For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో చెమట మరియు వాసనకు కారణం అయ్యే 10 ఆహారాలు

|

చెమట పట్టడం ప్రతి ఒక్కరికీ సర్వసాధారణం. చెమట పట్టడం అనేది చెడ్డేమీ కాదు. ఇది శరీరానికి, ఆరోగ్యానికి చాలా మంచిది. కాని చెమటతోబాటు దుర్గంధం రావడం కాస్త ఇబ్బందికరమైన విషయం. ఇలాంటి సమస్య అతి కొద్దిమందిలో మాత్రమే ఉంటుంది. చెమట ఎండిపోయిన తర్వాత చర్మం నుంచి యూరియా లేక్ ఉప్పులాంటి కారకాలు అధికంగా స్రవించి రోగ కారకాలను ఆకర్షిస్తాయి.

ఇవే దుర్గంధానికి మూల కారణమవుతాయి. ఇంకా ఒత్తిడి మరియు మెనుష్ట్రువేషన్ కూడా చెమటకు ప్రధాణ కారణాలు. అంతే కాదు వేసవి సీజన్ లో ఉపయోగించే అదనపు డియోడరెంట్స్ కూడా శరీరం దుర్వాస రావడానికి ప్రధాణ కారణాలవుతున్నాయి. కొంతమందికి అత్యధిక చెమట వచ్చినా కూడా దుర్వాసన రాదు. కాని కొంతమందిలో చెమట తక్కువగా వచ్చినా కూడా దుర్గంధం భరించరానంతగా వుంటుంది.
దీనినుండి బయట పడటం ఏమంత కష్టం కాదు. అధిక చెమటను తగ్గించుకోవడానికి కొన్ని మంచి మార్గాలున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో పాటు, ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్యను నుండి బయటపడవచ్చు.

మీ ఫుడ్ లిస్ట్ లో కొన్ని ఆహారాలను మార్పు చేసుకోవడం వల్ల అది సాధ్యం అవుతుంది. జీర్ణవ్యవస్థ మరియు నాడీ వ్యవస్థ రెండూ చెమటకు అనుసందానమై ఉన్నాయి. అధిక చెమటను తగ్గించుకోవడానికి లేదా కంట్రోల్ చేసుకోవడానికి మీరు తీసుకొనే డైట్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. కొన్ని ఆహారాలు చెమట పట్టడానికి కూడా కారణం అవుతాయి? అలాంటి ఆహారాలను గుర్తించి వాటికి దూరంగా ఉండటం వల్ల వేసవి కాలంలో చెమటను నివారించుకోవచ్చు.

కాబట్టి, చెమట, మరియు చెమట ద్వారా వచ్చే దుర్వాసను నివారించడానికి కొన్ని ప్రత్యేక ఆహారాలున్నాయి.

1. బ్రొకోలీ, క్యాబేజ్ మరియు కాలీఫ్లవర్:

1. బ్రొకోలీ, క్యాబేజ్ మరియు కాలీఫ్లవర్:

బ్రొకోలీ, క్యాబేజ్, మరియు కాలీఫ్లవర్ వంటి ఆహార పదార్థాల్లో సల్ఫర్ అధికంగా ఉండటం వల్ల శరీరంలో వేడి కలిగి చెమట పట్టడానికి కారణం అవుతుంది.కాబట్టి, వేసవి సీజన్ లో వీటికి దూరంగా ఉండటం మంచిది.

2. రెడ్ మీట్:

2. రెడ్ మీట్:

రెడ్ మీట్ లో ఉండే అమినో యాసిడ్స్ ప్రేగుల్లోని ఎంజైమ్స్ తక్కవు వాసన కలిగి ఉంటాయి. ఎప్పుడైతే రెడ్ మీట్ తీసుకుంటారు అప్పుడు ఫోయల్ స్మెల్ అధికం చేస్తుంది. తద్వార చెమట ఎక్కువగా పడుతుంది. కాబట్టి, రెడ్ మీట్ ను మితంగా తీసుకోవాలి.

3. ప్రొసెస్డ్ లేదా జంక్ ఫుడ్:

3. ప్రొసెస్డ్ లేదా జంక్ ఫుడ్:

జంక్ ఫుడ్ తయారీకి ఉపయోగించే రిఫైనరీ ఆహారపదార్థాలు చెమట పట్టడానికి కారణం అవుతుంది. ఇవి బ్యాక్టీరియాతో చేరినప్పుడు చెమట దుర్వాసనకు కారణం అవుతాయి. కాబట్టి ప్రొస్సెస్ మరియు జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి.

4. చేపలు:

4. చేపలు:

చెమట పట్టించే ఆహారాల్లో చేపలు కూడా ఒకటి సాల్మన్ చేపల్లో ఉండే చోలిన్ అనే అంశం నేచురల్ ఫిషీ స్మెల్ కు కారణం అవుతుంది. ఇది కొంత మందిలో రెండు మూడు రోజుల అలాగే ఉండేట్లు చేస్తుంది. లేదా చెమట పట్టేందుకు కారణం అవుతుంది. కాబట్టి, చేపలను తినడం నివారించండి.

5. లో కార్బో ఫుడ్స్:

5. లో కార్బో ఫుడ్స్:

మీరు తీసుకొనే డైట్ లో కార్బోహైడ్రేట్ ఫుడ్స్ ను తగ్గించాలి. ఇవి ఫ్యాట్ ను కరిగించే సమయంలో శరీరంలో కొన్ని రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి శరీరంలో అదనంగా చెమటలు పట్టడానికి కారణం అవుతాయి.

6. స్పైసీ ఫుడ్స్:

6. స్పైసీ ఫుడ్స్:

మన రెగ్యులర్ వంటల్లో ఉపయోగించే మసాలా దినుసులు మరియు అల్లం, వెల్లుల్లి వంటి ఎక్కువగా వాడటం వల్ల శరీరంలో చెమట అధికంగా ఫడుతుంది. దాంతో శరీరంలో దుర్వాసన ఎక్కువ అవుతుంది. కాబట్టి, వేసవి సీజన్ ఇలాంటి ఆహారాలకు సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండటం మంచిది.

7. ఆల్కహాల్:

7. ఆల్కహాల్:

ఆల్కహాల్ కాలేయంలో ఎసిటిక్ యాసిడ్ కు కారణం అవుతుంది. కొన్ని రకాల ఆల్కహాల్ ఉత్పత్తులు శరీరంలో నేరుగా వేడి కలిగించి చెమటకు కారణం అవుతుంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల నోరు మాత్రమే కాదు, శరీర దుర్వాసనకు కూడా కారణం అవుతుంది.

8. ఆస్పరాగస్:

8. ఆస్పరాగస్:

కొంత మందికి ఆస్పరాగస్ సెట్ అవ్వదు. ముఖ్యంగా రోటెన్ వెజిటేబుల్ స్మెల్ అధికంగా ఉండటం వల్ల, శరీర దుర్వాసనకు కారణం అవుతుంది . అయితే అందరిలో అలా జరగకపోవచ్చు .

9. డైరీ ప్రొడక్ట్స్:

9. డైరీ ప్రొడక్ట్స్:

డైరీ ప్రొడక్ట్స్ లో ప్రోటీనులు అధికంగా ఉండటం వల్ల వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో హైడ్రోజన్ సల్ఫైడ్ మరియు మీథైల్ మెర్కాప్టిన్ శరీరంలో విడుదల చేస్తాయి. ఇవి శరీరంలో చెమట మరియు దుర్వాసనకు కారణం అవుతాయి .

10. సిగరెట్ స్మోకింగ్:

10. సిగరెట్ స్మోకింగ్:

స్మోకింగ్ వల్ల శరీరంలో వేడి కలిగి చెమట పట్టడంతో పాటు, దుర్వాసనకు కారణం అవుతుంది. ఈ వాసన కొద్ది సమయం వరకూ అలాగే ఉండటం వల్ల బ్యాక్టీరియా చేరి చెమట మరియు వాసనకు కారణం అవుతుంది.

English summary

10 Foods That Cause Body Odour

Body odour is a problem faced by many and after doing all measures it is still there. Genetics, personal hygiene and overall health can also be important factors to determine your body odour. The sweat on your skin is fermented by bacteria which creates a distinctive odour on your skin.
Story first published: Monday, May 4, 2015, 14:12 [IST]
Desktop Bottom Promotion