Latest Updates
-
Viral Video: ఆ బుడ్డోడు మాములోడు కాదయ్యా..తానే చదివిస్తానంటూ ఆనంద్ మహీంద్రా బంపరాఫర్ -
పెళ్లై ఏళ్లు గడిచాక చాలా జంటలు భార్యాభర్తలుగా కాదు, రూమ్మేట్లలా జీవిస్తున్నారు మీరూ ఇలాంటివారేనా? -
మీ రాశి చక్రం ప్రకారం పడక గదిలో ఏ కలర్ పెయింటింగ్ వేస్తే మంచిదో తెలుసా.? -
రాజస్థాన్ ఫేమస్ లాల్ మాస్..మటన్ కూర ఇలా వండితే గిన్నెలో ఒక్క ముక్క కూడా మిగలదు! -
ఈ ఫ్రూట్‌తో పురుషుల్లో ఎనర్జీ రెట్టింపు.. శిలాజిత్ కంటే మోస్ట్ పవర్ఫుల్.! -
లక్ష్మీదేవి సముద్రం నుండి ఎందుకు పుట్టింది? దాచిన పురాణ కథ -
జూన్ 6 గ్రహ సంచారం: కుంభరాశిలో చంద్రుడి ప్రయాణం.. ఈ రాశుల వారికి అదృష్టం, సంపద వెల్లువ! -
మిథునం, తుల, కుంభ రాశుల వారికి శని దేవుని ఆశీస్సులు.. మీ రాశి ఉందా? - శనివారం, 06 జూన్ 2026 -
మన ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతోందా? ఈ 7 వాస్తు & ఆధ్యాత్మిక మార్గాలు సకారాత్మక శక్తిని పెంచుతాయట! -
పనీర్, కాలీఫ్లవర్‌తో ఇలా కుర్మా చేశారంటే.. నాన్‌వెజ్ కూడా దిగదుడుపే.!
జిమ్ లేదు, కఠినమైన డైట్ లేదు.. ఆ ఒక్క ఇంజెక్షన్ తో 22 కిలోలు తగ్గిన ఐశ్వర్య మోహన్ రాజ్!
జంక్ ఫుడ్ తింటుండటం, అతిగా తినడం, ఎలాంటి శారీరక శ్రమ లేకపోవడం, ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా ఈ రోజుల్లో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్పారు. అయితే బరువు తగ్గే ప్రయత్నంలో చాలామంది తినకుండా కడుపు మాడ్చుకోవడం, కఠినమైన డైట్, వ్యాయామాలు వంటి పద్ధతులు ఫాలో అవుతుంటారు. అయితే బరువు తగ్గడానికి ఇంజెక్షన్లు కూడా వచ్చేశాయి.
ప్రముఖ స్టాండ్ అప్ కమెడియన్, డిజిటల్ క్రియేటర్ ఐశ్వర్య మోహన్‌రాజ్ ఫిబ్రవరి 6న తన యూట్యూబ్ ఛానెల్ లో తన వెయిట్ లాస్ జర్నీ గురించి ఒక వీడియోను విడుదల చేసి హాట్ టాపిక్‌గా మారారు. మునుపటి కంటే చాలా సన్నగా, పదునైన ముఖ కవళికలతో ఆమె పూర్తిగా మారిపోయారు.

అసలేం జరిగింది? బరువు ఎందుకు పెరిగారు?
2021 ప్రారంభంలో ఐశ్వర్య కేవలం 51 కిలోల బరువుతో చాలా ఫిట్ గా ఉండేవారు. కానీ కేవలం ఆరు నెలల్లోనే ఆమె బరువు 70 కిలోలకు పెరిగిపోయింది. మెడికల్ టెస్టుల్లో ఆమెకు PCOD, హైపోథైరాయిడిజం ఉన్నట్లు తేలింది. ఇవి ఆమె కుటుంబంలోనూ ఉన్నాయి.
దీనికి తోడు ఆమెకు క్లినికల్ డిప్రెషన్(తీవ్రమైన కుంగుబాటు) ఉన్నట్లు కూడా నిర్ధారణ అయింది. ఆ సమయంలో తన డబుల్ చిన్(గడ్డం కింద కొవ్వు) చూసుకొని ఆత్మవిశ్వాసం కోల్పోయానని, అందుకే వీడియోలు చేయడం మానేశానని ఐశ్వర్య ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యాయామాలు ఎందుకు ఆపాల్సి వచ్చింది?
జనవరి 2025లో బరువు తగ్గాలని గట్టిగా నిర్ణయించుకుని జిమ్ లో చేరారు. కానీ దురదృష్టవశాత్తు ఆమెకు తీవ్రమైన పాదాల నొప్పి వచ్చింది. అదే సమయంలో శరీరంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరగడంతో డాక్టర్లు ఆమెను వ్యాయామాలు పూర్తిగా ఆపేయాలని సూచించారు. దీంతో ఆమె ప్రయత్నాలకు పెద్ద బ్రేక్ పడింది.
మౌంజారోతో మలుపు
వ్యాయామం చేయలేక ఇబ్బంది పడుతున్న సమయంలో డాక్టర్లు ఆమెకు మౌంజారో అనే మెడిసిన్ సూచించారు. ఇది సాధారణంగా టైప్-2 డయాబెటిస్ రోగులకు వాడతారు, కానీ బరువు తగ్గడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఈ మెడిసిన్ అద్భుతంగా పనిచేసిందని ఐశ్వర్య తెలిపారు. ఇది వాడటం మొదలుపెట్టిన నెలలోనే 4 కిలోలు తగ్గాను.. అలా ఆరు నెలల పాటు ప్రతి వారం ఈ ఇంజెక్షన్ తీసుకున్నాను. ఫలితంగా 74 కిలోల నుండి 52 కిలోలకు తగ్గాను. ఇది నమ్మశక్యం కాని వేగం అని ఆమె చెప్పారు.
ఖరీదైన ట్రీట్మెంట్,సైడ్ ఎఫెక్ట్స్
అయితే ఈ ట్రీట్మెంట్ చాలా ఖరీదైనది. ఒక్కో షాట్ కు దాదాపు రూ. 40,000 ఖర్చు అవుతుంది. అంతేకాకుండా దీని వల్ల తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని ఐశ్వర్య తెలిపారు. మొదటి నెలలో విపరీతమైన వికారం (వాంతులు వచ్చినట్లు ఉండటం), జుట్టు రాలడం వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. గ్లామర్ వెనుక ఇంత కష్టం ఉందని ఆమె నిజాయితీగా అంగీకరించారు.
చివరిగా ఆమె సలహా
సహజ పద్ధతుల్లో బరువు తగ్గడమే ఉత్తమమని అందరూ అంటారు, కానీ అందరి శరీర తత్వాలు ఒకేలా ఉండవని ఐశ్వర్య అభిప్రాయపడ్డారు. సులభంగా అయిపోయింది కాబట్టి అది తప్పు అని కాదు. వైద్య సహాయం తీసుకోవడంలో తప్పులేదు. మనకు ఉన్నది ఒకే జీవితం, దాన్ని సరిదిద్దుకోవడానికి నిపుణులైన డాక్టర్లను సంప్రదించండి అని ఐశ్వర్య సూచించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications