For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మంచి మూడ్ కోసం తినాల్సిన 10 హ్యాపి ఫుడ్స్

|

మూడ్ అనేది మానవుల యొక్క ప్రవర్తనా లక్షణాలు, అవి వారి మనో భావాలను మరియు వారి యొక్క హార్మోనుల అసమతౌల్యంను తెలియజేస్తాయి. మూడు అనేది మంచి లేదా చెడు గా చెప్పబడుతుంది. ఇంకా ఇది ఒక నిరాశగా, మనస్సులో గంధరగోళం, ఇంద్రియ మరియు శృంగారం ఉంటుంది . ప్రతి మూడ్ నమూనాకు ఒక్కోపరిస్థితి ఆధారపడి ఉంటుంది. ప్రమేయం మరియు భావాలను లేదా భావోద్వేగాలు ద్వారా తెలియజేస్తుంది.

మూడ్ (మనస్సు)బావాలు మనోభావాలతోనే కాకుండా, తీసుకొనే ఆహారం వల్ల కూడా మూడ్ క్రమంగా మారుతుంటుంది. మీరు రొమాంటిక్ గా అనూభూతి చెందేలా చేసే కొన్ని ఆహారాలు ఉన్నాయి . కొన్ని ఆహారాలు మీకు శక్తివంతమైనగా అనిపించవచ్చు . అదేవిధంగా మంచి మూడ్ కోసం కూడా కొన్ని సూపర్ ఫుడ్స్ ఉన్నాయి. ఇవి మూడ్ ను మార్చే శక్తివంతమైన ఆహారాలు , కాబట్టి ఈ ఆహారాలు బాధాకరమైన మూడ్ నుండి మంచి మూడ్ లోనికి మార్చుతాయి. ఈ ఆహారాలు మంచి మూడ్ కోసం మాత్రమే కాదు, మీ శరీరానికి , మంచి ఆరోగ్యం అంధివ్వడానికి సహాయపడుతాయి. ఇంకా మీ రెగ్యులర్ హెల్తీ డైట్ వల్ల మీ మూడ్ ను మంచిగా చేయవచ్చు మరియు సంతోషంగా మరియు ఆనందం ఉంచడానికి కూడా ఇవి బాగా సహాయపడుతాయి.

READ MORE: ఆఫీస్ లో ఉన్నప్పుడు మంచి మూడ్&ఎనర్జినిచ్చే ఫుడ్స్

మనం తినే ఆహారం మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా? ఎందుకంటే కొన్ని ఆహారపదార్థాలు; సెరటోనిన్,ఎండార్ఫిన్, డోపామైన్ మరియు ఇతర న్యూరోట్రాన్స్మిటర్లు వంటి మానసిక స్థితిని ప్రోత్సహించే హార్మోన్ల ఉత్పత్తిని ఉత్తేజితం చేస్తాయి. మూడ్ (మనస్సు)బావాలు మనోభావాలతోనే కాకుండా, తీసుకొనే ఆహారం వల్ల కూడా మూడ్ క్రమంగా మారుతుంటుంది. మీరు రొమాంటిక్ గా అనూభూతి చెందేలా చేసే కొన్ని ఆహారాలు ఉన్నాయి . కొన్ని ఆహారాలు మీకు శక్తివంతమైనగా అనిపించవచ్చు.

READ MORE: కామోద్దీపన కలిగించే లవ్లీ ఫ్రూట్స్

అదేవిధంగా మంచి మూడ్ కోసం కూడా కొన్ని సూపర్ ఫుడ్స్ ఉన్నాయి. ఇవి మూడ్ ను మార్చే శక్తివంతమైన ఆహారాలు , కాబట్టి ఈ ఆహారాలు బాధాకరమైన మూడ్ నుండి మంచి మూడ్ లోనికి మార్చుతాయి.

 ఆపిల్:

ఆపిల్:

ఆపిల్స్ లో పెక్టిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మనిషిలో మూడ్ ను క్రమబద్దం చేస్తుంది. అలాగే ఆపిల్స్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ బ్రెయిల్లో ఉండే న్యూట్రోట్రాన్స్మీటర్స్ మీద ప్రధాణ పాత్రపోషిస్తుంది. ఆపిల్స్ స్ట్రెస్ బూస్టింగ్ ఫుడ్స్.

 అరటిపండ్లు:

అరటిపండ్లు:

అరటిపండ్లు-వీటిలో కూడా స్ట్రాబెర్రిస్ లాగానే ఎక్కువ పొటాషియం కలిగి ఉంటాయి. ఇవి మెగ్నీషియంను కూడా కలిగి ఉంటాయి. అరటిపొండులో ఉన్న సహజమైన షుగర్ త్వరగా మన రక్తప్రసరణలో విడుదల అవటంవలన మనకు త్వరగా శక్తి చేకూరుతుంది. మన మానసిక స్థితిని మంచిగా ఉంచే 'కార్బోహైడ్రేట్' అరటిపండు కలిగిఉన్నది.

చాక్లెట్స్:

చాక్లెట్స్:

చాక్లెట్-ప్రయత్నించండి కొంత చాక్లెట్! మీకు నీరసంగా అనిపిస్తే, మీరు చాక్లెట్ తీసుకోండి. దీనిలోని చక్కెర ఎండార్ఫిన్ లెవెల్స్ ను ఉత్తేజపరిచి, మీ మెదడుయొక్క సహజ హార్మోన్స్ ను సంతోషంగా ఉంచుతుంది.

ఓట్స్:

ఓట్స్:

మీరు డైలీ కార్బోహైడ్రేట్స్ ను తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే, ఓట్స్ సహాయపడుతాయి. ఎందుకంటే ఓట్స్ లో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్స్ మరియు విటమిన్స్ ఎక్కువగా కలిగి ఉంటాయి . ఇవి స్ట్రెస్ మరియు డిప్రెషన్ తగ్గిస్తాయి.

జీడిపప్పు:

జీడిపప్పు:

ఇటీవలి కాలంలో చాలామంది డ్రై ఫ్రూట్స్ లో వున్న లాభాలను గ్రహించారు. వీటిలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు వుంటాయి. వాల్ నట్స్ వంటి వాటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు వుంటాయి. మెగ్నీషియం వుంటుంది. ఇవి శరీరంలో సెరోటోనిన్ స్ధాయి పెంచుతాయి. అందుకనే డిప్రెషన్ కలిగి వున్న వారికి మెగ్నీషియం అధికంగా వుండే విటమిన్లు, మినరల్స్ ఇస్తారు. ఈ సూక్ష్మ పోషకాలు నెగెటివ్ మూడ్ ను, నిద్ర సమస్యలను, సాధారణంగా వచ్చే చికాకు, కోపం వంటివాటిని తగ్గిస్తాయి.

ఆరెంజ్:

ఆరెంజ్:

ఆరెంజ్ మన శరీరంకు అవసరం అయ్యే విటమిన్ బి మరియు సిని అందిస్తాయి. ఇవి బ్రెయిన్ హెల్త్ కు బూస్ట్ వంటివి.

చేపలు:

చేపలు:

ప్రోటీన్లు-మీరు ప్రొటీన్ల మీద ఆధారపడవొచ్చు. ప్రోటీన్స్ ఎమినో ఆమ్లాలతో రూపొందించబడింది. ఒక ప్రత్యేకమైన ఎమినో ఆమ్లం, 'టైరోసిన్' ఇది న్యూరోట్రాన్స్మిటర్లను డోపమైన్, నూర్పినేఫ్రిన్ మరియు ఎపినెర్ఫిన్ ల ఉత్పత్తిని ఉత్తేజితం చేయటానికి దోహదం చేస్తుంది. ఈ రసాయనాలు చురుకుదనం మరియు శక్తి స్థాయిలను పెంచటానికి దోహదం చేస్తాయి. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం; చేప, కోళ్ళు మరియు మాంసం ఏదైనా ఎంచుకోండి. మీరు మంచి ఆరోగ్యంతో ఉండాలనుకుంటే, చిక్కుళ్ళు, జున్ను, పాలు, పెరుగు కూడా చాలా మంచి ఆహారమే.

కోకనట్ మిల్క్:

కోకనట్ మిల్క్:

కొబ్బరికాయలో మధ్యస్థ-చెయిన్ ట్రిగ్లేసెరైడ్స్ ఉన్నాయి. ఇవి మంచి మనోభావాలు పెంపొందించటానికి దోహదం చేసే ప్రత్యేక క్రొవ్వు పదార్థాలు మరియు మనిషి మెదడు సాధారణ ఆరోగ్యానికి మంచివి.

 ఆకుకూరలు:

ఆకుకూరలు:

శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లను ప్రోటీన్లను, అందిస్తూ... నిత్యం తమని ఏదో ఓరకంగా తీసుకునే వ్యక్తుల జీవనశైలినే మార్చేసే సత్తా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ , మల్టిగ్రెయిన్స్ కు పండ్లకు కు ఉంది. వీటిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలను బయటకు పంపివేయబడుతుంది. వారంలో కనీసం రెండు సార్లైనా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్స్ డిప్రెషన్ కు లోనుకాకుండా కాపాడీ మంచి మూడ్ లో ఉండేందుకు సహాయపడుతాయి.

బెర్రీస్ :

బెర్రీస్ :

బెర్రీస్ నరాల ప్రేరణల ఉత్పత్తిలో సహాయం చేసే పొటాషియం అందించటంలో సహాయం చేస్తుంది. దీనిలో విటమిన్ 'సి' ఎక్కువగా ఉంటుంది. ఇవి మన మానసిక స్థితిని మంచి స్థితిలో ఉంచుతాయి.

English summary

10 Happy Foods That Elevate Your Mood: Health Tips in Telugu

Are there foods that elevate mood? Do foods control our moods? Yes, they do, but remember that happiness doesn't mean a 'high' that you get after consuming stimulants or sweets.
Desktop Bottom Promotion