For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్తీ అండ్ స్ట్రాంగర్ స్పెర్మ్ కౌంట్ పెంచే హెల్తీ ఫుడ్స్

|

వేగంగా మారుతున్న నగర జీవనం, జీవన విధానాలు, ఒత్తిడి, అలసట, మానసిక సమస్యలు వంటివన్ని పురుషుడ్ని నిర్వీర్యుడ్ని చేస్తున్నాయి. వివాహమై నాలుగేళ్లు లేదా అయిదేళ్ళు అయినప్పటికి జంటలు సంతానం పొందలేకపోతున్నారు. సంతానం లేకపోవడానికి స్పెర్మ్ కౌంట్ తక్కువగా వుండడం కూడా ఒక కారణం. మగవారిలో సంతాన సాఫల్యత కలగకపోయేందుకు పలు రకాల కారణాలు ఉండవచ్చు. వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండేందుకు, వాటి మొబిలిటీ (చలనం) తక్కువగా ఉండేందుకు లేదా అండాన్ని ఫలదీకరించే శక్తి తక్కువగా ఉండేందుకు ఎన్నో రకాల కారణాలు ఉండవచ్చు.

వీర్యం ఉత్పత్తిలో లేదా పనితీరులో చోటు చేసుకునే అసాధరణత్వాలు, సాధారణ ఆరోగ్యం, జీవనశైలి సంబంధిత అంశాలు, కొన్ని రకాల పరిస్థితులకు ఎక్కువగా లోను కావడం ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. చాలా వరకు సమస్యలు వీర్యానికి సంబంధించినవే అయి ఉంటాయి. మరి పురుషులలో ఈ రకమైన పునరుత్పత్తి సమస్యను అధిగమించటానికి జీవనశైలిలో కొన్ని మార్పలతో పాటు రెగ్యులర్ డైట్ లో మార్చుకుంటే సమస్యను అధిగమించవచ్చు.

READ MORE: పురుషుల్లో స్పెర్మ్ కౌంట్(వీర్యవృద్ధి)కు సహజ మార్గాలు

స్పెర్మ్ కౌంట్ ను తగ్గించడంలో కొన్ని రకాల ఆహారాల నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయనాలు, ఆహారాలు పండించడానికి ఉపయోగించే మందులు, స్మోకింగ్, ఆల్కహాల్, కొన్ని ప్రత్యేకమైన థెరఫిటిక్ డ్రగ్స్ వంటివి తీవ్రప్రభావాన్ని చూపుతాయి. ఇంాక పోషకాహార లోపం, ఫైబర్ సరిపడా అందకపోవడం కూడా స్పెర్మ్ కౌంట్ ను తగ్గించడంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి.

కొన్ని పరిశోధనల ప్రకారం కొన్ని హెల్తీ మైక్రోన్యూట్రీషియన్స్, విటమిన్ సి, ఇ, ఫోలిక్ యాసిడ్ మరియు జింక్ పుష్కలంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల స్పెర్మ్ డిఎన్ఎ క్వాలిటీని మెరుగుపరుస్తుంది. హెల్తీ డైట్ వల్ల స్పెర్మ్ కౌంట్ వ్రుద్ది చెందుతుంది. అలాగే వీర్యం వాల్యూమ్ కూడా పెరుగుతుంది. మరి పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ను పెంచే హెల్తీ ఫుడ్స్ ఈ క్రింది విధంగా ....

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లిలో ఆశ్చర్యకరమైన ఎల్లిసిన్ ఉండి సెక్స్యువల్ ఆర్గాన్స్ కు రక్త ప్రసరణ అంధించడానికి బాగా సహాయపడుతాయి. ఇవి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల లిబిడో సమస్యలను దూరంగా ఉంచి, స్పెర్మ్ క్వాలిటీని స్ట్రాంగ్ గా మార్చడానికి సహాయపడుతుంది. ఇంకా వెల్లుల్లి ఉండే విటమిన్ బి6, సెలీనియం వంటి కాంపౌంట్స్ సెక్స్ హార్మోనులను తిరిగి ఉత్పత్తి అయ్యేలా క్రమబద్దం చేస్తుంది . మరియు స్పెర్మ్ డ్యామేజ్ ను తగ్గిస్తుంది.

వాల్ నట్స్:

వాల్ నట్స్:

వాల్ నట్స్ లో ఆర్గినైన్ పుష్కలంగా ఉంటుంది. ఇది సెమన్ వాల్యూమ్ ను మెరుగుపరచడంలో మరియు స్పెర్మ్ ఉత్పత్తి అవ్వడానికి సహాయపడుతుంది. మరియు ఇందులో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది పీనిస్ కు బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరచడానికి సహాయపడుతుంది .వాల్ నట్స్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వివిధ రకాల వ్యాధుల నుండి రక్షణ కల్పించడానికి సహాయపడుతుంది.

గుడ్డు:

గుడ్డు:

గుడ్డులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది టెస్టికల్స్ యొక్క కణాల పునరుత్పత్తికి సహాయపడుతుంది . ఇంకా ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్ ను న్యూట్రలైజ్ చేస్తుంది మరియు కణాలకు రక్షణ కల్పిస్తుంది . గుడ్డు రెగ్యులర్ గా తినడం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరగడంతో పాటు, సంతానోత్పత్తికి సహాయపడుతుంది.

దానిమ్మ:

దానిమ్మ:

దానిమ్మలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి, ఇవి స్పెర్మ్ ను డ్యామేజ్ చేసే malondialdeyde ను తగ్గించడానికి సహాయపడుతుంది . దానిమ్మను రెగ్యులర్ గా తినడం వల్ల శరీరంలో ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది మరియు స్పెర్మ్ కౌంట్ పెంచుతుంది.

అరటిపండ్లు:

అరటిపండ్లు:

అరటిపండ్లలో బ్రొమైలిన్ అధికంగా ఉంటుంది . ఈ ఎంజైమ్ సెక్స్ హార్మోన్లను కంట్రోల్ చేస్తుంది. ఇంకా అరటిపండ్లలో విటమిన్ ఎ, బి1 మరియు సిలు పుష్కలంగా ఉన్నాయి. ఈ విటమిన్స్ స్పెర్మ్ ప్రొడక్షన్ ను మెరుగుపరచడంతో పాటు స్టామినా పెంచుతుంది. స్పెర్మ్ కౌంట్ పెంచడానికి ఇది ఒక బెస్ట్ ఫుడ్.

డార్క్ చాక్లెట్:

డార్క్ చాక్లెట్:

డార్క్ చాక్లెట్ లో ఉల్లాస-ఉత్సహపరిచే పదార్థలు ఉంటాయి. వీటని ఎల్ -ఆర్జినైన్ హెచ్ సిఎల్ అంటారు. ఇది సెమన్ వాల్యూన్ పెంచడానికి సహాయపడుతుంది . డార్క్ చాక్లెట్ లిబిడో బూస్టర్ గా బాగా ప్రసిద్ధి చెందింది. చాక్లెట్ లో మీకు సెక్స్ లైఫ్ అనుభూతిని కలిగించి ఒక రసాయనం phenylethylamine ఇందులో ఉంటుంది. డార్క్ చాక్లెట్ తినడానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. డార్క్ చాక్లెట్ లో ఉండే ఫోనోఫినాయిల్స్ మెదడులోని ఎండోర్ఫిన్ ఉత్పత్తికి బాగా సహాయపడుతుంది. అంతే కాదు లైంగిక జీవితానికి కూడా బాగా సహాపడుతుంది.

ఓయిస్ట్రెస్:

ఓయిస్ట్రెస్:

ఇవి ఒక విచిత్రమైన టేస్ట్ ను కలిగి ఉంటాయి. ఇవి చూడటానికి కూడా విచిత్రంగా ఉంటాయి కానీ, ఇందులో ఉండే మోనోసాచురేటెడ్ ఆయిల్స్ ఆరోగ్యానికి, లైంగిక జీవితానికి బాగా సహాయపడుతాయి.ఓయిస్ట్రెస్ లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఈ జింక్ పురుషుల్లో టెస్టోస్టెరోన్ లెవల్స్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. దాంతో స్పెర్మ్ ఉత్పత్తి పెరిగి క్వాలిటీ మెరుగ్గా ఉంటుంది.

క్యారెట్లు

క్యారెట్లు

క్యారెట్లు దృష్టి కోసం మాత్రమే కాకుండా,వీర్యం నాణ్యతను పెంచడం ద్వారా పురుషుల్లో సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది. హార్వర్డ్ ప్రజా ఆరోగ్య విశ్వవిద్యాలయం స్కూల్ పరిశోధకులు క్యారెట్లు తీసుకోవటం వలన గుడ్డు వైపుకు వీర్యకణాలు ఈత కొట్టే సామర్థ్యంపై గొప్ప ప్రభావాన్ని కనుగొన్నారు.

ఆకుకూరలు

ఆకుకూరలు

ఆకు పచ్చని ఆకుకూరలను మీ మంచి ఆరోగ్యం కోసం అవసరమైన పోషకాలు, విటమిన్లు మరియు ఖనిజాలతో నిండిపోయిన పోషక పవర్ హౌస్ అని చెప్పవచ్చు. కాలే,స్విస్ చార్డ్,పాలకూర,ఆవ ఆకులు మొదలైన ఆకు పచ్చని ఆకుకూరలలో సంతానోత్పత్తి మరియు వీర్యం నాణ్యత పెంచడానికి అవసరమైన పోషకాలు సమృద్దిగా ఉన్నాయి.

ఆరెంజ్స్

ఆరెంజ్స్

బ్రైట్ రంగు కూరగాయలు మరియు పండ్లు చాలా ఆరోగ్యకరమైనవి మరియు పురుషుని సంతానోత్పత్తిని పెంచేందుకు ఉపయోగకరంగా ఉంటాయి. ప్రతి రంగు పండు లేదా కూరగాయలు ఒక నిర్దిష్ట ఆరోగ్య ప్రయోజనం కలిగి ఉంటాయి. అలాగే సంతానోత్పత్తి మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఆరెంజ్స్ లో సంతానోత్పత్తి పనితీరు మెరుగుపరిచటానికి యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి.

English summary

Top 10 Foods To Increase Sperm Count

Generally, sperm count is affected due to certain reasons such as increased use of plastic, certain therapeutic drugs, or overuse of insecticides, pesticides and industrial chemicals. Even poor food sources and dietary choices can play a vital role in lowering the rate of sperm count.
Story first published: Monday, November 23, 2015, 18:14 [IST]
Desktop Bottom Promotion