For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెసలు తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు మెండు...

|

పెసలు భారతీయ ఆహారం. మన దేశంలో పూర్వీకుల నుంచి వీటి వాడకం ఎక్కువగా ఉంది. ఇపుడు ప్రపంచమంతా ‘మూంగ్‌దాల్‌' అని పిలిచే ఇష్టమైన స్నాక్‌ ఐటమ్‌ పెసలే.ప్రొటీన్లు, కాల్షియం, ఫాస్ఫరస్‌, ఇంకా కొన్ని విటమిన్లు కలిగిన మంచి పోషక విలువలున్న ఆహర పదార్థ ఇది. చైనాలో దీన్ని లుడౌ అని పిలుస్తారు, మనకన్నా చైనా వాళ్ళు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వేడిని తగ్గిస్తుందని దీన్ని వడదెబ్బ కొట్టినప్పుడు, చెమట కాయలు, దురదలు దద్దుర్లు వచ్చినప్పుడు వాడతారు. ఆహారంలో విష దోషాలు ఏర్పడినప్పుడు ఇది విరుగుడుగా పని చేస్తుందని చైనీయులకు ఒక నమ్మం.

ఇంతకీ పెసలు తినటం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేకూరుతుందో తెల్సుకుందాం. పెసలు అంటేనే వెంటనే మనకు గుర్తొచ్చేది పులగం. కూరల్లో పెసలు వాడతారు. పెసర దోసె రుచికరంగా ఉంటుంది. ప్రస్తుతం మొలకెత్తిన పెసలు, మూంగ్‌దాల్‌కు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చే పెసలంటే అందరికీ ఇష్టమే.

ముడిపెసళ్లలో విటమిన్స్, ప్రోటీనులు అధికంగా మరియు లోకార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఉడికించిన వాటిలో 100 క్యాలరీలకంటే తక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి రక్షణ కల్పించడం మాత్రమే కాదు, చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. మరి ముడిపెసళ్లలోని హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాము...

బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గిస్తుంది:

ముడిపెసలు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల పొట్ట ఫుల్ గా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. అదే సమయంలో ఆకలి అవ్వనివ్వకుండా, బరువును కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. ఒక కప్పు మూగ్ దాల్ ను చపాతీలతో పాటు రాత్రి పూట తీసుకుంటే బరువు తగ్గాలనుకొనేవారికి గ్రేట్ గా సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి పెసలు అద్భుతంగా ఉపయోగపడతాయని పరిశోధకులు అంటున్నారు. రోజూ బియ్యంలోకి కాసిన్ని పెసలు కలిపి పులగం చేసుకుని తింటే ఊహించని రీతిలో బరువు తగ్గొచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తాయి

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తాయి

పెసలు అధికంగా ఉండే బ్లడ్‌ ప్రెషర్‌ను తగ్గిస్తాయి. శరీరంలోని చెడు కొలెసా్ట్రల్‌ను తగ్గిస్తాయి.అందుకు పెసల్లో ఉండే సోడియం గ్రేట్ గా సహాయపడుతుంది. దాంతో హెల్తీగా మరియు యాక్టివ్ గా ఉండటానికి సహాయపడుతుంది.

 ఐరన్ కంటెంట్ ఎక్కువ:

ఐరన్ కంటెంట్ ఎక్కువ:

ఐరన్ లోపంతో బాధపడే వారు రెగ్యులర్ డైట్ లో పెసలను చేర్చుకోవాలి. వీటిలో ఐరన్‌ కంటెంట్‌ అధికంగా ఉంటుంది. రోజూ వారి ఆహారంలో పెసల్ని భాగం చేస్తే అనీమియా లాంటి వ్యాధులు రాకుండా చేయవచ్చు. ముఖ్యంగా వెజిటేరియన్ డైటర్స్ లో ఐరన్ లోపం ఉంటుంది. అలాంటి వారికి ఇవి గ్రేట్ గా సహాయపడుతాయి .

చర్మ సంరక్షణకు:

చర్మ సంరక్షణకు:

పెసల్లో విటమిన్‌ బి, విటమిన్‌ సి, మాంగనీసుతో పాటు ప్రొటీన్లు అత్యధికంగా ఉంటాయి. ముఖ్యంగా పెసలు చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. సూర్యుని నుంచి వచ్చే అతినీలిలోహిత కిరణాలు, పర్యావరణ కాలుష్యం వల్ల వచ్చే చర్మ సమస్యలు పెసలు ఆహారంగా తీసుకోవటం వల్ల తొలగిపోతాయి. సున్నిపిండి తయారీలో పెసలను ఉపయోగిస్తారు. దీని వల్ల చర్మంలో మృదుత్వం వస్తుంది. పెసలులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీరాడికల్స్ తో పోరాడి, క్యాన్సర్ కణాల నుండి రక్షణ కల్పిస్తుంది.

డైటరీ ఫైబర్ అధికం:

డైటరీ ఫైబర్ అధికం:

డైటరీ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ. పెసలు తింటే ఆరోగ్యంతో పాటు చురుకుదనం కూడా వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించడం వల్ల హార్ట్ డిసీజ్ కు దూరంగా ఉండవచ్చు.

జుట్టు రక్షణకు:

జుట్టు రక్షణకు:

పెసలులో ఉండే పుష్కలమైనటువంటి ప్రోటీనులు మరియు న్యూట్రీషియన్స్ ఆరోగ్యకరమైన జుట్టు పొందడానికి సహాయపడుతాయి.

డయాబెటిస్‌

డయాబెటిస్‌

డయాబెటిస్‌ను క్రమబద్ధీకరించటానికి పెసలు ఉపయోగపడతాయి.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

జీర్ణం సులువుగా అయ్యేట్లు సహాయపడే ఈ ఆహారం తీసుకోవటం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్స్‌ దరి చేరవు.

కండరాల నొప్పి తగ్గిస్తుంది

కండరాల నొప్పి తగ్గిస్తుంది

పెసలు తినటం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతినదు. కండరాల నొప్పి, తలనొప్పి, నీరసాన్ని తగ్గించే గుణం వీటికి ఉంది.

టిచూపు సమస్యలు దరికి చేరవు.

టిచూపు సమస్యలు దరికి చేరవు.

రోజు వారి మెనూలో పెసలు ఉండటం వల్ల శరీరంలోని అనవసరమైన కెమికల్స్‌ నాశనం అవుతాయి. కంటిచూపు సమస్యలు దరికి చేరవు.

English summary

Amzing Health Benefits of Moong Dal:Health Tips in Telugu

Packed with protein and low on carbs, green gram or moong dal is one of the best vegetarian superfoods. An integral part of the Indian diet, it is a good and filling option for those who want to shed kilos.
Story first published: Thursday, November 12, 2015, 18:17 [IST]
Desktop Bottom Promotion