Latest Updates
-
బెండకాయ ఎప్పుడు వండినా జిగురుగా ఉంటుందా.?..ఈ పద్ధతిలో ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు.! -
ఆకలినే ఆయుధంగా మార్చి 20 రోజులుగా నిరాహార దీక్ష.. ఎందుకీ ఉద్యమం, ఎవరీ సోనం వాంగ్ చుక్.! -
గ్రహాల శక్తితో పాటు దైవానుగ్రహం.. పూజలో ఈ రంగు వస్త్రాన్నే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా.? -
రాత్రి పూట స్వీట్ తినాలనిపిస్తుందా? ఓవెన్ అక్కర్లేకుండానే ఇంట్లోనే బేకరీ స్టైల్ బనానా బ్రెడ్ చేసుకోండిలా.. -
పిల్లలు, వృద్ధుల ఎముకల బలానికి రాగి, మునగాకు రోటి.. రోజూ ఒక్కటి తింటే చాలు.! -
మగవారిలో వీర్య కణాల సంఖ్య దారుణంగా పడిపోవడానికి ఈ పది ఆహార పదార్థాలే కారణం.! -
పప్పుచారులోకి బెస్ట్ సైడ్ డిష్.. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ వడ.. 10 నిమిషాల్లో చేసేయండిలా -
ఈ మూడు రాశుల వారికి ఊహించని ఆర్థిక అవకాశాలు.. ఏ పరిహారాలు చేస్తే ఇంకా మంచిది.! -
వారం రోజులు నిల్వ ఉండే సొరకాయ హల్వా..రసాలూరుతూ భలే రుచిగా.. -
మీ పిల్లలు రోజులో ఎన్ని చాక్లెట్స్ తింటున్నారు.. ఈ లిమిట్ దాటితే ఎంత ప్రమాదమో తెలుసా.?
Honey in Monsoon: ప్రకృతి ఇచ్చిన అమృతం..వర్షాకాంలో ఇన్ఫెక్షన్లను చంపేస్తుంది,చర్మానికి కూడా అద్భుతం
దాదాపు మన అన్ని ఆరోగ్య సమస్యలకు మన వంటగదే పెద్ద మెడికల్ షాప్ అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. మన వంటగదిలో లభించే పదార్థాలతొనే అనేక రకాల రోగాలకు,సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మన వంటగదిలో లభించే తేనె కూడా అలాంటి అద్భుత ప్రయోజనాలను అందించేదే. ప్రకృతి ప్రసాదించిన అమృతం తేనె అని మన పెద్దలు,నిపుణులు చెబుతుంటారు. జలుబు, దగ్గు వంటి అనారోగ్యాలకు ఇది దివ్యౌషధం అని మనందరికీ తెలిసిందే. అయితే తేనె ప్రయోజనాలు కేవలం అంతటితోనే ఆగిపోవు. ముఖ్యంగా వర్షాకాలంలో మన చర్మ సౌందర్యాన్ని కాపాడటంలో తేనె అద్భుతంగా పనిచేస్తుంది.
సాధారణంగా వర్షాకాలం రాగానే చిరుజల్లుల ఆహ్లాదంతో పాటు కొన్ని చర్మ సమస్యల బెడద కూడా స్టార్ట్ అవుతుంది. వాతావరణంలో తేమ పెరిగి చర్మం జిడ్డుగా మారడం, మొటిమలు, దద్దుర్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వంటివి వేధిస్తుంటాయి. ఇలాంటి సమయంలో రసాయనాలతో నిండిన ప్రొడక్ట్స్ ని వాడటానికి బదులు మన వంటగదిలోని తేనెను ఆశ్రయిస్తే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.

ఎందుకంత ప్రత్యేకం?
యుఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం తేనె కేవలం తీపి ద్రవం మాత్రమే కాదు..అదొక పోషకాల గని. ఇందులో ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటి సహజ చక్కెరలతో పాటు ప్రోటీన్లు, విటమిన్లు, ఎంజైమ్‌లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఉండే శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు వర్షాకాల చర్మ సమస్యలకు సరైన సమాధానం. తేనెను చర్మానికి పూసినప్పుడు అది చర్మ రంధ్రాలలోకి చొచ్చుకుపోయి లోతుగా శుభ్రపరుస్తుంది. దీనిలోని ఎంజైమ్ లు సహజంగా హైడ్రోజన్ పెరాక్సైడ్ ను విడుదల చేసి మొటిమలకు కారణమయ్యే సూక్ష్మక్రిములను నాశనం చేస్తాయి.
సౌందర్యమే కాదు స్వస్థత కూడా
తేనె కేవలం అందానికే పరిమితం కాదు గాయాలను మాన్పడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. వర్షాకాలంలో పాదాలకు తగిలే గాయాలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, కాలిన గాయాలపై తేనెను నేరుగా పూయడం వల్ల అవి త్వరగా మానిపోతాయి..వాపు కూడా తగ్గుతుంది. అంతేకాకుండా సోరియాసిస్, చుండ్రు, పైల్స్ వంటి తీవ్రమైన సమస్యలకు కూడా తేనె ఉపశమనాన్నిస్తుంది. ముఖ్యంగా పైల్స్ వల్ల కలిగే నొప్పి, మంట నుండి ఉపశమనం పొందడానికి తేనెను వాడటం చాలా మేలు చేస్తుంది.
తేనె ఒక అద్భుతమైన ఎమోలియంట్ (చర్మాన్ని మృదువుగా చేసేది), హ్యూమెక్టెంట్ (తేమను నిలిపి ఉంచేది). ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచి ముడతలను తగ్గిస్తుంది. చర్మం యొక్క pH సమతుల్యతను కాపాడి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. కాబట్టి తేనె కేవలం అందాన్ని పెంచే సాధనమే కాదు అద్భుతమైన ఔషధం కూడా. ఈ వర్షాకాలంలో, మీ చర్మ సంరక్షణలో ప్రకృతి సిద్ధమైన తేనెను భాగం చేసుకుంటే మెరిసే ఆరోగ్యకరమైన చర్మాన్ని మీరు పొందవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications