For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సాధారణ జలుబును నివారించే ఉత్తమ ఆహారాలు

|

సహజంగా కొంత మందికి సీజన్ తో సంబంధం లేకుండా జలుబు వెంటాడి పీడిస్తుంటుంది. దీన్ని మనం కామన్ కోల్డ్ గా పిలుచుకోవచ్చు. ఇలాంటి జలుబు కొంత మందిలో కోల్డ్ ఫుడ్స్ తినడం వల్ల, వైరల్ మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల జలుబు చేస్తుంటుంది. సాధారణంగా జలుబు వచ్చిందంటే వారంలోపు తగ్గిపోవాలి. ఈ సాధారణ జలుబు తగ్గడానికి ఎలాంటి యాంటీబయోటిక్స్ అవసరం లేదు. అయితే జలుబు వైరల్ లేదా బ్యాక్టీరియా వల్ల వచ్చినట్లైతే మీరు తప్పకుండా మెడిసిన్స్ తీసుకోవాల్సిందే...

చాలా మంది ఇలాంటి కామన్ కోల్డ్ తో బాధపడుతుంటారు, అందుకు ముఖ్య కారణం వారిలో వ్యాధినిరోధకశక్తి లోపించడం వల్లే. ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోతే, వ్యాధినిరోధకత మరింత పెరుగుతుంది. కాబట్టి సాధారణ జలుబు వచ్చినప్పుడు అప్పుడప్పుడు మీ వ్యాధినిరోధకతను పెంచుకోవడానికి మరియు తగినంత వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.

కామన్ కోల్డ్ ను నివారించడానికి కొన్ని ఉత్తమ హోం రెమెడీస్ ఉన్నాయి . ఇవి సాధారణ జలుబుతో పోరాడి, జలుబును నివారిస్తాయి. అంతే కాదు, శరీరంలో వ్యాధినిరోధకతను పెంచుతాయి. మరి ఆ నేచురల్ ఫుడ్స్ ఏంటో ఒక సారి తెలుసుకొని, ముందుముందు జలుబు రాకుండా నివారణ చర్యలను చేపడదాం...ఆరోగ్యాన్ని కాపాడుకుందాం...

1. బొప్పాయి:

1. బొప్పాయి:

బొప్పాయిలో విటమిన్ ఎ మరియు సిలు అధికంగా ఉన్నాయి మరియు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జలుబును తగ్గించడానికి సహాయపడుతాయి. కామన్ కోల్డ్ ను తగ్గించడంలో బొప్పాయి ఒక గ్రేట్ హోం రెమెడీ.

2. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న చేపలు:

2. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న చేపలు:

సాల్మన్, తున, సార్డిన్స్ మరియు మెకరెల్స్ వంటి వాటిలోలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి . జలుబు ఉన్నప్పుడు చేపలు తినడం వల్ల సాధారణ జలుబు మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవచ్చు.

3. వెల్లుల్లి:

3. వెల్లుల్లి:

వెల్లుల్లిలో అల్లిసిన అధికంగా ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్ కు కామన్ సోర్స్. మీరు వెల్లుల్లిని ప్రతి రోజూ తీసుకొన్నట్లైతే ముందు ముందు జలుబు రాకుండా నివారించుకోవచ్చు . మరియు ఇది జలుబు లక్షణాలను కూడా నివారిస్తుంది.

4. ఓయిస్ట్రెస్:

4. ఓయిస్ట్రెస్:

ఓయిస్ట్రెస్ లో జింక్ అధికంగా ఉంటుంది ఇది కామన్ కోల్డ్ ను నివారిస్తుంది మరియు ఇతర ఆరోగ్య సమస్యలను కూడా నివారించడంలో గ్రేట్ గా సమాయపడుతుంది. ముఖ్యంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నివారించడానికి సీఫుడ్స్ ఎక్కువగా సహాయపడుతాయి.

5. అల్లం:

5. అల్లం:

అల్లం టీ ముక్క దిబ్బడ మరియు గొంతు నొప్పిని గ్రేట్ గా నివారిస్తుంది. జలుబు నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది . జింజర్ టీని రోజుకు రెండు, మూడు సార్లు తీసుకోవడం వల్ల సాధారణ జలుబు నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు.

6. గుమ్మడివిత్తనాలు:

6. గుమ్మడివిత్తనాలు:

గుమ్మడి విత్తనాల్లో జింక్ అధికంగా ఉంటుంది. ఇవి వరీరంలో వ్యాధినిరోధకతను పెంచుతుంది. జలుబు లక్షణాలతో పోరాడుతుంది. కామన్ కోల్డ్ కు ఇది ఒక బెస్ట్ హీలింగ్ ఫుడ్.

7. బీట్ రూట్ :

7. బీట్ రూట్ :

కామన్ కోల్డ్ నివారించడానికి బీట్ రూట్ ఒక బెస్ట్ ఫుడ్. ఎందుకంటే బీట్ రూట్ లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్, మెగ్నీషియం, ఐరన్ మరియు ఫొల్లెట్ అధికంగా ఉన్నాయి.

8. పెరుగు:

8. పెరుగు:

చాలా బలహీనంగా ఉన్నవారిలో వ్యాధినిరోధకత లోపించడం వల్ల సాధారణ జలుబు వస్తుంటుంది. ఇలాంటి జలుబు నివారించడంలో పెరుగు గ్రేట్ గా సహాయపడుతుంది . పెరుగులో ప్రోబయోటిక్స్ మరియు మంచి బ్యాక్టీరియా ఉండటం వల్ల వ్యాధినిరోధకత పెంచి కామన్ కోల్డ్ ను నివారించుకోవచ్చు.

9. గుడ్లు:

9. గుడ్లు:

గుడ్లులో విటమిన్స్ అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మినిరల్స్, సెలీనియం ఎక్కువగా ఉంటుంది. ఇది కామన్ కోల్డ్ ను నివారించడలో గ్రేట్ గా సహాయపడుతుంది . వ్యాధినిరోధకత పెంచుతుంది.

10. పాలు:

10. పాలు:

పాలలో అన్ని రకాల న్యూట్రీషియన్స్ మరియు విటమిన్ డి ఉంటుంది. విటమిన్ల లోపం వల్ల వ్యాధినిరోధక తగ్గుతుంది. కాబట్టి, పాలు వ్యాధినిరోధకతను పెంచి కామన్ కోల్డ్ ను నివారిస్తుంది.

11. మష్రుమ్:

11. మష్రుమ్:

మష్రుమ్ లో యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్స్ అధికంగా ఉన్నాయి. ఈ విటమిన్స్ వ్యాధినిరోధకతను పెంచుతాయి మరియు కామన్ కోల్డ్ ను తగ్గిస్తుంది .

English summary

11 Foods To Fight Common Cold

Common cold normally occurs due to seasonal changes, allergies, intake of cold foods and sometimes viral and bacterial infections. Cold normally subsides within seven days and there is no need of antibiotics but if it is a viral or bacterial origin then you need to have medications.
Story first published: Wednesday, May 20, 2015, 17:32 [IST]
Desktop Bottom Promotion