For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చింతపండుని డైలీ డైట్ లో చేర్చుకోవాలనడానికి స్ట్రాంగ్ అండ్ హెల్తీ రీజన్స్..!

డిఫరెంట్ ఫ్లేవర్ ఉన్న చింతపండుని డైలీ డైట్ లో ఖచ్చితంగా చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు.. డైలీ డైట్ లో ఖచ్చితంగా చేర్చుకోవడానికి కొన్ని కారణాలు కూడా చెబుతున్నారు.

By Swathi
|

సాంబార్, రసం, పులియోగరే.. రెసిపీ ఏదైనా.. కాస్తంత చింతపండు పులుపు తగాలాల్సిందే. ఎలాంటి వంటకానికైనా.. చింతపండు.. విభిన్నమైన రుచిని అందిస్తుంది. చట్నీలు, కూరలు, రకరకాల వంటకాల్లో చింతపండుని పులుపు, తీపి ఫ్లేవర్ రావడానికి ఉపయోగిస్తారు.

tamarind

చింతపండులో ఫైబర్, మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే.. చింతపండు హెల్తీ ఇంగ్రిడియంట్ గా మారింది. అలాగే చింతపండు వంటకాలను గొంతు నొప్పి, వాపు, సన్ స్ట్రోక్, దగ్గు, జ్వరం నివారించడానికి ఉపయోగిస్తారు.

అయితే ఈ డిఫరెంట్ ఫ్లేవర్ ఉన్న చింతపండుని డైలీ డైట్ లో ఖచ్చితంగా చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు.. డైలీ డైట్ లో ఖచ్చితంగా చేర్చుకోవడానికి కొన్ని కారణాలు కూడా చెబుతున్నారు. మరి అవేంటో చూద్దామా..

అజీర్ణం

అజీర్ణం

చింతపండు గుజ్జులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కాన్ట్సిపేషన్ ని నివారిస్తుంది. అజీర్ణం, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలను కూడా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. డయేరియాను కూడా నివారిస్తుంది.

కోలన్ క్యాన్సర్

కోలన్ క్యాన్సర్

చింతపండులో టార్టారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ లా పనిచేస్తుంది. అలాగే హానికారక ఫ్రీరాడికల్స్ నుంచి శరీరాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దీనివల్ల క్యాన్సర్ ముప్పు తగ్గించుకోవచ్చు. అలాగే.. కోలన్ క్యాన్సర్ రిస్క్ తగ్గించే మినరల్స్ ఇందులో ఉంటాయి.

బ్లడ్ ప్రెజర్

బ్లడ్ ప్రెజర్

చింతపండులో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల.. బ్లడ్ ప్రెజర్, హార్ట్ రేట్ ని కంట్రోల్ చేస్తుంది. శరీరంలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ చేస్తుంది. చింతపండులో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల.. ఎర్రరక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది.

బ్లడ్ కొలెస్ట్రాల్

బ్లడ్ కొలెస్ట్రాల్

చింతపండు గుజ్జు.. హైబ్లడ్ కొలెస్ట్రాల్ ని ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. ప్రతిరోజూ డైట్ లో చింతపండు చేర్చుకుంటే.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

కంటి ఆరోగ్యానికి

కంటి ఆరోగ్యానికి

చింతపండులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటికి సంబంధించిన వ్యాధుల రిస్క్ ని తగ్గిస్తుంది. చింతపండులో మ్యూసిన్ ఉంటుంది. ఇది.. కళ్లు డ్రై కాకుండా అరికడుతుంది. ఒక గ్లాసు నీళ్లలో.. టీస్పూన్ చింతపండు గుజ్జు ఉడికించి.. తీసుకుంటే.. కళ్ల వాపు తగ్గించుకోవచ్చు.

ఇన్ఫెక్షన్స్

ఇన్ఫెక్షన్స్

చింతపండుని రెగ్యులర్ గా వంటకాల్లో చేర్చుకోవడం వల్ల జలుబు వంటి ఇన్ఫెక్షన్స్ నివారించవచ్చు. అలాగే.. ఇమ్యునిటీ పవర్ పెంచుతుంది. ఇందులో విటమిన్స్, మినరల్స్ మాత్రమే కాకుండా.. క్యాల్షియం, కాపర్, విటమిన్ సి కూడా లభిస్తాయి.

హెల్తీ స్కిన్

హెల్తీ స్కిన్

చింతపండులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల.. చర్మానికి హాని చేసే ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది. యాంటీ ఏజింగ్ లా పనిచేస్తుంది. అలాగే.. చర్మంపై ముడతలు, మచ్చలను నయం చేస్తుంది. చిన్న చిన్న గాయాలను, స్కిన్ ఇన్ఫెక్షన్స్ ని తేలికగా నివారిస్తుంది.

English summary

7 healthy reasons to include tamarind in your diet!

7 healthy reasons to include tamarind in your diet! Here are surprising health benefits of why you should add sweet and sour tasting tamarind to your diet.
Story first published: Saturday, November 19, 2016, 10:50 [IST]
Desktop Bottom Promotion