Latest Updates
-
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.! -
ఉద్యోగం వదిలి వ్యాపారం చేస్తే... ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
నాన్‌వెజ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వెజ్ ప్రియుల కోసం స్పెషల్ లివర్ ఫ్రై.. రెస్టారెంట్ టేస్ట్‌తో.! -
అమ్మమ్మల నాటి చిట్కా..గ్యాస్, ఎసిడిటి,అజీర్తి సమస్యలకు చెక్! -
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి! -
పెళ్లిళ్లు, పండుగల్లో అమ్మాయిలూ జాగ్రత్త.. మెహందీ పెట్టుకుంటే పొట్ట ఇన్ఫెక్షన్ల ప్రమాదం.! -
ఉప్మా తినడం ఇష్టం లేని వారికి రవ్వతో ఇలా చేసి పెట్టండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.! -
జన్మాష్టమి రోజు ద్వాపర యుగం నాటి అరుదైన సంఘటన.. ఈ ఐదు రాశుల వారిపై కృష్ణయ్య కటాక్షం.!
న్యూ ఇయర్ జోష్..డిసెంబర్ 31 రాత్రి వీళ్లు మందు జోలికి వెళ్తే హాస్పిటల్ పాలే!
ప్రపంచం మొత్తం ఇప్పుడు పండుగ మూడ్ లో ఉంది. 2025కి వీడ్కోలు పలికి, సరికొత్త ఆశలతో 2026కి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు అంతా సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 31 రాత్రి అంటేనే ఆకాశన్నంటే సంబరాలు. డీజే సౌండ్లు, స్నేహితుల హంగామా, రంగురంగుల లైట్లు.. వీటన్నింటితో పాటు చాలామంది పార్టీల్లో మందు ఉండాల్సిందే అని భావిస్తుంటారు.
అయితే అందరికీ ఆ కిక్ సెట్ కాదు. పండుగ పూట చేసుకునే ఒక చిన్న పొరపాటు, కొత్త ఏడాది మొత్తాన్ని హాస్పిటల్ పాలు చేయగలదు. వైద్య నిపుణుల హెచ్చరికల ప్రకారం కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు న్యూ ఇయర్ పార్టీలో ఆల్కహాల్‌ను తాకకపోవడమే మంచిది. లేదంటే ఆనందం ఆవిరై, ఆరోగ్యం అల్లకల్లోలమవుతుంది. 2026 వేడుకల్లో మద్యం జోలికి అస్సలు వెళ్లకూడని వారు ఎవరో ఇక్కడ చూడండి.

లివర్ సమస్యలు ఉన్నవారా?
కాలేయం మన శరీరానికి ఇంజిన్ లాంటిది. ఇప్పటికే ఫ్యాటీ లివర్, హెపటైటిస్ లేదా లివర్ సిర్రోసిస్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఆల్కహాల్ విషంతో సమానం.
నిపుణుల ప్రకారం.. ఆల్కహాల్ నేరుగా కాలేయ కణాలను నాశనం చేస్తుంది. మీరు పార్టీ మూడ్ లో తీసుకునే అతి తక్కువ మోతాదు మద్యం కూడా లివర్ ఫెయిల్యూర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారు తాగితే పరిస్థితి మరింత విషమిస్తుంది.
గుండె పదిలంగా ఉండాలంటే..
బీపీ పేషెంట్లు, గుండె జబ్బులు ఉన్నవారు మందు గ్లాసును దూరం పెట్టడమే క్షేమం. మద్యం తాగిన వెంటనే రక్తపోటు అకస్మాత్తుగా పెరుగుతుంది. ఇది గుండెపోటు లేదా పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని తీవ్రతరం చేస్తుంది.
అంతేకాకుండా గుండె జబ్బుల కోసం వాడే మందుల పనితీరును ఆల్కహాల్ దెబ్బతీస్తుంది. కొత్త ఏడాదిని గుండె బరువుతో కాకుండా, ఆరోగ్యంగా ప్రారంభించండి.
షుగర్ పేషెంట్లు అలర్ట్
షుగర్ ఉన్నవారికి మద్యం అత్యంత ప్రమాదకరం. ఆల్కహాల్ రక్తంలో షుగర్ లెవల్స్ ను అమాంతం పెంచేస్తుంది లేదా ఒక్కసారిగా పడిపోయేలా చేస్తుంది. దీనివల్ల పార్టీలోనే కళ్ళు తిరిగి పడిపోవడం, మూర్ఛ రావడం జరగవచ్చు. ముఖ్యంగా ఖాళీ కడుపుతో మద్యం సేవించడం డయాబెటిస్ రోగుల ప్రాణాల మీదకు తెస్తుంది.
గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నాయా?
అల్సర్లు, గ్యాస్ట్రిటిస్, ఎసిడిటీతో బాధపడేవారు మద్యం తీసుకుంటే కడుపులోని పొరలు దెబ్బతింటాయి. దీనివల్ల తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, కొన్నిసార్లు అంతర్గత రక్తస్రావం కూడా జరగవచ్చు.
మానసిక ప్రశాంతత ముఖ్యం
మైగ్రేన్ తలనొప్పి, ఆందోళన, డిప్రెషన్ లేదా మూర్ఛ వ్యాధి ఉన్నవారిలో ఆల్కహాల్ ఆయా లక్షణాలను రెట్టింపు చేస్తుంది. ఇది తీవ్రమైన తలనొప్పిని తెప్పించడమే కాకుండా, నిద్రలేమి సమస్యలను పెంచుతుంది. నాడీ సంబంధిత మందులు వాడేవారు మద్యం తాగితే విపరీతమైన దుష్ప్రభావాలు కలుగుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications