For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్రైఫ్రూట్స్ ను తినడానికి ముందు ఎందుకు నానబెట్టాలి? లాభాలేంటి..?

|

ఒకటా.. రెండా.. ఎన్నని చెప్పాలి.. డ్రైఫ్రూట్స్‌లోని గుణాలు.. ఆరోగ్యానికి ఎంత మంచి చేస్తాయో.. అంతటి శక్తిని కూడా ఇస్తాయి. శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందిస్తాయి. పైగా వీటి రుచి వలన పిల్లలు ఎంతో ఇష్టంగా కూడా తింటారు. వీటిని నేరుగానైనా.. లేదా వీటితో స్వీట్స్‌ వంటివి తయారు చేసుకుని తిన్నా సరే వీటి గుణాలు మాత్రం ఏ మాత్రం తగ్గవు. ఇప్పుడు మార్కెట్‌లోనూ వీటితో తయారు చేసిన పదార్థాలకు ఎంతో డిమాండ్‌ వుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపేవారు వీటిని అడిగి మరీ తీసుకుంటున్నారు మరి..

బాదం పాలతో ఆరోగ్యానికి గొప్ప ప్రయోజనాలు

ఆరోగ్యానికి కాలవలసిన పోషకాహారం పుష్కలంగా డ్రై ఫ్రూట్స్‌లో ఉన్నాయి. అవి చూడడానికి చిన్నవిగా ఉన్నా వాటికుండే శక్తి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇందులో ఖనిజలవణాలు, విటమిన్లు, ఎంజైములు స్రవించడానికి అవసరమైన వనరులు వీటిల్లో అధికం జీర్ణశక్తిని అధికం చేసి, రక్తాన్ని శుద్ది చేస్తాయి. అంతే కాకుండా సహజంగా తీసుకున్నా ఆహారం ద్వారా సంభవించే అనారోగ్యాలకు కూడా ఈ పండ్లు మంచి మందులా ఉపయోగపడతాయి. అంతే కాదు డ్రై నట్స్ ను తినడానికి ముందు నానబెట్టుట ద్వారా చాలా టేస్టీగా ఉండటమే కాదు, ఈజీగా జీర్ణం అవుతాయి.

కిస్మిస్ మంచి పోషకాహారమేకాదు, ఉత్తమ ఆహారం కూడా!

అందువల్ల డ్రైఫ్రూట్స్ తినడానికి ముందు నీటిలో సోక్(నానబెట్టుట)వల్ల గొప్ప ప్రయోజనాలున్నాయి. నట్స్ తినే అలవాటు ఉన్నట్లైతే, వీటిని నీటిలో నానబెట్టుట వల్ల పొందే ప్రయోజనాలు తెలుసుకోవడం వల్ల పొందే ప్రయోజనాలు తెలుసుకోవడం వల్ల మీరు కూడా తప్పకుండా నట్స్ ను నానబెట్టే తీసుకోవడానికి మెగ్గుచూపుతారు. డ్రై ఫ్రూట్స్ నానబెట్టి తీసుకోవడం వల్ల కోలన్ శుభ్రపరచడంతో పాటు ప్రేగులను శుభ్రం చేసి హెల్తీగా ఉంచుతుంది. డ్రైఫ్రూట్ ను నీటిలో నానబెట్టుట వల్ల శరీరానికి అవసరమైన ఖనిజాలు, విటమిన్లు, ఎంజైములు, అమినాయాసిడ్స్, యాంటీ ఆక్సిడెట్స్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్ లను మన శరీరానికి పుష్కలంగా అందిస్తాయి. మరిన నానబెట్టిన డ్రైఫ్రూట్స్ లో ఉండే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం...

ఫైటిక్ యాసిడ్స్ ను తొలగిస్తుంది:

ఫైటిక్ యాసిడ్స్ ను తొలగిస్తుంది:

డ్రై ఫ్రూట్స్ ను రాత్రంతా నీటిలో నానబెట్టు వల్ల తక్కలో ఉండే ఫైటిక్ యాసిడ్స్ తొలగించబడుతుంది. ఈ ఫైటిక్ యాసిడ్స్ నట్స్ కు ఉపయోగకరమైనవే కానీ, మనుష్యులకు కాదు . మానవ శరీరంలో ఫైటిక్ యాసిడ్స్ ఎక్కువైతే గ్యాస్ట్రోఇన్టెన్సినల్ సమస్యలకు దారితీస్తుంది మరియు న్యూట్రీషియన్స్ (ముఖ్యంగా మినరల్స్)ను గ్రహించదు . కాబట్టి నట్స్ ను తినడానికి 4గంటలు ముందు నానబెట్టుట వల్ల ఫైటిక్ యాసిడ్స్ ను తొలగిస్తుంది.

ఇర్రిటేబుల్ బౌల్ సిండ్రోమ్ ను నివారిస్తుంది:

ఇర్రిటేబుల్ బౌల్ సిండ్రోమ్ ను నివారిస్తుంది:

నట్స్ లో ఉండే ఎంజైమ్ నిరోధకాలు జీర్ణ సంబంధిత సమస్యలతో పాటు ఇర్రిటేబుల్ బౌల్ సిండ్రోమ్ సమస్యకు కారణం అవుతుంది . కాబట్టి, నట్స్ ను నానబెట్టుట వల్ల ఎంజైమ్ నిరోధకాలను తొలగిస్తుంది. దాంతో బౌల్ మూమెంట్ క్రమంగా ఉంటుంది. మలబద్దక సమస్యలుండవు . ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడే వారికి ఇది ఒక ఉత్తమ చిట్కా.

నట్స్ ను సోక్ చేయడం వల్ల టానిన్స్ తొలగిస్తుంది:

నట్స్ ను సోక్ చేయడం వల్ల టానిన్స్ తొలగిస్తుంది:

చాలా మంది టానిని అలర్జీని కలిగిస్తుంది .వీటిని బ్లాక్ టీలో కూడా కనుగొనడం జరిగింది . టానిన్స్ జీర్ణ సంబంధిత సమస్యలకు కారనం అవుతుంది . మరియు ఇతర సమస్యలకు కూడా కారనం అవుతుంది . అందువల్ల, నట్స్ ను నీటిలో నానబెట్టుట వల్ల టానిన్స్ ను తొలగించుకోవచ్చు.

కోలన్ హెల్త్ ను ప్రోత్సహిస్తుంది:

కోలన్ హెల్త్ ను ప్రోత్సహిస్తుంది:

నట్స్ తినడానికి ముందు నానబెట్టుట వల్ల కోలన్ శుభ్రం చేస్తుంది. కోలన్ లోని హానికరమైన టాక్సిన్స్ ను చాలా సులభంగా తొలగిస్తుంది . ఇంకా శరీరంలోనికి చాలా సులభంగా షోషింపబడుతుంది . నట్స్ ను నానబెట్టకుండా తీసుకోవడం వల్ల ప్రేగులకు చికాకు మరియు అసౌకర్యంగా ఉంటుంది. ఫలితంగా ప్రేగులు చాల తక్కవుగా పనిచేస్తాయి. దాంతో జీర్ణసమస్యలకు దారితీస్తుంది.

 మినిరల్స్ ను గ్రహిస్తుంది:

మినిరల్స్ ను గ్రహిస్తుంది:

ఫైటిక్ యాసిడ్స్ శరీరం మినిరల్స్ ను గ్రహించకుండా చేస్తుంది . దాంతో పోషకాల(ఐరన్, జింక్, మరియు మెగ్నీషియం) లోపం ఏర్పడుతుంది. కాబట్టి, నట్స్ తినడానికి ముందు తప్పనిసరిగా నీటిలో నానబెట్టుట వల్ల ఫైటిక్ యాసిడ్స్ ను తొలగించి పూర్తి పోషకాలు శరీరానికి అందేలా చేస్తాయి.

 నట్స్ మరియు సీడ్స్ లో ఫైటిక్ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి:

నట్స్ మరియు సీడ్స్ లో ఫైటిక్ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి:

వాల్ నట్స్, బాదం, జీడిపప్పు మొదలగువాటిలో ఫైటిక్ యాసిడ్స్ అధికంగా ఉంటాయి . నువ్వులు, గుమ్మడి విత్తనాలు, ఫ్లాక్స్ సీడ్స్, సన్ ఫ్లవర్ సీడ్స్ మొదలగు వాటిలో కూడా ఫైటిక్ యాసిడ్స్ అధికంగా ఉంటాయి . కాబట్టి వీటిలో ఏవి తీసుకొన్నా నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు.

నట్స్ ను నానబెట్టే విధానం:

నట్స్ ను నానబెట్టే విధానం:

చాలా వరకూ నట్స్ అండ్ సీడ్స్ అలాగే తినేస్తుంటాము. అలా చేయకుండా వాటని తినడానికి ముందు నానబెట్టాలి. నట్స్ ను ఒక బౌల్ నీటిలో వేసి, సీసాల్ట్ ను ఒక చెంచా వేసి మూత పెట్టి కనీసం 6గంటల సేపు నానబెట్టాలి. లేదా రాత్రంతా అలాగే పెట్టేయాలి . నానబెట్టుటకు ముందు వీటిని బాగా కడిగి నానబెట్టాలి.

గ్రెయిన్స్ కూడా నానబెట్టవచ్చు:

గ్రెయిన్స్ కూడా నానబెట్టవచ్చు:

గోధుమలు, బార్లీ మరియు ఓట్స్ లో కూడా ఫైటిక్ యాసిడ్స్ ఉంటాయి . ఈ ధాన్యాలను నానబెట్టుకు ముందు నానబెట్టే నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ లేదా నిమ్మరసం వేయడం మర్చిపోకండి. ఇలాచేయడం వల్ల ధాన్యాల మీద ఉండే టాక్సిక్ కోటింగ్ ను సులభంగా తొలగిస్తుంది.

యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. యాంటీయాక్సిడెంట్స్, మినిరల్స్ విటమిన్స్ వయస్సు లక్షణాలు కనబడనివ్వకుండా చేస్తాయి.

మైగ్రేన్ తలనొప్పిని తగ్గిస్తుంది.

మైగ్రేన్ తలనొప్పిని తగ్గిస్తుంది.

మైగ్రేన్ తలనొప్పిని తగ్గిస్తుంది. ఎండుద్రాక్ష కూడా బాదంలాగే, రాత్రంతా నీటిలో నానబెట్టడం వల్ల ఎక్కువ పోషకాలు, ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు . మైగ్రేన్ తలనొప్పి నివారిస్తుంది

English summary

Benefits Of Soaking Nuts & Seeds Before Eating

Benefits Of Soaking Nuts & Seeds Before Eating,Have you ever wondered why some people soak nuts and seeds before eating? Most people believe that soaking nuts makes it tasty and easy to digest. However, soaking nuts before eating has immense health benefits too. And we are sure that you will always soak nuts
Story first published: Thursday, December 3, 2015, 17:19 [IST]
Desktop Bottom Promotion