For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నారింజలో కంటే విటమిన్ సి ఎక్కువగా ఉండే చౌక ఆహారాలివే..

By Swathi
|

విటమిన్ సి అంటే.. అందరికీ గుర్తొచ్చే నిమ్మ, నారింజ. ఈ రెండింటి ద్వారానే ఎక్కువ విటమిన్ సి పొందవచ్చని భావిస్తారు. కానీ.. విటమిన్ సి నారింజలో కంటే కూడా.. ఇతర వెజిటబుల్స్, ఫ్రూట్స్ నుంచి ఎక్కువగా పొందవచ్చట. అవి కూడా చౌకగా, అందరికీ అందుబాటులో ఉండేవేనట. విటమిన్ సి మన ఆరోగ్యానికి చాలా అవసరం. మనలో రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్ సి ఉపయోగపడుతుంది.

READ MORE: అధికమూ అనర్ధమే..విటమిన్ సి అధికమైతే వచ్చే సమస్యలు..

విటమిన్ సి లోపం వల్ల సాధారణంగా చిగుళ్ల నొప్పి, ముక్కులో నుంచి రక్తం కారడం, చర్మం కింద బ్లడ్ క్లాట్స్ ఏర్పడటం వంటి సమస్యలు వస్తాయి. అలాగే ఏ చిన్న గాయం అయినా, దెబ్బ తగిలినా వెంటనే మానవు. కండరాల నొప్పులు కూడా వేధిస్తాయి. అలాగే రక్తహీనతకు కూడా విటమిన్ సి లోపం కారణమవుతుంది. విటమిన్ సి లోపిస్తే.. నీరసం, అలసట ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి విటమిన్ సి కేవలం ఆరంజ్ ఫ్రూట్ నుంచే కాకుండా.. ఇతర ఏ ఆహారాల ద్వారా పొందవచ్చో ఇప్పుడు చూద్దాం..

ఎండు మిర్చి

ఎండు మిర్చి

ఎండు మిర్చి ద్వారా విటమిన్ సి పొందవచ్చని తెలుసా ? అరకప్పు ఎండు మిర్చి ద్వారా 107 ఎమ్ జీ విటమిన్ సి పొందవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎండు మిర్చి పొడిని వంటకాల్లో వాడటం వల్ల కీళ్లు, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

క్యాప్సికమ్

క్యాప్సికమ్

ఒక కప్పు గ్రీన్ క్యాప్సికమ్ నుంచి 120 ఎమ్ జీ విటమిన్ సి పొందవచ్చు. అలాగే వీటి నుంచి ఫైబర్ కూడా పొందవచ్చు. కాబట్టి తరచుగా వీటిని ఆహారంలో చేర్చుకోవాలి.

బొప్పాయి

బొప్పాయి

బొప్పాయిని తరచుగా తీసుకోవడం వల్ల సైనస్ సమస్యతోపాటు చర్మం ప్రకాశవంతంగా మారడానికి సహాయపడతాయి. అలాగే ఎముకలు బలంగా మారడానికి ఇది ఉపయోగపడుతుంది. ఒక కప్పు బొప్పాయి ముక్కల నుంచి 88ఎమ్ జీ విటమిన్ సి పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

జామకాయ

జామకాయ

చౌకగా లభించే జామ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల జామపండులో దాదాపు 228 ఎమ్ జీ విటమిన్ సి ఉంటుంది. కాబట్టి మీ డైట్ లో జామపండు చేర్చుకోవడం కంపల్సరీ.

టమోటా

టమోటా

రోజూ వంటకాలలో ఉపయోగించే చౌక వెజిటబుల్ టమోటా. దీని ద్వారా కూడా విటమిన్ సి పొందవచ్చు. కాబట్టి ఇకపై ఎక్కువగా టమోటా వంటకాలు చేసుకోండి. 100 గ్రాముల వండిన టమోటా నుంచి 22 ఎమ్ జీ విటమిన్ సి పొందవచ్చు.

క్యాలీఫ్లవర్

క్యాలీఫ్లవర్

క్యాలీ ఫ్లవర్ ని ఎలా తిన్నా మీ శరీరానికి కావాల్సిన విటమిన్ సి పొందవచ్చు. ఉడకబెట్టి లేదా ఫ్రై చేసి తీసుకున్నా.. క్యాలీ ఫ్లవర్ నుంచి 127 ఎమ్ జీ విటమిన్ సి, 5 గ్రాముల ఫైబర్, 5 గ్రాముల ప్రొటీన్ పొందవచ్చట.

పైనాపిల్

పైనాపిల్

పైనాపిల్ లో న్యాచురల్ యాంటీ ఇన్ల్పమేటరీ గుణాలే కాదు.. విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది డైజెషన్ సజావుగా జరగడానికి సహాయపడుతుంది. బాగా సిక్ గా ఉన్నప్పుడు పైనాపిల్ తీసుకోవడం వల్ల వెంటనే ఉపశమనం పొందవచ్చు.

English summary

7 Foods With More Vitamin C Than Oranges

7 Foods With More Vitamin C Than Oranges. If you chug a glass of orange juice every time you start sniffling, you may be onto something. Though studies show that consuming vitamin C can't actually prevent colds, loading up on the nutrient may help slightly shorten the length of time you're sick and reduce the severity of your symptoms.
Story first published: Tuesday, February 2, 2016, 11:00 [IST]
Desktop Bottom Promotion