For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రొకోలిలోని అత్యంత ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు

|

చూడటానికి కాలీఫ్లవర్‌లా కన్పించినా ఆకుపచ్చ అందం సంతరించుకున్న పువ్వుకూర ‘బ్రొకొలి'. ఇప్పుడు అన్ని సూపర్‌మార్కెట్లలోనూ మిగతా కూరగాయలతో పాటు దొరుకుతోంది. ఎన్నో పోషక విలువలున్న బ్రొకొలిని సలాడ్, సూప్స్‌లే కాక కూరగా కూడా చేసుకోవచ్చు.

ఈ ప్రపంచంలో అత్యంత ఆరోగ్యకరమైన వెజిటేబుల్ బ్రొకోలి. గ్రీన్ వెజిటేబుల్స్ లో ఎక్కువ న్యూట్రీషియన్స్ కలిగినటువంటి వెజిటేబుల్ ఇది . ఈ బ్రొకోలి వెజిటేబుల్లోని ఆరోగ్యప్రయోజనాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యానికి ఇది చేసే మేలు ఇంతా అంతా కాదు. ఇందులో పోషక తత్వాలు విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం. ఈ గ్రీన్ వెజిటేబుల్స్ లోవిటమిన్ సి మరియు బి5 అధికంగా ఉన్నాయి. బ్రొకోలీలో చాలా శక్తివంతమైన న్యూట్రీషియన్స్ కలిగి ఉండటం వల్ల దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా ముఖ్యం.

బ్రొకోలిలోని అత్యంత ముఖ్యమైన న్యూట్రీషియన్స్ గురించి మరియు హెల్త్ బెనిఫిట్స్ గురించి ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది. మరి బ్రొకోలీలలో ఏఏ పోషకాంశాలున్నాయి, వాటి ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...

కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది

కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది

బ్రొకొలిలో కరిగే ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, ఇది చాలా ఎఫెక్టివ్ గా శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది.

యాంటీఆక్సిడెంట్ లక్షణాలు

యాంటీఆక్సిడెంట్ లక్షణాలు

బ్రొకోలీలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల, ఇతర ఆహార పదార్థాల కంటే ఇది చాలా శక్తివంతమైన ఆహారంగా గుర్తిస్తారు. ఎందుకంటే ఇందులో అధిక ఫ్లెవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, లూటిన్, బీటా కెరోటిన్, జియాక్సిథిన్ ఇవన్నీ కూడా పవర్ ఫుల్ యాకంటీఆక్సిడెంట్స్ వీటి వల్ల శరీరంలో ఫ్రీరాడికల్స్ తొలగించబడుతాయి.

జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది

జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది

బ్రొకోలి, ఒక నేచురల్ డిటాక్స్ ఫుడ్. ఇది జీర్ణవ్యవస్థను(ప్రేగులను మరియు పొట్టను) శుభ్రం చేస్తుంది . బ్రొకోలీలో ఉన్న అధిక యాంటీఆక్సిడెంట్స్ మూలంగానే ఇలా శుభ్రపడుతుందని చెప్పవచ్చు.

ఎముకలను బలోపేతం చేస్తుంది

ఎముకలను బలోపేతం చేస్తుంది

అనేక ఇతర వెజిటేబుల్స్ లా కాకుండా, దీన్నిఒక క్లాసిఫైడ్ ఫుడ్ గా ఎంపిక చేయబడినది . ఇతర కూరగాయల్లోకంటే, బ్రొకోలీలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఈ క్యాల్షియం ఎముకలను బలోపేతం చేయడానికి, ఎముకలు ఆరోగ్యంగా ఉండటకు ఇటువంటి క్యాల్షియం అధికంగా ఉన్న ఆహారాలు చాలా అవసరం అవుతాయి.

యాంటీక్యాన్సర్

యాంటీక్యాన్సర్

క్యాన్సర్ సెల్స్ ను నాశనం చేయడంలో ఒక ఉత్తమ ఆహారం బ్రొకోలీ. ఈ బిట్టర్ ఫుడ్ లోని సల్ఫోరిపోన్, ఇది శరీరానికి అవసరం అయ్యే ఎంజైములకు రక్షణ కల్పిస్తుంది మరియు శరీరంలో క్యాన్సర్ కు కారణం అయ్యే కెమికల్స్ ను శరీరం నుండి బయటకు నెట్టివేస్తుంది.

బ్లడ్ షుగర్

బ్లడ్ షుగర్

బ్లడ్ షుగర్ ను క్రమబద్దం చేసే టాప్ ఆహారాల్లో బ్రొకోలి ఒకటి. ఇది స్వీట్స్ మీద, పంచదార మీద ఎక్కువ ఆశపడకుండా చేసి బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. అంతే కాదు, ఇందులో ఎక్కువ కార్బోమైడ్రేట్స్, మరియు ఫైబర్ కలిగి ఉన్నాయి.

మెంటల్ హెల్త్

మెంటల్ హెల్త్

బ్రొకోలీలో విటమిన్ సి, విటమిన్ కె మరియు ఒమేగా ఫ్యాటీయాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ మూడు కాంపోనెంట్స్ కూడా మెదడు యొక్క పనితీరును మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడుతాయి. అంతే కాదు, జ్ఝాపక శక్తిని కూడా పెంచుతాయి.

యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు

యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు

బ్రొకోలీ ఒక మ్యాగ్నిఫిషియంట్ ఇందులో యాంటీఆన్ఫ్లమేటరీ లక్షణాలు మరియు యాంటీ అలర్జీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ముఖ్యంగా బ్రొకోలీలో ఉండే ఓమేగా 3 ప్యాటీ యాసిడ్స్ కలిగి ఉండటం వల్ల మన శరీరాన్ని అలర్జీలకు గురికాకుండా యాంటీ అలర్జిటిక్ లక్షణాలు కలిగి ఉండేలా తయారుచేస్తుంది.

హెల్తీ అండ్ గ్లోయింగ్ స్కిన్

హెల్తీ అండ్ గ్లోయింగ్ స్కిన్

బ్రొకోలీలో ఉన్న గ్లూకొరఫినైన్ అనే అంశం వల్ల డ్యామేజ్ అయిన చర్మం తిరిగి రిపేర్ చేస్తుంది మరియు హెల్తీ అండ్ గ్లోయింగ్ స్కిన్ ను పొందేలా చేస్తుంది.

సెంట్రల్ నెర్వస్ సిస్టమ్

సెంట్రల్ నెర్వస్ సిస్టమ్

బ్రొకోలీలో పొటాషియం మరియు మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల రెండూ నాడీ వ్యవస్థకు చాలా అవసరం అయినవి. కాబట్టి, రెగ్యులర్ డైట్ లో బ్రొకోలీని చేర్చుకోవడం చాలా అవసరం.

English summary

10 Brilliant Health Benefits Of Broccoli


 Broccoli is one of the healthiest vegetables in the world and also amongst the healthiest foods on the planet owing to its rich nutrient composition. The benefits of Broccoli are wide ranging- something we will discuss in detail in this article.
Story first published: Tuesday, October 7, 2014, 13:08 [IST]
Desktop Bottom Promotion