిన్ గుండె సంబంధిత వ్యాధులను 23శాతం తక్కువగా, గుండె పోటు వచ్చే ప్రమాదం 22శాతం తక్కువగా,గుండె పోటు మరణాల ప్రమాదం 26 శాతం తక్కువగా ఉంటుందని, మెదడులో రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేసే స్ట్రోక్స్ వంటి వ్యాధుల ప్రమాదం 24శాతం తక్కువగా ఉంటుందని అధ్యయనంలో తేలింది.

ఒక్కసారి ఈ వ్యాక్సిన్ వేసుకుంటే 8 ఏళ్ల వరకు దాని ఎఫెక్ట్ ఉంటుందని తేలింది. కాగా 12 లక్షలమంది ప్రజల బీమా డేటా ఆధారంగా ఆరేళ్ల పాటు ఈ అధ్యయనం చేపట్టారు. ప్రమాద కారకాలు తెలియని వ్యక్తుల్లో కూడా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో షింగిల్స్ వ్యాక్సిన్ సహాయపడుతుందని అధ్యయనం సూచిస్తోందని ఈ అధ్యయన రచయిత క్యుంగ్ హీ యూనివర్శిటీ ఫ్రొఫెసర్ డాంగ్ కియోన్ యోన్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా రెండు ఆమోదించబడిన షింగిల్స్ వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు మనదేశంలో అందుబాటులో ఉన్నాయి.
మరోవైపు, ఈ అధ్యయనంపై కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ అధ్యయనం పాత లైవ్ వ్యాక్సిన్ ఇచ్చిన వ్యక్తుల డేటాపై ఆధారపడి ఉందని, కాబట్టి కొత్త వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులపై అధ్యయనాలు నిర్వహించాలని..అప్పుడే అసలు విషయాలు బయటికొస్తాయని కొందరు పరిశోధకులు చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications