Latest Updates
-
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు!
Fruits for Strong Bones: ఎముకలను ఉక్కులా బలంగా మార్చే 6 పండ్లు..ఇవి తింటే కొండలను ఢీకొట్టే శక్తి!
ఎముకల బలం లేదా ఎముకల ఆరోగ్యం అనగానే ముందుగా అందరికీ గుర్తుకొచ్చేది పాలు, పెరుగు, లేదా ఖరీదైన కాల్షియం మాత్రలు. అయితే ప్రకృతి ప్రసాదించిన కొన్ని రుచికరమైన పండ్లు కూడా మీ ఎముకలను బలోపేతం చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయని మీకు తెలుసా? మారుతున్న లైఫ్ స్టైయిల్ కారణంగా ఈ రోజుల్లో చిన్న వయస్సులోనే కీళ్ల నొప్పులు, ఎముకల బలహీనత వంటి సమస్యలు సర్వసాధారణం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన ఆహారంలో ఈ పండ్లను చేర్చుకోవడం కేవలం రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో అవసరం. విటమిన్ డి, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలతో నిండిన ఈ పండ్లు మీ ఎముకలను లోపలి నుంచి పోషించి దృఢంగా మారుస్తాయి. ఆ సూపర్ ఫ్రూట్స్ ఏంటో ఇక్కడ చూడండి.
నారింజ
విటమిన్ 'C' కి నిలయమైన నారింజ పండు ఎముకల నిర్మాణానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. రోజూ ఒక నారింజ పండు తినడం వల్ల ఎముకలు గట్టిపడటమే కాకుండా ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కూడా రక్షణ లభిస్తుంది. ఇది పగుళ్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

జామ
నారింజకు ఏమాత్రం తీసిపోని విధంగా జామపండులో కూడా విటమిన్ 'C' పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి ఎంతగానో సాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపర్చి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
అత్తి పండు
అత్తిపండు అందించే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. దీన్ని కాల్షియం పండు అని పిలిచినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇందులో కాల్షియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. పాలు, పాల ఉత్పత్తులు పడని వారికి ఇది ఒక గొప్ప ప్రత్యామ్నాయం. తాజా పండ్లు లేదా ఎండు అత్తి పండ్లను ఎలా తిన్నా ప్రయోజనమే.
కివి
రుచిలో అమోఘం, ఆరోగ్యానికి అద్భుతం. ఈ చిన్న పండులో విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం వంటి పోషకాలు నిండి ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను కాపాడి, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
అరటి పండు
తక్షణ శక్తికి మారుపేరైన అరటిపండు ఎముకలకూ ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే పొటాషియం, శరీరంలో కాల్షియం గ్రహించే శక్తిని పెంచుతుంది. తద్వారా ఎముకలు కాల్షియంను కోల్పోకుండా చూస్తుంది.
ప్రూన్స్(ఎండిన ప్లమ్ పండు)
ముఖ్యంగా మహిళలకు రుతువిరతి తర్వాత ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంలో ప్రూనేలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకల నష్టాన్ని నివారించి వాటిని దృఢంగా ఉంచవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications