For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హై బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేసే నేచురల్ ఫుడ్స్

|

హై బ్లడ్ ప్రెజర్ ను నేచురల్ గా తగ్గించుకోవచ్చన్న విషయం మీకు తెలుసా?సోడియం వాడకం తగ్గించుకోవడం కంటే మరో గొప్ప మార్గం లేదు. అయితే ఇది మాత్రమే పరిష్కారం కాదు. బ్లడ్ ప్రెజర్ ను తగ్గించుకోవడంలో కొన్ని రకాల ఆహారాలు కూడా బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేయడంలో ప్రధానపాత్ర పోషిస్తాయని కొన్ని పరిశోధన ద్వారా వెల్లడైనది . కాబట్టి, బ్లడ్ ప్రెజర్ మీద రెగ్యులర్ మానిటరింగ్ చాలా అవసరం. దాంతో పాటు, బ్లడ్ ప్రెజర్ ను తగ్గించుకోవడం కోసం సరైన ఆహారాలను ఎంపిక చేసుకోవడం కూడా ముఖ్యమే...

మనం ఎంపిక చేసుకొనే ఆహారాల్లో ఖచ్చితంగా 2 లేదా 3 పవర్ ఫుల్ మినిరల్స్ ఉండేట్లు చూసుకోవాలి. ముఖ్యంగా అందులో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, మొదలగునవి ఉండేట్లు చూసుకోవాలి. అదే విధంగా సోడియం ఉన్న ఆహారాలను తక్కువగా తీసుకోవాలి . బ్లడ్ వెజిల్స్ కు సహాయపడే ఆహారాలను తీసుకోవాలి. ఇవి రక్తప్రసరణను క్రమబద్దం చేసి, ఎఫెక్టివ్ గా బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది.

READ MORE: హై బ్లడ్ ప్రెజర్ ను మరింత పెంచే 10 వరెస్ట్ ఫుడ్స్

అదే విధంగా హైబ్లడ్ ప్రెజర్ ను తగ్గించడంలో జీవన శైలి కూడా ముఖ్య పాత్రను పోషిస్తుంది . ఆరోగ్యకరమైన జీవనశైలితో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేసుకోవచ్చు. నేచురల్ గా తగ్గించుకోవడానికి ఇంతకంటే మంచి మార్గం మరొకటి లేదు....

హై బ్లడ్ ప్రెజర్ ను తగ్గించే హెల్తీ ఫుడ్స్:

వైట్ బీన్స్:

వైట్ బీన్స్:

హై బ్లడ్ ప్రెజర్ తగ్గించడంలో వైట్ బీన్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. వీటిలో క్యాల్షియం, మెగ్నీషియం, మరియు పొటాషియం పుష్కలంగా ఉంటాయి . వీటిలో ఉండే పవర్ ఫుల్ మినిరల్స్ బ్లడ్ ప్రెజర్ ను మెయింటైన్ చేయడానికి తగ్గించడానికి సహాయపడుతాయి . కాబట్టి వీటిని డైలీ డైట్ లో చేర్చుకొని బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను మ్యానేజ్ చేయండి.

పోర్క్:

పోర్క్:

పోర్క్ లో అధిక శాతంలో పొటాషియం మరియు మెగ్నీషియం ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెజర్ ను తక్షణం తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది ఒక బెస్ట్ ఫుడ్ ఆప్షన్ గా గుర్తించడం జరిగింది. హైబ్లడ్ ప్రెజర్ తగ్గించడానికి ఒది ఒక హెల్తీ ఫుడ్.

 ఫ్యాట్ ఫ్రీ యోగర్ట్:

ఫ్యాట్ ఫ్రీ యోగర్ట్:

మీ రెగ్యులర్ డైట్ లో కనీసం ఒక కప్పు పెరుగును తీసుకోవాలి. ఇది శరీరానికి అవసరం అయ్యే క్యాల్షియంను 49శాతం మరియు 12శాతం మెగ్నీషియంను తీసుకోవాలి. కాబట్టి పెరుగును రెగ్యులర్ గా తీసుకోవాలి. హైబ్లడ్ ప్రెజర్ ను తగ్గించే ఒక హెల్తీ ఫుడ్ గా దీన్ని భావించవచ్చు.

సెరెల్స్:

సెరెల్స్:

డైలీ బ్రేక్ ఫాస్ట్ లో సెరెల్స్ ను చేర్చుకోవడం చాలా మంచిది. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఓట్ మీల్, బ్రాన్ ఫ్లేక్స్ లేదా గోధుమలతో తయారుచేసినవి వంటి ఆహారాలు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వవచ్చు హైబ్లడ్ ప్రెజర్ పెరగకుండా ఇవి సహాయపడుతాయి.

బేక్డ్ పొటాటోలు:

బేక్డ్ పొటాటోలు:

పొటాషియం, మెగ్నీషియం మరియు క్యాల్షియం వంటి మినిరల్స్ హైబ్లడ్ ప్రెజర్ ను తగ్గించడంలో సహాయపడుతాయని కొన్ని పరిశోధన ద్వారా వెల్లడించడం జరిగింది. బంగాళదుంపలు రెగ్యురల్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మినిరల్స్ గ్రేట్ గా సహాయపడుతాయి.

బీట్ రూట్:

బీట్ రూట్:

బ్లెడ్ ప్రెజర్ ను తగ్గించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది . ఒక గ్లాసు బీట్ రూట్ జ్యూస్ త్రాగడం వల్ల బ్లడ్ ప్రెజర్ ను ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది. ఈ జ్యూస్ లో ఉండే నైట్రేట్స్ హైబ్లడ్ ప్రెజర్ ను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

 డార్క్ చాక్లెట్:

డార్క్ చాక్లెట్:

డార్క్ చాక్లెట్స్ లో ఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. బ్లడ్ వెజల్స్ విస్తరణకు సహాయపడుతాయి. దాంతో శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది మరియు బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది . హైపర్ టెన్షన్ తగ్గుతుంది. కాబట్టి రెగ్యులర్ డైట్ లో డార్క్ చాక్లెట్స్ చేర్చుకోవడం చాలా అలవసరం.

English summary

Power Foods To Reduce High Blood Pressure : Health Benefits in Telugu

Have you ever wondered how you can reduce high blood pressure naturally? Well, you can do so by reducing your sodium intake to a great extent. However, this is not the only solution. Studies reveal that certain foods play a major role in controlling our blood pressure.
Story first published: Friday, November 13, 2015, 18:00 [IST]
Desktop Bottom Promotion