Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
గుండెపోటుతో శోభనం గదిలో దంపతుల మృతి.. సెక్స్ చేసుకోవడమే కారణమా, వైద్యులు ఏం చెబుతున్నారంటే?
వారిద్దరూ పెళ్లి గురించి ఎన్నో కళలు కన్నారు. స్నేహితులు, బంధువులు అందరినీ పిలిచి ఘనంగా పెళ్లి చేసుకున్నారు. సుఖసంతోషాల మధ్య కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నారు. మొదటి రాత్రి గురించి ఎన్నెన్నో కలలు కంటూ.. చిలిపి క్షణాలను ఊహించుకుంటూ ఇద్దరూ గదిలోకి వెళ్లారు. కానీ వాళ్లు అదే శోభనం గదిలోనే గుండెపోటుతో మరణించారు. ఈ విషాధ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని బహ్రైచ్ జిల్లాలో చోటు చేసుకుంది.
22 ఏళ్ల ప్రతాప్ యాదవ్, 20 ఏళ్ల పుప్షలు ఇద్దరికీ ఒకేసాగి గుండెపోటు వచ్చి చనిపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సెక్స్ వల్లే వీరిద్దరూ గుండెపోటుకు గురయ్యారేమో అని చాలా మంది అనుకుంటున్నారు. అయితే దీనిపై వైద్యు నిపుణులు ఏం చెబుతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1. సెక్స్ గుండెకు ప్రమాదకరమా?
సెక్స్ లేదా శారీరక సాన్నిహిత్యం అనేది సహజమైన చర్య అని.. ఒక రకమైన ఏరోబిక్ శారీరక శ్రమ అని వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన గుండె ఉన్న వాళ్లకు అది ఎలాంటి ప్రమాదాన్ని కల్గించదని వివరిస్తున్నారు.
2. గుండె సమస్యలుంటే శృంగారం చేసుకోకూడదా?
లైంగిక కార్యకలాపాలు జంట హృదయ స్పందన రేటును పెంచుతుందని కార్డియాలజిస్ట్ నిపుణులు చెప్పారు. అయితే మెట్లు ఎక్కడం, జాగింగ్ చేయడం, కిలో మీటర్ నడవగల్గిన ఎవరైనా సెక్స్ చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలనూ ఎదుర్కోరని తెలిపారు. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల మరింత మంచి జరుగుతుందని వివరించారు.
3. సెక్స్ సమయంలో గుండెపోటు సంభివంచే అవకాశం ఎంత?
లైంగిక కార్యకలాపాల సమయంలో గుండెపోటు వచ్చే అవకాశం చాలా తక్కువని వైద్యులు వివరిస్తున్నారు. వారానికి ఒకసారి సెక్స్ చేసే ప్రతి పది వేల మందిలో ఇద్దరు నుంచి ముగ్గురు మాత్రమే గుండెపోటుకు గురవుతారని చెబుతున్నారు. లైంగిక సంభోగం వల్ల ఆక్సిజన్, రక్తప్రసరణ పెరుగుతుందని.. ఎలాంటి సమస్యలు లేని వారు చక్కగా సెక్స్ చేసుకోవచ్చని తెలిపారు.
4. సెక్స్ వల్ల గుండెకు ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా?
లైంగిక కార్యకలాపాలు చేస్తుండగా భయపడకూడదని.. సెక్స్ వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని వివరించారు. వారానికి కనీసం రెండు సార్లు సెక్స్ చేసే పురుషులు.. సంతృప్తికరమైన లైంగిక జీవితాన్ని కలిగి ఉన్నారని వివరించారు. అలాగే వారానికి రెండు సార్లు సెక్స్ లో పాల్గొంటు గుండెపోటు వచ్చే అవకాశం కూడా తగ్గుతుందని అన్నారు.
సెక్స్ అనేది ఓ రకమైన వ్యాయామం అని... రక్తపోటును, ఒత్తిడిని తగ్గిస్తూ నిద్రను మెరుగుపరచడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సెక్స్ వల్ల సంబంధంలో సాన్నిహిత్యం పెరుగుతుందని, మానసికంగా, శారీరకంగా చాలా సంతోషంగా ఉండేలా చేస్తుందని వివరిస్తున్నారు. కింద ఉన్న లక్షణాలతో మీరు ఏమైనా ఇబ్బంది పడితే ఓసారి వైద్యుడిని సంప్రదించడం మంచిదని అంటున్నారు.
1. ఛాతీ నొప్పి
2. శ్వాస ఆడకపోవడం
3. చేయి, మెడ మరియు భుజంలో నొప్పి
4. వికారం
5. విపరీతమైన చెమట
6. మైకము
7. అలసట
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications