For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు పెరగడానికి కారణం: మీరు చేసే కుక్కింగ్ మిస్టేక్స్ ...!

|

బరువు తగ్గడం కోసమని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. డైట్ ను ఫాలో అవ్వడం, వ్యాయామాలు చేయడం..జిమ్, యోగా ఇలా ఎన్నో చేసినా బరువు తగ్గడం మాత్రం అంతంత మాత్రమే.

సాధారణంగా చాలా మంది బరువు తగ్గడం కోసం కొన్ని ఆంక్షలను విధించుకుంటారు. కానీ వాటిని పాటించరు. బరువు తగ్గాలనే పట్టుదలతో పాటు, ఆచరణ కూడా ఉంటే తప్పకుండా బరువు తగ్గుతారు.

ఈ సంవత్సరం ఆఖరికల్లా బరువుతగ్గాలనుకొంటున్నారా లేదా ఆరోగ్యంగా ఉండాలని బరువు తగ్గాలనుకొన్నా, అందుకు మీరు చాలా కఠినమైన నియమాలు పాటించక్కరలేదు. లేదా మీ ఫేవరెట్ డిష్ లను తినకుండా దూరంగా ఉండక్కరా లేదు. వాటికి బదులు మీరు మీ సాధారణ వంటలను కొద్దిగా మార్పు చేసుకోవడం లేదా తయారుచేసే పద్దతులను మార్చుకోవడం చేయండి. నేచురల్ పద్ధతులతో హెల్తీ కుక్కింగ్ టిప్స్ ఫాలో అవ్వడం వల్ల ఎఫెక్టివ్ గా బరువు తగ్గించుకోవచ్చు

బరువు తగ్గించేటటువంటి కుకింగ్ టిప్స్ ఇక్కడ కొన్ని ఉన్నాయి వాటిని పాటించినట్లైతే కొన్ని క్యాలరీలను కోల్పోవడంతో పాటు, ప్యాట్ ను కరిగించుకోవచ్చు. క్రమంగా అధిక బరువును తగ్గించుకోవచ్చు..

చిట్కా 1# :

చిట్కా 1# :

సాధారణంగా వంట చేసేప్పుడు ఎంత అంటే అంత నూనె వాడుతుంటారు, బరువు తగ్గించుకోవాలని ప్లాన్ లో ఉన్నావారు సాధ్యమైనంత వరకూ నూనె వాడకాన్ని తగ్గించాలి. వంట చేయడానికి ముందు ఈ విషయం గుర్తించుకొని ఒక మెజర్మెంట్ ప్రకారం నూనె వాడాలి. లేదా నూనె వాడకపోవడమే మంచిది.

చిట్కా 2# :

చిట్కా 2# :

బరువు తగ్గాలని కోరుకునే వారు గుర్తుంచుకోవల్సిన మరో చిట్క్ , వంటల రుచికోసమని బట్టర్, నెయ్యి, లేదా చీజ్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. సాధ్యమైనంత వరకూ వీటికి దూరంగా ఉండటం వల్ల ఎఫెక్టివ్ గా బరువు తగ్గించుకోవచ్చు.

చిట్కా 3# :

చిట్కా 3# :

బరువు తగ్గించుకునే క్రమంలో , వంటల్లో ఉప్పును సాధ్యమైనంత వరకూ తగ్గించాలి. ఎక్సెస్ సాల్ట్ ను ఉపయోగించడం వల్ల శరీరంలో నీరు చేరుతుంది దాంతో బాడీ వెయిట్ పెరుగుతుంది.

చిట్కా 4 # :

చిట్కా 4 # :

హెల్తీ కుక్కింగ్ టిప్స్ అనుసరించే ఎఫెక్టివ్ గా బరువు తగ్గించుకోవచ్చు, అందులో ముఖ్యంగా వంటలకు సరైన కుక్కింగ్ ఆయిల్స్ ను ఎంపిక చేసుకోవాలి. లోఫ్యాట్ మరియు ట్రాన్ ఫ్యాట్ ఆయిల్స్ ఎంపిక చేసుకోవడం వల్ల బరువు తగ్గించుకోవడానికి సహాయపడుతుంది.

చిట్కా 5 # :

చిట్కా 5 # :

బరువు తగ్గాలని ఆకాంక్ష చాలా మందిలో ఉన్నా, తెలిసి తెలియకుండా ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ ను తీసుకుంటుంటారు. ఫ్రైడ్, ఆయిల్ ఫుడ్స్ కు ప్రత్యామ్నాయంగా బేక్ చేసిన లేదా ఆవిరి మీద చేసిన వంటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.

చిట్కా 6 # :

చిట్కా 6 # :

వంటలకు ఒక్కసారి వాడిన నూనెలో తిరిగి మరే వంటలకూ వాడకూడదు. ఒక్కసారి వాడిన నూనెల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు పెరగడానికి కారణమవుతుంది. ఫ్రెష్ ఆయిల్స్ లో కంటే పాత నూనెల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ.

చిట్కా 7 # :

చిట్కా 7 # :

బరువు తగ్గించుకోవాలని కోరుకునే వారు మీరు తీసుకునే ఆహారాల్లో ఎక్సెస్ షుగర్స్ లేకుండా చూసుకోవాలి. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ లో క్యాలరీలు అధికంగా ఉంటాయి. ఇవి అధికబరువుకు కారణమవుతాయి. కాబట్టి, షుగర్స్, స్వీట్స్ తగ్గించడం మంచిది.

English summary

7 Common Cooking Mistakes That Make You Gain Weight

Are you doing everything you can to lose some weight? Do you feel that you have been following a healthy diet and exercise routine and yet you can't seem to lose weight, then here are a few cooking tips that can be effective in aiding weight loss.
Story first published: Wednesday, August 24, 2016, 18:04 [IST]
Desktop Bottom Promotion