For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అధికమూ అనర్ధమే..విటమిన్ సి అధికమైతే వచ్చే సమస్యలు..

|

సాధారణంగా మన శరీరంలో విటమిన్ సి యొక్క ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. విటమిన్ సి వ్యాధినిరోధకతను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. విటమిన్ సి అధికంగా ఉన్న ఆహారాలు మితంగా తీసుకుంటే పర్వాలేదు కానీ, మోతాదు మించితే ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.

మన శరీరంలో విటమిన్ సి లోపిస్తే అది వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది . అదే విధంగా విటమిన్ సి అధికంగా తీసుకోవడం వల్ల కూడా వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురి చేస్తుంది.

నిమ్మ మరియు నారింజ, బత్తాయి వంటి సిట్రస్ ఫుడ్స్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాబట్టి, వీటిని మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటాము . అయితే ఈ ఆహారాలను తీసుకొనే ముందు విటమిన్ సి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోవాలి.

ఆరోగ్య నిపుణుల మన శరీరంలో విటమిన్ సి అధికమైతే ఏం జరుగుతోందో ఈ క్రింది లిస్ట్ లో తెలపడం జరిగినది...

1. యూరిన్ లో బ్లడ్:

1. యూరిన్ లో బ్లడ్:

కొంత మందిలో విటమిన్ సి అధికం అవ్వడం వల్ల పొట్ట ఉదరబాగంలో కొద్దిగా నొప్పిగా అనిపిస్తుంది. మరియు యూరిన్ లో కొద్దిగా బ్లడ్ పడినట్లు అగుపడుతుంది.

2. తలతిరగడం:

2. తలతిరగడం:

శరీరంలో విటమిన్ సి అధికమైతే తలతిరిగినట్లు అనిపిస్తుంది . ఇలాంటి లక్షణాలు కనబడ్డప్పుడు వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

3.నొప్పి:

3.నొప్పి:

విటమిన్ సి అధికమైనప్పుడు యూరినరీ ట్రాక్ లో ఒక విధమైనటువంటి నొప్పిని అనుభవిస్తారు. ఇది కేవలం విటమిన్ సి అధికంగా తీసుకోవడం వల్లే అని గ్రహించాలి.

4. వెన్ను నొప్పి:

4. వెన్ను నొప్పి:

విటమిన్ సి అధికమైతే లోయర్ బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశాలున్నాయి. మరియు మరికొన్న సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి.

5. స్టొమక్ క్రాంప్స్:

5. స్టొమక్ క్రాంప్స్:

విటమిన్ సి ఓవర్ డోస్ వల్ల చాలా అరుదుగా, కడుపు నొప్పి కూడా, కడుపులో తిమ్మెర్ల వంటి లక్షణాలు కలిగి ఉంటారు.

6. తలనొప్పి:

6. తలనొప్పి:

విటమిన్ సి ఆహారాలు అధికంగా తీసుకోవడం వల్ల అనుకోకుండా ఊహించిన విధంగా తలనొప్పికి గురి కావల్సి వస్తుంది. విటమిన్ సి వల్ల ఇది మరో సైడ్ ఎఫెక్ట్.

7. డయేరియా:

7. డయేరియా:

విటమిన్ సి ఓవర్ డోస్ వల్ల మోషన్స్ అయ్యే ప్రమాదం ఉంది . అలాంటి లక్షణాలు ఉన్నట్లైతే మీరు విటమిన్ సి ఎంత మోతాదులో తీసుకుంటున్నారో గమనించాల్సి ఉంటుంది.

8.వికారం:

8.వికారం:

విటమిన్ సి అధికమైతే మరో సాధారణ సమస్య వికారం . ఇలాంటి లక్షణాలున్నప్పుడు వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

9. హార్ట్ బర్న్:

9. హార్ట్ బర్న్:

విటమిన్ సి అధికంగా తీసుకోవడం వల్ల గుండెలో మంటగా ఉంటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు . కాబట్టి విటమిన్ సి వాడకాన్ని పరిమితం చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు .

English summary

Is Overdose Of Vitamin C Dangerous?

Is overdose of vitamin C unhealthy? Well, consuming enough of Vitamin C is important but too much of it can be harmful to your health.
Story first published: Tuesday, October 27, 2015, 16:23 [IST]
Desktop Bottom Promotion