For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓట్ మీల్ ని బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోవాలనడానికి స్ట్రాంగ్ రీజన్స్..!!

ఓట్ మీల్ ని రెగ్యులర్ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల.. అత్యంత అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చట. అయితే.. బ్రేక్ ఫాస్ట్ లో ఓట్ మీల్ ఖచ్చితంగా చేర్చుకోవాలి అనడానికి ఇక్కడ 8 ఖచ్చితమైన కారణాలున్నాయి.

By Swathi
|

ఓట్ మీల్ కంటే హెల్తీగా మరేది హెల్తీ గుడ్ మార్నింగ్ చెప్పలేదట. పాలు కలిపి వండినవైనా, ఫ్రెష్ ఫ్రూట్స్ మిక్స్ చేసినవైనా.. ఓట్ మీల్ తీసుకోవడం వల్ల.. అనేక అనేక ప్రయోజనాలు పొందవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.

oatmeal

ఓట్ కేక్స్, ఓట్ కుకీస్, ఓట్ బ్రెడ్ వంటివి రెగ్యులర్ గా తీసుకోవడమనేది.. చాలా పాపులర్ అయింది. ఒకవేళ మీరు బ్రేక్ ఫాస్ట్ కి ఓట్ మీల్ తీసుకోకపోతే.. అద్భుతమైన పోషకాలు, ఫైబర్ ఉండే ఆహారాన్ని ఉదయాన్నే మిస్ అయినట్టే అంటున్నారు నిపుణులు.

ఓట్ మీల్ ని రెగ్యులర్ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల.. అత్యంత అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చట. అయితే.. బ్రేక్ ఫాస్ట్ లో ఓట్ మీల్ ఖచ్చితంగా చేర్చుకోవాలి అనడానికి ఇక్కడ 8 ఖచ్చితమైన కారణాలున్నాయి. అవేంటో చూస్తే.. రేపటి నుంచే.. ఓట్ మీల్ బ్రేక్ ఫాస్ట్ మొదలుపెట్టేస్తారు.

వెయిట్ లాస్

వెయిట్ లాస్

ఓట్ మీల్ ని బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవడం వల్ల.. అదనపు బరువు తగ్గించుకోవచ్చు. బ్రేక్ ఫాస్ట్ లో ఓట్ మీల్ తీసుకుంటే.. రోజంత తక్కువ ఆహారం తీసుకోవడానికి, బరువుని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే మెటబాలిజం మెరుగుపడుతుంది.

హై ఫైబర్

హై ఫైబర్

ఓట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు ఓట్ మీల్ ద్వారా 4గ్రాముల ఫైబర్ పొందవచ్చు. ఫైబర్ ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుతుంది. ఎక్కువ సమయం ఆకలి లేకుండా చేస్తుంది. ప్రతి రోజూ ఉదయాన్నే ఓట్ మీల్ తీసుకోవడం వల్ల.. కాన్ట్సిపేషన్ కూడా.. తగ్గుతుంది.

పోషకాలు

పోషకాలు

ఓట్ మీల్ లో.. కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఒక కప్పు ఓట్ మీల్ లో.. 28శాతం కార్బొహైడ్రేట్స్ పొందవచ్చు. అలాగే 5 గ్రాముల ప్రొటీన్, 3.5 గ్రాముల అన్ శ్యాచురేటెడ్ ఫ్యాట్ పొందవచ్చు.

డయాబెటిస్

డయాబెటిస్

హైఫైబర్, కార్బోహైడ్రేట్స్ ఉండటం వల్ల.. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గించి.. డయాబెటిస్ రిస్క్ ని తగ్గిస్తుంది. మెగ్నీషియం హైలెవెల్ లో ఉండటం వల్ల.. డయాబెటిస్ దరిచేరదు.

లో క్యాలరీ

లో క్యాలరీ

ఓట్ మీల్ చాలా సేపటివరకు ఆకలి అనిపించకుండా.. పొట్టనిండిన ఫీలింగ్ కలిగిస్తుంది. అలాగే ఇందులో తక్కువ క్యాలరీలు ఉంటాయి. కాబట్టి వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే.. హెల్తీగా ఉంటారు.

గుండె వ్యాధులు, క్యాన్సర్

గుండె వ్యాధులు, క్యాన్సర్

ఓట్ మీల్ లో ఓల్ గ్రెయిన్స్ లాంటిది. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల.. బ్రెస్ట్ క్యాన్సర్ నివారించవచ్చు. అలాగే.. ఇతర క్యాన్సర్లు, గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

హార్ట్ ఫెయిల్యూర్

హార్ట్ ఫెయిల్యూర్

మగవాళ్లు ప్రతి రోజూ ఉదయం ఒక కప్పు ఓట్ మీల్ తీసుకుంటే.. 29 శాతం హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ తగ్గించుకుంటారట. కాబట్టి.. మగవాళ్ల డైట్ లో కంపల్సరీ ఓట్ మీల్ ఉండటం మంచిది.

యాంటీ ఆక్సిడెంట్స్

యాంటీ ఆక్సిడెంట్స్

ఓట్ మీల్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి.. ఫ్రీరాడికల్స్ తో పోరాడతాయి. చెడు కొలెస్ట్రాల్ ని కరిగిస్తాయి. కాబట్టి.. ఓట్ మీల్ తీసుకోవడం వల్ల.. కార్డియోవాస్కులర్ డిసీజ్ ల రిస్క్ తగ్గుతుంది.

English summary

8 reasons you should eat oatmeal for breakfast

8 reasons you should eat oatmeal for breakfast. Here are 8 beneficial reasons why you should eat oatmeal for breakfast.
Story first published: Monday, October 17, 2016, 11:28 [IST]
Desktop Bottom Promotion