For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాడీ ఫ్యాట్ ను బ్రేక్ చేసే 10 సూపర్ డూపర్ ఫుడ్స్

|

ప్రస్తుత రోజుల్లో బాడీ ఫ్యాట్ ఒక సాధారణ సమస్య. శరీరంలో అదనపు ఫ్యాట్ ఉండటం వల్ల హార్ట్ సమస్యలు, వంద్యత్వం, డయాబెటిస్, మరియు హైబ్లడ్ ప్రెజర్ వంటి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

బాడీ ఫ్యాట్ ను కరిగించుకోవడం కోసం మీరు చాలా తీవ్రంగా కష్టపడుతుంటారు. అయితే మీకు తెలుసా మొదట మనశరీరంలో కార్బోహైడ్రేట్స్ ను విచ్చిన్నం చేస్తుంది? మొదట కార్బోహైడ్రేట్స్ విచ్ఛిన్నం చేసుకోవడం వల్ల శరీరం అదనపు ఫ్యాట్ ను శులభంగా కరిగించుకోవచ్చు.

ఎప్పుడైతే వ్యాయామం చేస్తామో అప్పుడు మొదట శరీరంలో క్రొవ్వు కరిగించుకోవచ్చు. వ్యాయామం మాత్రమే కాదు బాడీ ప్యాట్ ను కరిగించుకోవడానికి కొన్ని ఆహారాలు సహాయపడుతాయి. అంతే కాదు ఇవి బరువు కోల్పోవడంలో కూడా సహాయకారులుగా ఉన్నాయి.

READ MORE: శరీరంలో కొవ్వు కరిగించి.. పొట్టతగ్గించుకొనేందు పరిష్కార మార్గం..!

ఈక్రింది లిస్ట్ లో ఇవ్వబడిని ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకొన్నట్లైతే, వీటితో పాటు చిన్న పాటి వ్యాయామాలు చేసినట్లైతే, మీరు కోరుకున్నట్లు మంచి శరీర ఆకారంను పొందగలరు . అంతే కాదు ఈ క్రింది లిస్ట్ లో ఉన్న ఆహారాలు మన శరీరానికి అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ ను కూడా అందిస్తుంది . ఎప్పుడుతై శరీరంలో విటమిన్స్, మినిరల్స్, ప్రోటీన్స్ తక్కువగా ఉంటాయో అప్పుడు ఫ్యాట్స్ కరగడం నిదానం అవుతుంది.READ MORE: బెల్లీ ఫ్యాట్ ను వేగంగా తగ్గించే న్యూట్రీషియన్స్ ఫుడ్స్

కాబట్టి, ప్రోటీన్స్, మినిరల్స్, విటమిన్స్ పుష్కలంగా అందించే, బాడీ ఫ్యాట్ ను సులభంగా బర్న్ చేసే ఆహారాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి....

ఆస్పరాగస్:

ఆస్పరాగస్:

ఆస్పరాగస్ బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. దాంతో కిడ్నీలు చురుకుగా పనిచేయడానికి సహాయపడుతుంది. ఆస్పరాగస్ శరీరంలో ఆక్సాలిక్ యాసిడ్స్ ను విచ్చిన్నం చేయడం వల్ల శరీరంలో ఫ్యాట్ కరుగుతుంది.

క్యాబేజ్:

క్యాబేజ్:

క్యాబేజ్ బెల్లీ ఫ్యాట్ కరిగించడంలో ముఖ్యంగా నడుము చుట్టు ఉన్న ఫ్యాట్ ను కరిగించడలో గ్రేట్ గా సహాయపడుతుంది ఎందుకంటే ఇందులో ఐయోడిన్ మరియు సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఫ్యాట్ ను బర్న్ చేయడానికి గ్రేట్ గా సహాయపడుతాయి. బరువు తగ్గించుకోవడానికి ఇది ఒక ఉత్తమ ఆహారం.

 తృణధాన్యాలు:

తృణధాన్యాలు:

తృణధాన్యాలు ఓట్స్, బ్రెడ్, బ్రౌన్ రైస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల వరీరంలో ఎక్స్ ట్రా క్యాలరీలను తగ్గించుకోవడానికి సహాయపడుతుంది . అలాగే మన శరీరం కొవ్వును కరిగించడంలో ఎక్కువ ఎనర్జీ వీటి ద్వారా పొందవచ్చు.

పప్పులు:

పప్పులు:

మన శరీరంకు అవసరం అయ్యే ఐరన్ ను పప్పు దాన్యాలు సప్లై చేస్తాయి. కాబట్టి, మన రెగ్యులర్ డైట్ లో పప్పులు చేర్చుకోవడం వల్ల ఫ్యాట్ సులభంగా కరిగించుకోవచ్చు. ఎప్పుడైతే మీ శరీరానికి విటమిన్స్ మరియు మినిరల్స్ అందిస్తాయో అప్పుడు ఫ్యాట్స్ సులభంగా కరుగుతాయి.

క్యారెట్స్:

క్యారెట్స్:

క్యారెట్స్ లో కెరోటిన్స్ (విటమిన్ ఎ)పుష్కలంగా ఉంటుంది. ఈ కెరోటిన్ శరీరంలో ఫ్యాట్ ను భయటకు నెట్టివేస్తుంది . శరీరంలో కొవ్వు కరిగేలా క్రమబద్దం చేస్తుంది.

కీరదోసకాయ:

కీరదోసకాయ:

కీరదోసకాయలో సిలికాన్ మరియు సల్ఫర్ అధికంగా ఉండటం వల్ల శరీరంలో ఫ్యాట్స్ భయటకు నెట్టివేస్తుంది. అంతే కాదు, కీరదోసకాయలో శరీరలో యూరిక్ యాసిడ్ లెవల్స్ ను శరీరంలో తగ్గిస్తుంది.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

శరీరంలో కొవ్వును కరిగించుకోవడానికి గ్రీన్ టీ బాగా సహాయపడుతుంది. గ్రీన్ టీ జీర్ణక్రియను క్రమబద్దం చేస్తుంది. అంతే కాదు కార్బోహైడ్రేట్స్ మరియు ఫ్యాట్స్ కరిగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

డైరీ ప్రొడక్ట్స్:

డైరీ ప్రొడక్ట్స్:

లోఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్ మజిల్ ప్రోటీన్స్ ను మరియు ఎక్సెస్ ఫ్యాట్ ను క్రమబద్దం చేస్తుంది. వీటిలో క్యాల్షియం మరియు విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇవి ఎముకల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

లీన్ మీట్:

లీన్ మీట్:

ఫ్యాట్ ఫ్రీ చికెన్ ఎక్స్ట్రా క్యాలరీలను తగ్గిస్తుంది. ఇది జీర్ణం అవ్వడం వల్ల మన శరీరం 30శాతం ఎనర్జీని పొందుతుంది .

హాట్ పెప్పర్:

హాట్ పెప్పర్:

హాట్ పెప్పర్ లో క్యాప్ససిన్ అనే పోషకాంశం ఉండటం వల్ల హాట్ ఫ్లేవర్ ను అందిస్తుంది. క్యాప్ససిన్ లో ఉండే థర్మోజెనిక్ ఎఫెక్ట్ మీ శరీరంను వేడి చేస్తుంది. మరియు ఫ్యాట్ ను కరిగిస్తుంది.

English summary

10 Foods To Break Down Body Fats

10 Foods To Break Down Body Fats in Telugu .When you exercise, the reserved glycogen is broken down first and then the body fat.. Now the good news is that some foods can help you to break down the excess fat in the body. These foods promote fat burning and help in weight reduction.
Story first published: Thursday, June 4, 2015, 13:01 [IST]
Desktop Bottom Promotion