For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సీమ చింతకాయ సత్తా తెలిపే.. హెల్త్ బెన్ఫిట్స్

|

ఫేవ బీన్స్, వీటిని అచ్చమైన తెలుగులో సీమచింతకాయలు అని పిలుస్తుంటారు. చిన్నప్పటి జ్ఞాపకంగా మిగిలిపోకుండా ఉండేదుకు. . . రోడ్ మీద తోపుడు బండ్లలో పెట్టి అమ్ముతుంటారు. అసలు చాలా మందికి ఈ కాయలంటే తెలియదు. ముఖ్యంగా సిటీలలో ఉన్నవారికి అస్సలు తెసుండదు. సిటీలలోనే పుట్టిన పిల్లలకి ఐతే ఆ బాదే లేదు. . .ఎందుకంటే వాటిని కొనాల్సిన అవసరమే లేదు. . .కాస్తో కూస్తో పల్లె టచ్ ఉంటే తప్ప వాటి పేరు కూడా తెలియదు కాబట్టి. పల్లె వాతావరణం తెలిసిన వారికి మాత్రమే ఖచ్చితంగా సీమ చింతకాయల గురించి తెలిసే ఉంటుంది. ఈ కాయలు తింటుంటే నోరు కమ్మగా...ఒగరు...ఒగరుగా.... చాలా డిఫెర్ట్ టేస్ట్ ను కలిగి ఉంటుంది. ఒక సారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలపించే రుచి కలిగి ఉంటుంది.

రేగిపండ్లలోని అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

సీమ చింతకాయలు తినడానికి రుచి మాత్రమే కాదు వండర్ ఫుల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. వీటిలో ప్రోటీన్స్ మరియు సోలబుల్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, బరువు పెరుగుతామన్న భయం అస్సలుండదు. అలాగే శ్యాచురేటెడ్ ఫ్యాట్ కూడా ఉండవు కాబట్టి, డైట్ ఫాలో అయ్యేవారు కూడా నిరభ్యంతరంగా తినవచ్చు. మనకు తెలిసి, తెలియని, అందుబాటులో లేని ఈ సీమచింతకాయ లో మరిన్ని హెల్త్ బెనిఫిటిస్ దాగున్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే ఈ క్రింది లిస్ట్ చూడాల్సిందే....

హార్ట్ హెల్త్ కు మంచిది:

హార్ట్ హెల్త్ కు మంచిది:

ఫేవ బీన్స్ లో సోలబుల్ ఫైబర్ అధికంగా ఉందని కొన్ని పరిశోధనల ద్వారా వెల్లడించారు. ఒక కప్పు ఫేవ బీన్ లో 36గ్రాములు సోలబుల్ ఫైబర్ ఉంటుంది. కాబట్టి కొలెస్ట్రాల్ , బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. అంతే ఈ ఫైబర్ వేరియంట్స్ లోయర్ డెన్సిటి లిపోప్రోటీన్ లేదా బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించడం వల్ల హార్ట్ సమస్యలుండవు.

బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గిస్తుంది:

ఒక కప్పు ఫేవ బీన్ లో 40గ్రాములు ప్రోటీనులు శరీరానికి అందుతాయి. కొన్ని పరిశోధనల ద్వారా హైప్రోటీన్ మరియు హై ఫైబర్ ఫుడ్స్ ను తీసుకొనే వారు, హై కార్బోహైడ్రేట్ మరియు లోఫ్యాట్ ఫుడ్స్ తీసుకొనే వారికంటే బెటర్ గా బరువు తగ్గించుకోగలరని కనుగొన్నారు

న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి :

న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి :

ఫేవా బీన్స్ లో పోషకాలు అత్యధికంగా ఉన్నాయి. ఈ బ్రాడ్ బీన్స్ లో మినిరల్స్ మిరయు విటమిన్స్ అధికంగా ఉన్నాయి. మెగ్నీషియం, పొటాషియం, కాపర్, ఐరన్, ఫాస్పరస్, విటమిన్ బి1, మరియు థైమిన్ ఫుష్కలంగా ఉన్నాయి కాబట్టి, ప్రతి రోజూ వీటిని 1/4కప్పు తీసుకోమని ఆహారనిపుణులు సిఫారస్ చేస్తున్నారు . ఇందులో ఉండే విటమిన్ బి1 ప్రదాన నాడీ వ్యవస్థను నార్మల్ గా పనిచేయడానికి, కాపర్ శరీరంలో వ్యాధినిరోధకశక్తి పెంచడానికి, రక్తనాళాలు, బోన్స్ బ్యాలెన్స్ మరియు ఆరోగ్యానికి చాలా గ్రేట్ గా సహాయపడుతుంది.

ఫొల్లెట్ మరియు మెగ్నీషియం:

ఫొల్లెట్ మరియు మెగ్నీషియం:

ఫేవా బీన్స్ ఒక సూపర్ ఫుడ్ ఇందులో మెగ్నీషియం, మరియు ఫొల్లెట్ పుష్కలంగా ఉన్నాయి . ప్రోటీన్స్, మరియు కార్బోహైడ్రేట్స్ మెటబాలిజంకు సహాయపడుతుంది . ఫొల్లెట్ కార్డిక్ , ఇమ్యూనిటి హెల్త్ కు సహాయపడుతుంది.

డిప్రెషన్ తగ్గిస్తుంది:

డిప్రెషన్ తగ్గిస్తుంది:

ఈ బ్రాడ్ బీన్ డిప్రెషన్ తగ్గిస్తుంది . పరిశోధనల ప్రకారం ఈ ఫేవ బీన్స్ లో అమినో యాసిడ్ డొపమైన్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది మీ మూడ్ మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . దాంతో డిప్రెషన్ కండీషన్ నివారిస్తుంది.

ఆకలిని తగ్గిస్తుంది:

ఆకలిని తగ్గిస్తుంది:

ఫేవా బీన్స్ లో ప్రోటీన్స్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల, వీటిని తిన్నప్పుడు, ఎక్కువ సమయం పొట్ట నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దాంతో ఆకలి కోరికలు తగ్గుతాయి. త్వరగా ఆకలి కాకపోవడం వల్ల ఇతర అనారోగ్యకరమైన ఆహారాల మీద మనస్సు మళ్ళకుండా చేస్తుంది.,.

గర్భినీలకు చాలా మంచిది:

గర్భినీలకు చాలా మంచిది:

గర్భిణీ స్త్రీలకు ఐరన్, మరియు క్యాల్షియం, అధికంగా అవసరం అవుతుంది. కాబట్టి, గర్భినీలు గర్భధారణ సమయంలో తీసుకోవడం వల్ల గర్భధారణ సమయంలో మరియు పాలు పట్టే సమయంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది . మంచి ఎనర్జీని అందిస్తుంది. క్యాల్సియం అధికంగా ఉండటం వల్ల బోన్ హెల్త్ కు చాలా మంచిది, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ప్రెగ్నెన్సీలో మలబద్దకాన్ని నివారిస్తుంది.

వణుకు మరియు నరాల అస్వస్థతను నివారిస్తుంది:

వణుకు మరియు నరాల అస్వస్థతను నివారిస్తుంది:

ఫేవా బీన్స్ లో ఉండే లివోడొప. ఇది ఒక కెమికల్ వంటింది. అందేకే కొన్ని డ్రగ్స్ లో కూడా ఈ లివోడొపాను చూస్తుంటారు. ఈ కెమికల్ శరీరంలో వణుకు మరియు నరాల అస్వస్థతను నివారిస్తుంది. మెంటల్ డిజార్డన్ ను కూడా తగ్గిస్తుంది.

విటమిన్ సి అధికం:

విటమిన్ సి అధికం:

ఫేవా బీన్స్ లో విటమిన్ సి అధికంగా ఉంది. మరియు ఈ విటమిన్ మనందరికి తెలిసిన పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ . విటమిన్ సి యాక్సిడెంట్ నేచర్ శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను మరియు ఆక్సిడేటివ్ డ్యామేజ్ ను నివారిస్తుంది . దాంతో ప్రీ మెచ్యుర్ ఏజింగ్ ను లక్షణాలైన్ ఫైన్ లైన్స్ ముడుతలను, వివిధ రకాల క్యాన్సర్ నివారిస్తుంది. మరియు వ్యాధినిరోధకత పెంచుతుంది.

శరీరంలో ఫ్లూయిడ్స్ ను స్థిరంగా ఉంచుతుంది:

శరీరంలో ఫ్లూయిడ్స్ ను స్థిరంగా ఉంచుతుంది:

సీమచింతకాయలో ఉండే పొటాషియం శరీరంలోని పిహెచ్ లెవల్స్ ను మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. ఇది బాడీ సెల్స్ నార్మల్ ఫంక్షనింగ్ కోసం చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. ఇంకా హార్ట్ బీట్ , మజిల్ ఫంక్షనింగ్ కు గ్రేట్ గా సహాయపడుతుంది

English summary

10 Amazing Health Benefits of Fava Beans| seemachintakayalu health benefits|benefits of fava beans

fava beans, seema chintakayalu, Have you ever wondered how beneficial fava beans are? And do you know that they can be consumed without having to worry about weight gain? A master source of protein and soluble fiber, these beans are free from saturated fat, making it a good delicacy to be enjoyed along with m
Story first published: Tuesday, February 2, 2016, 15:13 [IST]
Desktop Bottom Promotion