Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
అద్దంలో మీ ముఖం ఇలా కనిపిస్తోందా? అయితే మీ లివర్ ప్రమాదంలో ఉన్నట్టే!
మన శరీరంలో ఇంజిన్ లాంటిది కాలేయం. ఇది మన మొత్తం ఆరోగ్యాన్ని కాపాడే పవర్ హౌస్. కానీ ప్రపంచవ్యాప్తంగా ఫ్యాటీ లివర్ అనే నిశ్శబ్ద మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. వైద్య పరిభాషలో దీనిని మెటబాలిక్ డిస్ ఫంక్షన్ అసోసియేటెడ్ స్టీటోహెపటైటిస్ (MASLD) లేదా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) అని పిలుస్తారు.
ఈ వ్యాధిలో అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే.. ఇది ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా, నిశ్శబ్దంగా దాడి చేస్తుంది. కేవలం మద్యం సేవించే వారికే కాదు ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారికి కూడా ఈ ముప్పు పొంచి ఉంది. నిర్లక్ష్యం చేస్తే ఇది లివర్ సిర్రోసిస్ లేదా క్యాన్సర్ కు కూడా దారితీయవచ్చు.

అయితే మన కాలేయం లోపల ఇబ్బంది పడుతున్నప్పుడు మన ముఖంపై కొన్ని హెచ్చరిక సంకేతాలను పంపిస్తుంది. అద్దంలో మీ ముఖం చూసుకున్నప్పుడు ఏ లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం అవ్వాలో ఇక్కడ చూడండి.
ముఖం ఉబ్బినట్లు ఉండటం
నిద్రలేచిన తర్వాత లేదా రోజంతా మీ ముఖం, ముఖ్యంగా కళ్ళు, బుగ్గల చుట్టూ వాచినట్లు అనిపిస్తోందా? అలెర్జీ లేకుండా ఇలా జరుగుతుంటే అది కాలేయ సమస్య కావచ్చు. కాలేయం దెబ్బతిన్నప్పుడు శరీరానికి అవసరమైన ప్రోటీన్లను ఉత్పత్తి చేయలేదు. దీనివల్ల రక్త ప్రవాహంలో మార్పులు వచ్చి, ద్రవాలు నిలిచిపోయి ముఖం ఉబ్బుతుంది.
మెడపై నల్లటి చారలు
మీ మెడ వెనుక భాగంలో లేదా మెడ ముడతలలో చర్మం నల్లగా మారుతోందా? దీనిని వైద్యపరంగా అకాంథోసిస్ నైగ్రికన్స్ అంటారు. ఇది ఇన్సులిన్ నిరోధకతకు పెద్ద సంకేతం. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారిలో ఇది చాలా సాధారణం. మెడ నల్లబడుతుందంటే మీ లివర్, షుగర్ లెవల్స్ ప్రమాదంలో ఉన్నాయని అర్థం.
ముఖం ఎర్రబారడం
ఎటువంటి కారణం లేకుండా ముఖం ఎర్రగా మారడం, చర్మంపై సన్నని రక్త నాళాలు కనిపించడం, లేదా మొటిమల వంటి గడ్డలు రావడం కాలేయ అనారోగ్యాన్ని సూచిస్తాయి. కాలేయం బలహీనపడినప్పుడు జింక్ వంటి పోషకాల లోపం ఏర్పడి నోటి చుట్టూ దద్దుర్లు లేదా చికాకు కలుగుతుంది.
పచ్చబారిన కళ్ళు, తీవ్రమైన దురద
వ్యాధి తీవ్ర దశకు చేరుకున్నప్పుడు రక్తంలో బిలిరుబిన్ స్థాయిలు పెరిగి కళ్ళు, చర్మం పసుపు రంగులోకి మారుతాయి. అంతేకాకుండా పిత్త లవణాలు పేరుకుపోవడం వల్ల ముఖంపై విపరీతమైన దురద పుడుతుంది. ఇది లివర్ ఫెయిల్యూర్ వైపు వెళ్తున్న ప్రమాద ఘంటిక.
మీ ముఖంపై ఈ లక్షణాలు కనిపిస్తే వాటిని సాధారణ చర్మ సమస్యలుగా కొట్టిపారేయకండి. బ్యూటీ క్రీమ్స్ వాడే ముందు, ఒకసారి డాక్టర్ ని సంప్రదించి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవడం ఉత్తమం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications