For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సలాడ్స్ తింటే బరువు తగ్గడం ఖాయం...

|

సలాడ్స్ గురించి మీరు వినే ఉంటారు. సలాడ్ అనేవి వివిధ రకాల వెజిటేబుల్స్ మరియు పండ్లతో తయారుచేస్తారు. ఇవి ఆరోగ్యకరమనవి మరియు రుచికరమైనవి. ఎప్పుడైనా ఆకలైతే వంట చేసుకునే ఓపిక లేనప్పుడు సలాడ్స్ చేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిది. ఆకలి కూడా తగ్గుతుంది. ఒక్క ఆకలి మాత్రమే కాదు, ఆరోగ్య పరంగా ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుంది.

ఆరోగ్యనిపుణుల ప్రకారం ప్రతి రోజూ సలాడ్స్ తినడం వల్ల, శరీర ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి మరియు చర్మ సౌందర్యానికి, శరీరం ఫిట్ గా ఉండటానికి గ్రేట్ గా సహాయపడుతుంది. మరియు సలాడ్స్ తయారుచేయడం చాలా సులభం. అందుకు మీరు చేయాల్సిందల్లా మీకు నచ్చిన మీకు ఇష్టపైన ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ ను ఎంపిక చేసుకోవడమే. వాటి శుభ్రంగా కడిగి కావల్సిన సైజ్ లో కట్ చేసుకొని తినడమే..

పండ్లు మరియు వెజిటేబుల్స్ తయారుచేసుకొనే సలాడ్స్ లో వివిధ రకాల న్యూట్రీషియన్స్ మరియు ప్రోటీన్స్ మరియు విటమిన్స్ అత్యధికంగా ఉన్నాయి. వీటిలో క్యాలరీలు చాల తక్కువగా ఉంటాయి. ఈ న్యూట్రీషియన్ ఫుడ్స్ మిమ్మల్ని బరువు పెరుగకుండా కంట్రోల్ చేస్తాయి. అంతే కాదు వివిధ రకాలుగా తీసుకొనే సలాడ్స్ లో వివిధ రకాల హెల్త్ బెనిఫిట్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి...

1. ఫైబర్ అధికం:

1. ఫైబర్ అధికం:

పండ్లు మరియు కూరగాయలతో తయారుచేసుకొనే సలాడ్స్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. సలాడ్స్ ఎఫ్పుడు శుభ్రం చేసిన ఫ్రెష్ గా ఉండే పండ్లు మరియు కూరగాయలను పచ్చివి తీసుకోవాలి. రెగ్యులర్ గా తీసుకొనే ఈ ఫుడ్స్ లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది.

2. క్యాన్సర్:

2. క్యాన్సర్:

సలాడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల వివిధ రకాల క్యాన్సర్ ప్రమాధాన్ని తగ్గిస్తుంది. కాబట్టి, మీరు తయారుచేసుకొనే సలాడ్స్ లో బేరిపండ్లు, స్ట్రాబెర్రీస్, ప్లమ్స్, పీచెస్, ఆపిల్స్, క్యారెట్, టమోటో, పెప్పర్ మరియు పీస్ ను జోడించండి.

3. మలబద్దకం నివారిస్తుంది:

3. మలబద్దకం నివారిస్తుంది:

సలాడ్స్ రూపంలో ఫైబర్ రిచ్ ఫుడ్స్ ను తినడం వల్ల మలబద్దకం సమస్యను నివారిస్తుంది . ప్రతి రోజూ సలాడ్స్ తినడం వల్ల బౌల్ మూమెంట్ సున్నితం చేస్తుంది.

4. యాంటీఆక్సిడెంట్స్:

4. యాంటీఆక్సిడెంట్స్:

మీరు తీసుకొనే సలాడ్స్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నవి చేర్చుకోవాలి. ఎందుకంటే ఈ యాంటీఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ ఫ్రీరాడికల్ డ్యామేజ్ ను తగ్గిస్తుంది.

5. ఆకుకూరలు మరియు లెట్యుస్:

5. ఆకుకూరలు మరియు లెట్యుస్:

మీరు తీసుకొనే రెగ్యులర్ డైట్ లో ఆకుకూరలు మరియు లెట్యుస్ చేర్చుకోవడం వల్ల కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్ ఎలోపంతో బాధపడే వారికి ఈ సలాడ్స్ గ్రేట్ గా సహాయపడుతాయి.

6. బరువు తగ్గిస్తుంది:

6. బరువు తగ్గిస్తుంది:

ఫైబర్ అధికంగా ఉండే ఫ్రూట్ మరియు వెజ్ సలాడ్స్ తిన్నప్పుడు బరువు తగ్గించడంలో ఇవి అంతర్ఘతంగా సహాయపడుతుంది. . కాబట్టి బరువు తగ్గించుకోవాలనుకొనే వారు సలాడ్స్ ను మర్చిపోకండి.

7. హెల్తీ హార్ట్:

7. హెల్తీ హార్ట్:

సలాడ్స్ తినడం వల్ల హార్ట్ హెల్తీగా ఉంటుంది. ఈ సలాడ్స్ రాఫుడ్స్ వల్ల న్యూట్రీషియన్స్ ఎక్కువగా పొందవచ్చు.

8. ఆకుకూరలు మరియు వాటర్ క్రెస్:

8. ఆకుకూరలు మరియు వాటర్ క్రెస్:

సలాడ్స్ లో ఆకుకూరలు మరియు వాటర్ క్రెస్ ఉండటం వల్ల బోన్ హెల్త్ కు చాలా గ్రేట్ గా సహాయపడుతుంది . కాబట్టి సలాడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది.

English summary

Health Benefits Of Salads

We all know about the health benefits of salads but we don't try them as they are boring. But if you include them in your diet, you won't regret as they are really good for your wellness. In fact health experts opine that eating salads everyday could be the healthiest thing you can do to your body.
Story first published: Saturday, May 23, 2015, 17:05 [IST]
Desktop Bottom Promotion