For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉల్లిపాయను పచ్చిగా తినడం వల్ల పొందే లాభాలేంటి...

|

ఉల్లిగడ్డ కోసేటప్పుడు కంట నీరుపెట్టిస్తుంది. కానీ... ‘ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు'అని సామెత. ఆరోగ్యానికి ఉల్లిగడ్డ ఎంత మంచిదో చెప్పకనే చెబుతుంది ఈ సామెత. ఉల్లిగడ్డలను కోసినప్పుడు వాటిలో ఉండే ఎంజైమ్స్ విడుదలవుతాయి. వాటితోపాటుగా ఘాటై సల్ఫర్‌ గ్యాస్ కూడా బయటికి వస్తుంది. ఇదే కళ్లకు చిరాకు కలిగించి కన్నీరు పెట్టిస్తుంది.

కొన్ని శతాబ్దాలుగా ఈ ఉల్లిగడ్డలు మన ఆహారంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అతి తక్కువ ధరకు దొరికే వీటిని పేదల ఆహారంగా కూడా చెబుతారు. మన ఇళ్లలో ఉల్లిపాయను వాడని వారు చాలా తక్కువగా వుంటారు. ఉల్లిపాయలో ఘాటైన వాసనే కాదు, శక్తివంతమైన ఆహారవిలువలు కూడా ఎన్నో ఉన్నాయి. ఉల్లిపాయలో ఉండే ఆహారవిలువలు ఉల్లికారాన్ని బట్టీ, పక్వానికి వచ్చిన స్థితిని బట్టీ, ఎంతకాలం నిల్వ ఉన్నదన్నదాన్ని బట్టీ మారిపోతుంటాయి.

ఉల్లిపాయలో మినిరల్ (క్యాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, సెలీనియం మరియు ఫాస్పరస్)పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అనేక వ్యాధులకు ఉపశమనం కలిగిస్తాయి. నోటి నంచి దుర్వాసన వస్తుందని కొద్దిమంది తినడానికి అంతగా ఇష్టపడరు. అటువంటి వారు ఇందులోని వైద్యపరమైన విలువైన ఆరోగ్యప్రయోజనాలు తెలుసుకుంటే ఉల్లిపాయ తినకుండా ఉండరు. మరి ఆ ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...ఆరోగ్యాన్ని కాపాడుకుందాం...

1. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది:

1. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది:

ఉల్లిపాయ శరీరంలోని రక్తం పల్చగా ఉండి కణాన్నింటికి ప్రసరించేందుకు ఉపయోగపడుతుంది. మరియు రక్తం గడ్డకట్టకుండా, రక్తకణాలను నుండి ఎరరక్తకణాలను నిరోధిస్తుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకడితే గుండె లోపాలు లేదా కార్డియో వాస్కులార్ వ్యాధులు దారి తీయవచ్చు. గుండె జబ్బులతోనూ, బీపీతోనూ బాధపడే వాళ్లు రోజూ 100 గ్రాముల ఉల్లిని తీసుకోవటం చాలా మంచిది.

2. వ్యాధినిరోధకతను మెరుగుపరుస్తుంది:

2. వ్యాధినిరోధకతను మెరుగుపరుస్తుంది:

ఉల్లిపాయలో ఉండే విటమిన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్, ముఖ్యంగా విటమిన్ సి, వ్యాధినిరోధకతను పెంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. వ్యాధులను , ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచతుంది. అలాగే బ్లడ్ కొలెస్ట్రాల్ వెవల్స్ ను తగ్గిస్తుంది .

3. ఒత్తిడి తగ్గిస్తుంది:

3. ఒత్తిడి తగ్గిస్తుంది:

ఉల్లిపాయల్లో ఉండే క్వార్సిటిన్ అనే అంశం నొప్పిని, డిప్రెషన్ ను మరియు యాక్సైటిని నివారించే సెడటివ్ గా పనిచేస్తుంది . కాబట్టి మీరు హర్డ్ వర్కింగ్ డే ఉన్నప్పుడు, మీ ఆహారంతోపాటు ఒక చిన్న ముక్క పచ్చి ఉల్లిపాయను తీసుకుంటే, మంచి ఫలితం ఉంటుంది. నిద్రలేమితో బాధపడేవారికి కూడా బాగా సహాయపడుతుంది.

4. క్యాన్సర్ నుండి రక్షిస్తుంది:

4. క్యాన్సర్ నుండి రక్షిస్తుంది:

ఉల్లిపాయలు విజయవంతంగా క్యాన్సర్ కణాల అభివృద్ధిని అడ్డగించే చురుకైన సమ్మేళనాలను ఉల్లిపాయ సమృద్ధిగా కలిగి ఉంది.

5. చర్మసౌందర్యానికి చాలా గొప్పది:

5. చర్మసౌందర్యానికి చాలా గొప్పది:

మొటిమలు మచ్చల నివారణకు ఆలివ్ ఆయిల్ మరియు నిమ్మరసాన్ని సమపాళ్ళలో తీసుకొని మిక్స్ చేసి, ముఖానికి పట్టించడం వల్ల మొటిమలు, మచ్చలు పూర్తిగా తొలగిపోతాయి. మొటిమలను తొలగించడంలో ఇది ఒక బెస్ట్ ట్రీట్మెంట్ గా చెప్పవచ్చు.

6. ఓరల్ హెల్త్(దంతాల ఆరోగ్యానికి) మంచిది:

6. ఓరల్ హెల్త్(దంతాల ఆరోగ్యానికి) మంచిది:

దంతక్షయాన్ని మరియు దంతాల్లోని ఇన్ఫెక్షన్స్ ను నివారించడానికి ఉల్లిపాయను ఎక్కువగా ఉపయోగిస్తారు. పచ్చి ఉల్లిపాయల ముక్కలను నోట్లో వేసుకొని 2-3 నిముషాలు నమలడం వల్ల నోటి నలమూలల్లో ఉన్న జర్మ్స్(సూక్ష్మక్రిములు)దంత సంబంధ క్రిముల్ని నశింప చేస్తాయి. పంటినొప్పితో బాధపడే వాళ్లు ఆ పంటికి లేదా చిగురుకు చేరువలో చిన్న ఉల్లిగడ్డను ఉంచుకుంటే కాసేపటికి ఆ నొప్పి తగ్గుతుంది.

7. పైల్స్ నివారణ:

7. పైల్స్ నివారణ:

పైల్స్‌తో బాధపడుతున్న వారు 30 గ్రాముల ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా చేసి నీళ్లలో వేసి, అందులో 60 గ్రాముల పంచదార కలుపుకుని రోజుకు రెండుసార్లు చొప్పున తీసుకుంటే కొద్ది రోజుల్లోనే మంచి ఉపశమనం లభిస్తుంది.

8. సెక్స్ డ్రైవ్ పెంచుతుంది :

8. సెక్స్ డ్రైవ్ పెంచుతుంది :

ఉల్లిపాయలు ఆరోగ్యకరమైన లైంగిక జీవితం కోసం తపన పెంచడానికి సహాయపడుతుంది. ఒక టేబు స్పూన్ ఉల్లిపాయ రసం మరియు అల్లం రసం ఒక టేబుల్ స్సూప్ మిక్స్ చేసి రోజులో 3సార్లు తీసుకుంటే కామాతురత మరియు సెక్స్ డ్రైవ్ పెంచడానికి సహాయపడుతుంది. ఉల్లి విత్తనాలు వీర్యాన్ని పెంచుతాయి. లైంగిక సామర్థ్యాన్ని పెంచటంలో వెల్లుల్లి తర్వాత ఉల్లి రెండో స్థానంలోకి వస్తుంది.

9. పొట్ట నొప్పి నుంచి ఉపశమనాన్ని:

9. పొట్ట నొప్పి నుంచి ఉపశమనాన్ని:

ఉల్లిపాయలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా కలిగి ఉండటం వల్ల, స్టొమక్ అప్ సెట్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. మరియు గ్యాస్ట్రో సిండ్రోమ్ సంబంధిత నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

10. శరీరంలో వేడిని తగ్గిస్తుంది:

10. శరీరంలో వేడిని తగ్గిస్తుంది:

శరీరంలో ఉన్నట్లుండి ఏర్పడే వేడిని వెంటనే తగ్గించుకోకపోతే చాలా ప్రమాదం. ముఖ్యంగా వేసవి కాలంలో వేడి చేస్తే ఉల్లిపాయ గుజ్జును మీ పాదాలకు మరియు మెడ మీద అప్లై చేయాలి. ఇది మొత్తం శరీరానికి కూలింగ్ ప్రభావాన్ని కలిగిస్తుంది.

English summary

Why Raw Onions Are good for you

Raw onions have sulphur compounds and essential vitamins that can be best consumed raw. If cooked, the essential nutrients and vitamins get lost. So, if you love onion salad, here are few good reasons to have it regularly.
Story first published: Tuesday, May 26, 2015, 17:52 [IST]
Desktop Bottom Promotion