For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సగ్గుబియ్యంలో దాగున్న అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు..!!

సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవాళ్లకు సగ్గుబియ్యం సరైన ఆహారం. ఇందులో స్టార్చ్ శాతం ఎక్కువగా ఉంటుంది. రసాయనాలు లేని న్యాచురల్ స్వీటనర్.

By Swathi
|

సాగో అనే పేరుతో ప్రాచుర్యం పొందింది సగ్గుబియ్యం. దీన్ని కర్ర పెండలం నుంచి తీసుకున్న పొడితో తయారు చేస్తారు. సగ్గుబియ్యంను పాయంసంగా, ఉప్మాగా తయారు చేసుకుని తింటారు. సగ్గుబియ్యంను పండుగలు, వ్రతాల సమయంలో.. నైవేద్యంగా ఉపయోగిస్తారు.

7 Remarkable Ways Sabudana Can Benefit You: Health Benefits of Sabudana

సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవాళ్లకు సగ్గుబియ్యం సరైన ఆహారం. ఇందులో స్టార్చ్ శాతం ఎక్కువగా ఉంటుంది. రసాయనాలు లేని న్యాచురల్ స్వీటనర్ కావడం వల్ల సగ్గు బియ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

సన్నటి బబుల్స్ లా ఉండే సగ్గుబియ్యం తినడానికి పిల్లలు కూడా ఇష్టపడతారు. వీటిల్లో అనేక వ్యాధులు నయం చేసే సత్తా ఉంటుంది. తక్షణ శక్తినిచ్చే అహార పదార్ధంగా దీన్ని ఉపయోగిస్తారు. మరి సగ్గుబియ్యంలో దాగున్న ఆరోగ్య రహస్యాలేంటో చూద్దాం..

కండరాల సౌష్టవం

కండరాల సౌష్టవం

కండరాల గ్రోత్ కి సగ్గుబియ్యం చాలా ముఖ్యం. ఇందులో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మొత్తంలో ప్రొటీన్ తీసుకోవడం వల్ల కండరాలు పెరగడమే కాకుండా.. బలంగా మారుతాయి.

ఎముకల ఆరోగ్యానికి

ఎముకల ఆరోగ్యానికి

సగ్గుబియ్యంలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేయడంతో పాటు.. బ్లడ్ కొలెస్ట్రాల్ ని మెరుగుపరుస్తుంది. ఇందులో ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉండటం వల్ల.. రక్తప్రసరణ సజావుగా సాగి.. గుండె సంబంధింత వ్యాధులకు దూరంగా ఉంచుతుంది.

ఎనర్జీ లెవెల్స్ పెరగడానికి

ఎనర్జీ లెవెల్స్ పెరగడానికి

శరీరానికి ఎనర్జీ అందడానికి సగ్గుబియ్యం సరైన పరిష్కారం. వీటిని డైట్ లో చేర్చుకుంటే.. రోజంతా గడిచినా.. ఎనర్జిటిక్ గా ఉంటారు. ఇందులో కార్బొహైడ్రేట్స్ శరీరానికి కావాల్సిన మోతాదులో ఉంటాయి. కాబట్టి.. హెల్తీగా ఎనర్జీని పొందడానికి సగ్గుబియ్యం సరైన పరిష్కారం.

బరువు పెరగడానికి

బరువు పెరగడానికి

బరువు పెరగడానికి, కండరాలు పెంచుకోవడానికి సగ్గుబియ్యం.. సరైన పరిష్కారం. ఇందులో కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి వేగంగా బరువు పెరగడానికి సహాయపడతాయి.

జీర్ణక్రియ మెరుగుపరచడానికి

జీర్ణక్రియ మెరుగుపరచడానికి

జీర్ణక్రియ మెరుగుపరుచుకోవడానికి.. డైట్ లో సగ్గుబియ్యం చేర్చుకోవాలి. గ్యాస్ ప్రాబ్లమ్స్, బ్లోటింగ్ వంటి సమస్యలను తక్షణం నివారిస్తుంది. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెంచి.. హెల్తీగా ఉండటానికి సహాయపడుతుంది.

జీర్ణక్రియ సమస్యకు

జీర్ణక్రియ సమస్యకు

సగ్గు బియ్యంను పాల లేదా నీటితో ఉడికించి తర్వాత పంచదార మిక్స్‌ చేసి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలన్నీ దూరమవుతాయి.

బర్త్ డిఫెక్ట్స్

బర్త్ డిఫెక్ట్స్

సగ్గుబియ్యం బర్త్ డిఫెక్ట్స్ ని కూడా అరికడుతుంది. ఇందులో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి ఉంటుంది. ఇవి.. పొట్టలో బేబీ హెల్తీగా పెరగడానికి, బర్త్ డిఫెక్ట్స్ రాకుండా అడ్డుకోవడానికి సహాయపడుతుంది. కాబట్టి గర్భిణీలు.. వీటిని డైట్ లో చేర్చుకోవాలి.

నరాల ఆరోగ్యానికి

నరాల ఆరోగ్యానికి

నరాల ఆరోగ్యానికి సగ్గుబియ్యం సహాయపడుతుంది. ఇందులో విటమిన్ కె ఉంటుంది. ఇది.. మెదడుకి మంచిది. విటమిన్ కె పుష్కలంగా శరీరానికి అందడం వల్ల.. అల్జీమర్స్ రిస్క్ తగ్గుతుంది.

ఒంట్లో వేడి

ఒంట్లో వేడి

తక్షణ శక్తినిచ్చే సగ్గుబియ్యం ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుంది. ఇన్ఫ్లమేషన్‌ తో బాధపడే వారు కూడా సగ్గుబియ్యంను తీసుకుంటే మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

English summary

7 Remarkable Ways Sabudana Can Benefit You: Health Benefits of Sabudana

7 Remarkable Ways Sabudana Can Benefit You: Health Benefits of Sabudana. Most of us who have ever eaten tapioca know it as small, chewy pearls found in a bowl full of pudding.
Story first published: Monday, November 21, 2016, 12:37 [IST]
Desktop Bottom Promotion