For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు నమ్మలేని బరువు తగ్గించే చిట్కాలు

By Super
|

ఈ రోజుల్లో అధిక బరువు సమస్య ఇంచుమించు అందరు ఎదుర్కుంటున్నదే!ఈ సమస్య నుండి విముక్తి పొందాలని అందరి మనసుల్లో ఉంటుంది. మీరు ఆహారాలు మరియు వ్యాయామం ద్వారా బరువు కోల్పోవడానికి నిర్విరామంగా ప్రయత్నిస్తున్న వారిలో ఒకరయిఉంటే, మీరు తీసుకునే ఆహారంలో బరువు కోల్పోవటానికి సహాయపడని కొన్ని ఆహారాల గురించి మీకు తెలియపరుస్తాము. తెలుసుకోండి.

మీరు నిర్ఘాంతపోతున్నారా? నీరు తాగడం వలన మీరు పౌండ్లలో బరువు కోల్పోవడం తగ్గించుకోవడం ఖచ్చితంగా సాధ్యపడదు అని ఒక కొత్త అధ్యయనం వలన తెలుస్తున్నది. నీరు అన్నది మీ శరీరానికి శక్తిని అందించడానికి ఒక మూలవస్తువుగా సహాయపడుతుంది, అది శరీరం నుండి విషపదార్థాలను తొలగిస్తుంది కానీ అది బరువు కోల్పోవటానికి ఏమాత్రం సహాయపడదు.

మీరు ఆరోగ్యకరమైన వ్యాయామం చేస్తూ ఎక్కువ మొత్తంలో నీరు త్రాగుతున్నప్పుడు మీలో బరువు కోల్పోవటం ప్రారంభమవుతుంది. అలాగే, మంచి పోషకాలు ఉన్న పండ్లను ఆహారంగా తీసుకున్నంతమాత్రాన, బరువు కోల్పోతాము అని అనుకోవటం, అది అతిశయోక్తి మాత్రమే!

పండ్లు తక్కువ కేలరీలు కలిగి ఉంటాయి మరియు ఆరోగ్యకరమైనవి అయినప్పటికీ, బరువు తూకం ఏమి తగ్గదు.

ఇక్కడ మీరు నమ్మలేని ఇతర బరువు కోల్పోయే చిట్కాలు కొన్నిటిని ఇస్తున్నాము. పరిశీలించండి.

శాఖాహారానికి మారటం

శాఖాహారానికి మారటం

శాఖాహారానికి మారటం ద్వారా మీరు బరువు ఏమీ కోల్పోరు. మీరు ఆహారం మార్చుకోవడంతో పాటు, షెడ్యూల్ ప్రకారం వ్యాయామాన్ని కూడా జోడించాలి. మీరు ఆకుపచ్చ కూరలు తీసుకోవటం వలన సన్నబడతారు అన్న ఆలోచనలో ఉంటే, అది తప్పు.

నీరు మాత్రమే త్రాగటం

నీరు మాత్రమే త్రాగటం

భోజనం స్కిప్ చేస్తూ మరియు మీ కడుపు నింపుకోవడానికి నీటిని తాగడంవలన బరువును కోల్పోతారనే చిట్కాను నమ్మవద్దు. నీరు కడుపును పూరించడానికి సహాయపడుతుంది, కాని కేలరీలు తగ్గిస్తుందని చెప్పటం మాత్రం అతిశయోక్తి.

మీ ఆహారంలో ఏ పిండి పదార్థాలు జోడించకపోవడం

మీ ఆహారంలో ఏ పిండి పదార్థాలు జోడించకపోవడం

మీరు తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు లేకపోతే, మీరు శక్తిని ఎక్కడ నుండి పొందుతారు? మీరు మంచి పిండి పదార్థాలను తప్పించటం వలన మీరు బలహీనంగా మారతారు మరియు తొందరగా అలసిపోతారు, ఇది ఒక విధంగా మీ ఆరోగ్యానికి మంచిది కాదు.

స్వీట్స్ తీసుకోకపోవటం

స్వీట్స్ తీసుకోకపోవటం

మీ ఆహారంలో స్వీట్లు తీసుకోకపోవటం వలన మీరు బరువు కోల్పోవటంలో ఏమీ సహాయపడదు. మీరు తియ్యని రసాలు మరియు క్యాండీలను తీసుకోకండి, కానీ బహుళ ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న నల్లటి చాక్లెట్ ఎప్పుడూ తీసుకోనని మాత్రం చెప్పకండి.

కేవలం ఫైబర్ ఉన్న పదార్థాలనే తీసుకోవటం

కేవలం ఫైబర్ ఉన్న పదార్థాలనే తీసుకోవటం

ఫైబర్ మీకు శక్తిని అందిస్తుంది మరియు జీర్ణక్రియలో కూడా సహాయపడుతుంది, కానీ మీ ఆహారంలో ఫైబర్ ఉన్న పదార్థాలనే తీసుస్కోవటం వలన బరువు కోల్పోతారని అనటం సరైనది కాదు. ఇది మీరు నమ్మకూడని మరో బరువు కోల్పోవటానికి చెప్పిన చిట్కాలలో ఒకటి.

సలాడ్ మాత్రమే

సలాడ్ మాత్రమే

బరువు కోల్పోవటానికి సహాయపడే ఆహారాలు చాలా ఉన్నాయి, వివిధ రకాలైన సలాడ్లను ఆశ్రయించవచ్చు. మీరు బరువు కోల్పోవాలనుకుంటే, సలాడ్ కు చికెన్ వంటి ప్రోటీన్ ఆహారాన్ని జోడించండి.

రసాలు మాత్రమే

రసాలు మాత్రమే

రసాలు మాత్రమే తీసుకోవటం వలన మీరు బరువు ఏమీ కోల్పోరు. మీ ఆహారంలో జోడించవలసిన ఆహారాలు కూడా చాలా ఉన్నాయి. పౌండ్ల కట్ కోరుకున్నట్లయితే, తాజా రసాలు తాగడం కూడా ముఖ్యం.

స్లిమ్మింగ్ మాత్రలు

స్లిమ్మింగ్ మాత్రలు

బరువు కోల్పోవడానికి ఎప్పుడూ స్లిమ్మింగ్ మాత్రలను ఆశ్రయించవద్దు. అవి మీ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలను చూపుతాయి మరియు మీ శరీరాన్ని నాశనం చేస్తాయి.

అధిక వ్యాయామం

అధిక వ్యాయామం

అధిక వ్యాయామం మరియు ఎక్కువగా తినటం వంటివి బరువు కోల్పోవడానికి సరైన మార్గాలు కావు. బరువు కోల్పోవటానికి సహాయపడే సరిఅయిన ఆహారాలు ఎంచుకోవడం మరియు ఒక గంట వ్యాయామం వంటివి చేసి స్మార్ట్ అనిపించుకోండి.

క్రాష్ డైట్

క్రాష్ డైట్

మీరు క్రాష్ ఆహారాలను తీసుకోవటం పాతిస్తున్నట్లయితే, బరువు తగ్గటానికి అది దీర్ఘ కాలంలో ఏవిధంగా సహాయపడదని గుర్తుంచుకోండి. నిపుణులు ఒక నిర్దిష్ట కాలం తర్వాత మీరు మొదట ఉన్న బరువు కంటే మరింత బరువు పొందుతారని చెపుతున్నారు.

English summary

Weight Loss Tips You Shouldn't Believe

Weight loss is on everyone's mind. If your one of those fanatics trying desperately to lose weight via diets and exercise, let us tell you that there are some foods on this list which does not aid in weight loss.
Desktop Bottom Promotion