Latest Updates
-
వర్షాకాలం అలర్ట్.. గోడలపై ఇలా ఉంటే ఊపిరితిత్తుల వ్యాధికి దారితీస్తుందా.. డాక్టర్లు చెబుతున్న వాస్తవాలు -
మీ పిల్లలు కెరీర్లో ఉన్నతంగా ఎదగాలంటే.. స్టడీ రూమ్లో ఈ వాస్తు సలహాలు పాటించాల్సిందే.! -
ఈ వారం ఈ నాలుగు రాశుల వారికి తిరుగే లేదు.. అన్నింటా విజయమే, కష్టానికి తగిన ప్రతిఫలం.! -
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్!
మీ బరువును బట్టి రోజుకి ఎన్ని నీళ్లు తాగాలి? శరీరానికి సరిపడా వాటర్ తాగకపోతే వచ్చే సమస్యలు?
మన బాడీ అనే యంత్రం ఎలాంటి రిపేర్లు(అనారోగ్యాలు)రాకుండా ఉండాలంటే గాలి,ఆహారంతో పాటు అత్యంత ముఖ్యమైన ఇంధనం నీరు. మానవ శరీరంలో దాదాపు 70శాతం నీరే ఉంటుందుని తెలిసిన విషయమే. అయితే చాలామంది పని హడావుడిలో పడిపోయి లేదా దాహం వేయట్లేదనో మంచి నీళ్లు తాగడాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే దాహం వేస్తుందంటే అప్పటికే మీ శరీరంలో నీటి కొరత ప్రారంభమైందని అర్థం. శరీరానికి తగినంత నీళ్లు తీసుకోకుంటే వచ్చే సమస్యలు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
తలనొప్పి, ఏకాగ్రత లోపం
మీకు తరచుగా కారణం లేకుండా తలనొప్పి వస్తుందా? లేదా ఏ పని మీదా దృష్టి పెట్టలేకపోతున్నారా? దీనికి కారణం మీ మెదడుకు తగినంత నీరు అందకపోవడమే అయిండవచ్చు. మన మెదడు సక్రమంగా పనిచేయడానికి నీరు చాలా అవసరం. శరీరంలో నీటిశాతం తగ్గినప్పుడు, మెదడు పనితీరు మందగించి తీవ్రమైన తలనొప్పి, చికాకు, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు మొదలవుతాయి.

జీర్ణవ్యవస్థలో గందరగోళం
మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కావాలన్నా, వ్యర్థాలు బయటకు వెళ్లాలన్నా నీరు కీలకపాత్ర పోషిస్తుంది. నీళ్లు తక్కువగా తాగితే జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. దీనివల్ల తిన్నది సరిగా అరగకపోవడం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా వ్యర్థాలు ప్రేగులలో పేరుకుపోయి తీవ్రమైన మలబద్ధకానికి దారితీస్తుంది.
నిర్జీవమైన చర్మం
తగినంత నీరు లేకపోతే చర్మం తన తేమను కోల్పోయి పొడిబారిపోతుంది. ఫలితంగా చర్మం కాంతిహీనంగా, నిర్జీవంగా తయారై ముడతలు త్వరగా వస్తాయి.
మూత్రపిండాల్లో రాళ్లు
శరీరంలోని మలినాలను వడపోసే ముఖ్యమైన పనిని మూత్రపిండాలు చేస్తాయి. మనం నీళ్లు సరిగా తాగనప్పుడు, ఈ మలినాలు పేరుకుపోయి కిడ్నీలో రాళ్లుగా మారే ప్రమాదం ఉంది. తరచుగా మూత్రంలో ఇన్ఫెక్షన్లు రావడానికి కూడా డీహైడ్రేషనే ప్రధాన కారణం.
కండరాల నొప్పులు
వ్యాయామం చేయకపోయినా అకస్మాత్తుగా కండరాలు పట్టేసి నొప్పి వస్తోందా? కండరాలు ఆరోగ్యంగా, ఫ్లెక్సిబుల్ గా ఉండటానికి నీరు, లవణాలు అవసరం. నీటి కొరత వల్ల కండరాలు బిగుసుకుపోయి నొప్పులు వస్తాయి.
రక్తపోటు (BP) తగ్గడం
శరీరంలో నీరు తగ్గితే రక్త పరిమాణం కూడా తగ్గుతుంది. బీపీ డౌన్ అయ్యి కళ్లు తిరగడం, తల తేలిపోతున్నట్లు అనిపించడం వంటి ఇబ్బందులను కలిగిస్తుంది. విపరీతమైన నీరసం ఆవహిస్తుంది.
మూడ్ స్వింగ్స్ పై ప్రభావం
శరీరంలో నీటి కొరత మన మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది. డీహైడ్రేషన్ వల్ల తరచుగా మూడ్ స్వింగ్స్ అంటే కారణం లేకుండానే విసుగు, నిరాశ, ఆందోళన వంటివి కలుగుతాయి.
ఎంత బరువు ఉన్నోళ్లు రోజుకి ఎన్ని లీటర్లు తాగాలంటే..
-45 కేజీల బరువు ఉన్నోళ్లు..1.9 లీటర్ల నీళ్లు ఖచ్చితంగా తాగాలి.
-50 కేజీలు ఉన్నోళ్లు..2.1 లీటర్ల నీళ్లు తాగాలి.
-55 కేజీలు ఉన్నోళ్లు..2.3 లీటర్ల నీళ్లు తాగాలి.
-60 కేజీలు ఉన్నోళ్లు..2.5 లీటర్ల నీళ్లు తాగాలి.
-65 కేజీలు ఉన్నోళ్లు..2.7 లీటర్ల నీళ్లు తాగాలి.
-70 కేజీలు ఉన్నోళ్లు..2.9 లీటర్ల నీళ్లు తాగాలి.
-75 కేజీలు ఉన్నోళ్లు..3.2 లీటర్ల నీళ్లు తాగాలి.
-80 కేజీలు ఉన్నోళ్లు..3.5 లీటర్ల నీళ్లు తాగాలి.
-85 కేజీలు ఉన్నోళ్లు..3.7 లీటర్ల నీళ్లు తాగాలి.
-90 కేజీలు ఉన్నోళ్లు..3.9 లీటర్ల నీళ్లు తాగాలి.
-95 కేజీలు ఉన్నోళ్లు..4.1 లీటర్ల నీళ్లు తాగాలి.
-100 కేజీలు ఉన్నోళ్లు..4.3 లీటర్ల నీళ్లు తాగాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications