For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సహజ వైద్యాన్ని అందించే ఏడు మూలికలు

|

మూలికలు, సుగంధ ద్రవ్యాలను సాధారణంగా అందరూ.. వంటకాల్లో వాడుతూ ఉంటారు. అయితే వంటల్లో ఘుమఘుమలే కాదు.. ఆరోగ్య సమస్యలను దూరంచేసే గుణం వీటిల్లో ఉంది. వీటిల్లో యాంటీయాక్సిడెంట్స్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ వంటి లక్షణాలు ఉండటంతో.. మెడిసిన్స్ గా పనిచేస్తాయి. ఏ హెర్బ్స్ ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయో తెలుసుకుందాం.

మనం ఉపయోగించే మూలికలు, సుగంధ ద్రవ్యాల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. జలుపు, దగ్గు లాంటి వాటిని ఈ మూలికలు ఉపయోగించి ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. మెండైన ఆరోగ్య ప్రయోజనాలున్న టాప్ సెవెన్ హెర్బ్స్ ఏంటో చూద్దాం.

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క మూలికా వైద్యంలో కీలకపాత్ర పోషిస్తుంది. శరీరంలో బ్లడ్ క్లాట్స్ ని నివారించడానికి చెక్క బాగా ఉపయోగపడుతుంది. ఇన్సులిన్ లెవెన్ ని కూడా పెంచే శక్తి దాల్చిన చెక్కకు ఉంది. కాబట్టి వంటల్లో సువాననే కాదు.. మీ ఆరోగ్యానికి ప్రయోజనాలు చేకూర్చే చెక్కను మీ ఆహారంలో చేర్చుకోండి.

లవంగాలు

లవంగాలు

లవంగాల్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. లవంగాలు యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయి. గుండె జబ్బులును అరికట్టడమే కాకుండా.. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. లవంగాలను తరచుగా తీసుకోవడం వల్ల కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

ధనియాలు

ధనియాలు

జీర్ణశక్తిని పెంపొందించడానికి ధనియాలు ఉపయోగపడతాయి. నిత్యం తాగే టీ రుచిలో కొన్ని సందర్భాల్లో ధనియాల టేస్ట్ ని జోడించండి. కొన్ని ధనియాలను దంచి టీలో ఉడకబెట్టి తాగితే జీర్ణక్రియ సరైన క్రమంలో ఉంటుంది.

పండుమిర్చి

పండుమిర్చి

ఎర్రగా.. ఘాటైన రుచితో.. వంటలకు మరింత రుచిని అందించే పండుమిర్చి.. మధుమేహం రాకుండా.. చూస్తుంది. ఇది.. షుగర్ వ్యాధికి సంబంధించిన ఎలాంటి సమస్యలనైనా పోగొట్టడానికి.. మెడిసిన్ లా పనిచేస్తుంది. తీసుకునే ఆహారంలో పండుమిర్చిని భాగం చేసుకుంటే కావాల్సినన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.

జాజికాయ

జాజికాయ

జాజికాయ పళ్ల ఆరోగ్యానికి సంజీవని అని చెప్పాలి. ఇది యాంటీ బాక్టీరియల్ గా పనిచేస్తుంది. కాబట్టి నోటిలో బ్యాక్టీరియాని నాశనం చేసి.. క్యావిటీల నుంచి రక్షించడానికి జాజికాయ ఉపయోగపడుతుంది.

పసుపు

పసుపు

మనం నిత్యం ప్రతి వంటలోనూ ఉపయోగించే పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది. క్యాన్సర్ దరిచేరకుండా చూడటంలో పసుపు తోడ్పడుతుంది. అంతేకాదు.. యాంటీసెప్టిక్ గా కూడా పసుపు పనిచేస్తుంది.

English summary

7 Top Healing Herbs And Spices: health tips in telugu

There are many herbs and spices have medicinal values. In this article let's learn about the seven top herbs and spices that are best for our health. Certain spices are used to cure cold and flu where in there are other herbs which help you heal faster.
Desktop Bottom Promotion