For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కిడ్నీ స్టోన్స్, ఇన్ఫెక్షన్, ఇతర కిడ్నీ సమస్యలను నివారించే 8 సూపర్ వెజిటేబుల్స్ ..!

|

లోయర్ అబ్డామినల్ వద్ద రెండు కిడ్నీలు ఉంటాయి. ఇవి అచ్చు కిడ్నీ బీన్స్ షేప్ లో ఉంటుంది. కిడ్నీలు శరీరంలో అనవసర వ్యర్థాలను , ఎక్సెస్ వాటర్ ను , వేస్ట్ ను తొలగించే పనిలో నిరంతరం పనిచేస్తుంటుంది. శరీరానికి అత్యంత ముఖ్యమైన ఆవయవం కిడ్నీలు, శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉండటానికి ముఖ్య పాత్రను పోషిస్తుంది. అంతే కాదు ఇది వివిధ రకాల హార్మోనులును ఉత్పత్తి చేస్తూ, బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది. ఇన్ డైరెక్ట్ గా బోన్స్ ను స్ట్రాంగ్ గా ఉంచడానికి కూడా సహాయపడుతాయి.

ప్రస్తుత రోజుల్లో చాలా మందిలో కిడ్నీ స్టోన్స్, కిడ్నీక్యాన్సర్ , కిడ్నీ ఇన్ఫెక్షన్ వంటి కిడ్నీ వ్యాధులనుతో బాధపడుతున్నారు. తరతరాలుగా ఈ సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. కిడ్నీస్టోన్స్ శరీరంలో మినిరల్స్ ఎక్కువ అవ్వడం కిడ్నీ స్టోన్స్ ఏర్పడుతాయి. అలాగే క్యాల్షియం ఎక్కువ అవ్వడం వల్ల స్పటికలు గా ఏర్పడి, కిడ్నీలో రాళ్ళుగా ఏర్పడుతాయి. కిడ్నీ సమస్యలను నివారించుకోవాలంటే కొన్ని ఆహారాలను , ఫ్రూట్స్, వెజిటేబుల్స్ గ్రేట్ గా సహాయపడుతాయి.

కిడ్నీ వ్యాధులను నివారించడానికి స్పెషల్ డైట్ అవసరమవుతుంది. సరైన సమయానికి భోజనం చేయడం, బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్లో ఉంచుకోవడం, రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల కిడ్నీ సమస్యలను నివారించుకోవచ్చు . కిడ్నీ సమస్యలను తగ్గించే కొన్ని వెజిటేబుల్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి..

1. క్యాబేజ్:

1. క్యాబేజ్:

లోపొటాషియం కంటెంట్ ఉండటం వల్ల కిడ్నీ వ్యాధులకు కారణమవుతుంది. అందువల్ల క్యాబేజ్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే అందులో విటమిన్ కె, విటమిన్ సి, మరియు ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. క్యాబేజ్ లో ఉండే ఫోటో కెమికల్స్ క్యాన్సర్ ను నివారిస్తాయి, కార్డియో వ్యాస్కులర్ హెల్త్ ను ప్రోత్సహిస్తాయి.

2. కాలీఫ్లవర్:

2. కాలీఫ్లవర్:

కాలీ ఫ్లవర్ కిడ్నీ ఫ్రెండ్లీ వెజిటేబుల్, ఇది కిడ్నీ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. అలాగే కిడ్నీలకు ఆక్సిజన్ ను సప్లై చేస్తుంది. కిడ్నీలను డిటాక్సిఫై చేస్తుంది. కాలీఫ్లవర్ లో ఉండే హైఫైబర్ కంటెంట్ డయాబెటిస్, మరియు హార్ట్ డిసీజ్ ను నివారిస్తుంది.

3. వెల్లుల్లి:

3. వెల్లుల్లి:

వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి కిడ్నీ ఇన్ఫెక్షన్ నివారిస్తాయి. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. వెల్లుల్లి కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

4. క్యారెట్స్ :

4. క్యారెట్స్ :

క్రోనిక్ కిడ్నీ డిసీజ్ తో బాధపడే వారు హైపర్ టెన్షన్ ను క్రమబద్దం చేసే ఆహారాలను తినమని సూచిస్తుంటారు. అలాంటి ఆహారాల్లో క్యారెట్స్ ఒకటి. క్యారెట్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల కిడ్నీ వ్యాధులకు కారణమయ్యే డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది.

5. ఉల్లిపాయలు:

5. ఉల్లిపాయలు:

కిడ్నీ ఫంక్షన్ సరిగా జరిగేట్లు చేస్తుంది. బ్లడ్ వెస్కాసిటిస్ తగ్గిస్తుంది. ఉల్లిపాయలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ క్రిస్టలైజేషన్ నివారిస్తుంది. కిడ్నీ స్టోన్స్ ను అరికడుతుంది.

6. ఎర్ర ముల్లంగి:

6. ఎర్ర ముల్లంగి:

ఎర్ర ముల్లంగిలో న్యూట్రీషియన్ అధికంగా ఉంటాయి. అలాగే మెడిసినల్ వాల్యూస్ కుడా ఎక్కువ. క్యాలరీస్ తక్కువ. కిడ్నీలోచేరిన టాక్సిన్ ను తొలగించి, ఇన్ఫెక్షన్ ను నివారించే గుణాలు ఎర్ర ముల్లంగిలో గ్రేట్ గా ఉన్సాయి.

7. గుమ్మడి విత్తనాలు:

7. గుమ్మడి విత్తనాలు:

గుమ్మడి విత్తనాల్లో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్, మినిరల్స్ అత్యధికంగా ఉన్నాయి. గుమ్మడి విత్తనాలు, కిడ్నీ ఫంక్షన్ బాగుంటుంది. ఇది కిడ్నీ స్టోన్ రిస్క్ తగ్గిస్తుంది.

8. బీన్స్ :

8. బీన్స్ :

కిడ్నీ స్టోన్స్ నివారించడానికి బీన్స్ గ్రేట్ గా సహాయపడుతుంది. బీన్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ తక్కువ, ఇది కార్డియో వ్యాస్కులర్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది. బీన్స్ లో ఉండే హైఫైబర్ కంటెంట్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది.

English summary

8 Vegetables That Are Good For Kidneys

Kidneys are a pair of bean shaped organs in the lower abdomen. The role of kidneys is to remove the excess water content and waste from the body. Kidneys perform a major role in overall functioning of a body. It also produces various hormones which helps to control blood pressure and indirectly keeps the bones strong.
Story first published:Saturday, October 15, 2016, 13:17 [IST]
Desktop Bottom Promotion