For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్తీ ఫుడ్సే అయినా, మోతాదుకు మించితే సమస్యలు తప్పవు....

|

సహజంగా మనం ఏరకమైన ఫుడ్ తీసుకొన్నా మితంగా తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. అదే మోతాదుకు మించితే ఇక అంతే. ముఖ్యంగా మన శరీరానికి ఎంత అవసరం అవుతుంది, ఎంత ఆహారాన్ని తీసుకోవాలి అని తెలుసుకోవాలి. . మోతాదు మించి తినడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. కాబట్టి మనం తీసుకొనే ఆహారాల మీద ఒక కన్నేసి ఉంచాలి. మనం రెగ్యులర్ గా తీసుకొనే హెల్తీ డైట్ మీ ఏకాగ్రత పెట్టడం చాలా అవసరం.

మన శరీరానికి డిఫరెంట్ మినిరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్ మరియు కొన్ని పోషకాంశాలు అవసరం అవుతాయి. ఇవి శరీరానికి చాలా అవసరం అవుతాయి . కాబట్టి మీరు రెగ్యులర్ డైట్ లో తీసుకొనే ఆహారాల్లో తప్పనిసరిగా ఈ పోషకాలు, మినిరల్స్, విటమిన్స్ ఉండేట్లు చూసుకోవాలి.

ముఖ్యంగా తీసుకొనే ఆహారం లిమిట్ చేసుకుంటూ డైట్ ను బ్యాలెన్స్ చేసుకోవాలి . ఈ ఆర్టికల్లో కొన్ని హెల్తీ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయన్న విషయం తెలుసుకుందాం...మరి ఆహారాలు గురించి తెలుసుకుందాం..

క్యారెట్:

క్యారెట్:

క్యారెట్స్ ను మోతాదుకు మించి తినడం వల్ల బీటాకెరోటిన్ అధికమైతుంది. దాంతో రక్తంలో మార్పులు ఏర్పడి స్కిన్ ఆరెంజ్ గా మారుతుంది . కాబట్టి, క్యారెట్ హెల్తీ ఫుడ్ అయినా, మోతాదుకు మించితే, చర్మ సమస్యలు తప్పవు.

 కాఫీ:

కాఫీ:

ఎక్సెస్ కాఫీ వల్ల నాడీవ్యవస్త, నిద్రలేమి, కండరాల సమస్లయు మరియు హార్ట సమస్యలు అధికమౌతాయి . కాబట్టి ఒక రోజులో రెండు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగకూడదు.

ఫిష్ ఆయిల్:

ఫిష్ ఆయిల్:

ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తం పల్చగా మార్చుతుంది . ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కానీ మోతాదు మించితే విటమిన్ ఎ టాక్సిసిటీ, కంటిసమస్యలు మరియు వికారం వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి, హెల్తీ ఫుడైనా, ఎక్కువైతే సమస్యలే.

తున ఫిష్:

తున ఫిష్:

తున ఫిష్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో మెర్క్యురి మోతాదు పెరుగుతుంది , ఇది కంటి సమస్యలు, కోఆర్డినేషన్, చిన్న పిల్లల్లో డెవలంప్ మెంటల్ డిలేస్ వంటి సమస్యలు ఎదురవుతాయి . కాబట్టి, వారానికొకసారి తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగించుకోవచ్చు . ఎక్కువైతే సమస్యలు అధికమే.

 దాల్చిన చెక్క:

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్కలో క్యూమరిన్ అనే కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది క్యాన్సర్ కు కారణం అవుతుంది . కాబట్టి, మితంగా తీసుకోవడమే బెటర్.

బ్రాజిల్ నట్స్

బ్రాజిల్ నట్స్

బ్రాజిల్ నట్స్ లో సెలీనియం అధికంగా ఉంటుంది. ఇది టాక్సిన్స్ ను అధికంగా గ్రహిస్తుంది. కాబట్టి, వీటిని మితంగా తీసుకోవడమే మంచిది

English summary

Healthy Foods That Become Dangerous: Health Tips in Telugu

Healthy Foods That Become Dangerous: Health Tips in Telugu, Any food can harm your health when it is consumed in excess. It is just a matter of understanding how much you can eat or how much your body needs. Today, learn about the foods that can become dangerous if you eat too much. This helps us focus on a
Story first published: Saturday, October 31, 2015, 17:36 [IST]
Desktop Bottom Promotion