For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెంటనే షుగర్ తినడం మానేయాలి అనడానికి బలమైన కారణాలు..!

పంచదార తినడం పూర్తీగా మానేయాలి అంటే.. స్వీట్ ఫుడ్స్ ని కూడా.. మానేయాలని కాదు. పంచదారకు బదులు తేనె, బెల్లం వంటి వాటిని వాడితే మీకు కావాల్సిన స్వీట్ నెస్ నాలుకకు తగుతుంది.

By Swathi
|

స్వీట్, షుగరీ ఫుడ్స్ లేకుండా.. జీవితం ఫన్నీగా ఉండదు. అయితే షుగర్ ని పూర్తీగా మానేసి, తీపి పదార్థాలు తినకుండా ఉంటే.. మీరు మరింత హెల్తీగా అవుతారని మీకు తెలుసా ?

ఒకవేళ మీరు పంచదార లేకుండా.. ఎలా అనుకుంటున్నారా ? ఎందుకంటే.. మనం రోజూ తీసుకునే చాలా వంటకాలు, డ్రింక్స్ లో షుగర్ ఉంటుంది. మన డైట్ లో షుగర్ అనేది ఒక భాగం అయింది. అందుకే.. దాన్ని ఇప్పటికప్పుడే మానేయాలంటే.. కష్టంగా మారుతుంది.

no sugar

కానీ పంచదార మానేయడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు అంటే.. మీరు ఖచ్చితంగా పంచదార తినడం మానేస్తారు. షుగరీ ఫుడ్స్ ని వదులుకుంటారు. అంతేకాదు డయాబెటిస్ తో బాధపడేవాళ్లు షుగర్ లేకుండా ఆహారం తీసుకోవడం ఎలా అలవాటు చేసుకున్నారో.. వాళ్లను ప్రోత్సాహంగా తీసుకోవాలి.

పంచదార తినడం పూర్తీగా మానేయాలి అంటే.. స్వీట్ ఫుడ్స్ ని కూడా.. మానేయాలని కాదు. పంచదారకు బదులు మరికొన్ని స్వీటనర్స్ ని డైట్ లో చేర్చుకుంటే.. తీపి తినవచ్చు. తేనె, బెల్లం వంటి వాటిని షుగర్ కి బదులు వాడితే.. మంచిది. మరి పంచదార తినడం మానేస్తే పొందే బెన్ఫిట్స్ ఏంటో చూద్దాం..

గుండె ఆరోగ్యం

గుండె ఆరోగ్యం

షుగర్ బ్లడ్ ప్రెజర్ ని పెంచేసి.. ఇన్సులిన్ లెవెల్స్ ని పెంచవచ్చు. అలాగే హైబ్లడ్ ప్రెజర్ గుండెపై దుష్ర్పభావం చూపవచ్చు. కాబట్టి.. షుగర్ తీసుకోవడం మానేయడం వల్ల.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

మొటిమలు తగ్గిస్తుంది

మొటిమలు తగ్గిస్తుంది

ఎక్కువ మోతాదులో షుగర్ ఫుడ్స్ తీసుకుంటే.. మొటిమలు రావచ్చు. ఎందుకంటే పంచదారలో ఇన్ల్ఫమేటరీ నేచర్ ఉంటుంది. కాబట్టి.. మొటిమలు లేని చర్మం కావాలంటే.. పంచదార తీసుకోవడం మానేయాలి.

డయాబెటిస్

డయాబెటిస్

ఇది అందరికీ తెలిసిన విషయం. ముఖ్యమైన ప్రయోజనం. షుగర్ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతాయి. డయాబెటిస్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే డయాబెటిస్ తో బాధపడేవాళ్లలో ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది.

పంటి ఆరోగ్యానికి

పంటి ఆరోగ్యానికి

షుగరీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యావిటీస్, ఇతర పంటి సమస్యలు ఎక్కువవుతున్నాయి. కాబట్టి.. షుగర్ తీసుకోవడం మానేస్తే.. మీ పళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

మెమరీ పెరుగుతుంది

మెమరీ పెరుగుతుంది

ఎక్కువగా షుగర్ తీసుకోవడం వల్ల.. బ్రెయిన్ లోని అనేక కణాలపై దుష్ర్పభావం పడి.. కమ్యునికేషన్ పై ప్రభావం చూపుతాయి. కాబట్టి.. మెమరీ తగ్గిపోతుంది. షుగర్ తీసుకోవడం ఇప్పటికిప్పుడే మానేస్తే.. మెమరీ మెరుగుపడుతుంది.

బరువు తగ్గడానికి

బరువు తగ్గడానికి

షుగర్ లో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి కారణమవుతాయి. కాబట్టి.. పంచదార తినడం మానేస్తే.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

లివర్ హెల్త్

లివర్ హెల్త్

ఎక్కువ మోతాదులో పంచదార తినడం వల్ల ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే ప్రమాదం ఉంది. పంచదారం తినడం మానేస్తే.. కాలేయం హెల్తీగా ఉండటమే కాకుండా.. పనితీరు సజావుగా సాగుతుంది.

English summary

7 Things That Happen To Your Body When You Stop Eating Sugar

7 Things That Happen To Your Body When You Stop Eating Sugar. And we have become so used to sugar being a part of our diet that we may find it hard to give up on it immediately.
Story first published: Thursday, November 24, 2016, 12:07 [IST]
Desktop Bottom Promotion