For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తాజా కొత్తిమీరతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు...!!

|

కొత్తిమీరను సాదారణంగా వివిధ ఆహార పదార్దాల తయారిలోను మరియు గార్నిష్ కు ఉపయోగిస్తాము. ప్రతి రిఫ్రిజిరేటర్ లో కొత్తిమీర ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. కొత్తిమీర అత్యధిక వంటకాల్లో ఉపయోగించే ఒక శక్తివంతమైన హెర్బ్ మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. కొత్తిమీరలో థియామైన్ తో సహా అనేక ఖనిజాలు మరియు విటమిన్లు సమృద్దిగా ఉన్నాయి. వాటిలో విటమిన్ సి, విటమిన్ బి,భాస్వరం,కాల్షియం,ఇనుము, నియాసిన్, సోడియం, కెరోటిన్, మొక్క నుంచి తీసిన ద్రవ యాసిడ్, పొటాషియం, కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్, ఫ్యాట్, ఫైబర్ మరియు నీరు ఉంటాయి.

కొత్తిమీరను ఒక తేలికపాటి మిరియాలతో కలిపి వివిధ వంటకాల్లో ఉపయోగిస్తే ప్రత్యేకమైన రుచి వస్తుంది. కొత్తిమీరకు అయ్యే ఖర్చు చాలా తక్కువ. అయితే ఆరోగ్య పరంగా చూస్తే మాత్రం ఇది చాలా విలువైనదిగా ఉంటుంది. ఆహారంలో కొత్తిమీర రుచి మరియు వాసనతో పాటు అనేక వ్యాధుల చికిత్సలో సహాయపడుతుంది. కొకొత్తిమీర ఆకులలో ప్రొటీన్లు, కొవ్వు, మినరల్స్, పీచు, కార్బోహైడ్రేట్లు, నీరు వుంటాయి. మినరల్స్, విటమిన్లు పరిశీలిస్తే వాటిలో విటమిన్ సి, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కెరోటీన్, ధయామైన్, రిబోఫ్లావిన్, నయాసిన్, సోడియం, పొటాషియం, ఆక్సాలిక్ యాసిడ్ లు వుంటాయి. కొత్తిమీర ఆకు ఎంతో ఉత్తేజాన్నిస్తుంది. టానిక్ ల వలే పనిచేస్తుంది. అవి పొట్ట గడబిడను దూరం చేస్తాయి. బలపరుస్తాయి. మంచి జీర్ణక్రియకు తోడ్పడతాయి.

తాజా కొత్తిమీరలో దాగున్న ఆరోగ్య రహస్యాలు:

డయేరియా తగ్గిస్తుంది:

డయేరియా తగ్గిస్తుంది:

కొత్తిమీరలో ఉండే బోర్నియోల్, లినానోల్, జీర్ణశక్తిని పెంచడంలో, లివర్ సక్రమంగా పనిచేయడానికి డయేరియాను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. డయోరియాతో బాధపడే వారు కొత్తమీర జ్యూస్ తాగడం వల్ల డయోరియా కంట్రోల్ అవుతుంది.

చర్మ సమస్యలు నివారిస్తుంది:

చర్మ సమస్యలు నివారిస్తుంది:

చర్మాన్ని కాపాడటానికి వాడే రసాయనికి మందులలో కొత్తిమీర ఆకులను వాడతారు. ముఖం పైన ఉండే మొటిమలకు, పొడి చర్మం, నల్లటి మచ్చలను తగ్గిస్తుంది. చర్మాన్ని కాపాడుటకు వాడే మిశ్రమాలలో కొత్తిమీర నుండి తీసిన ద్రావాలను కలపడం వలన, మిశ్రమం యొక్క ప్రభావం రెట్టింపు అవుతుంది.

బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ చేస్తుంది:

బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ చేస్తుంది:

బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ చేస్తుంది:కొత్తిమీరను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరానికి పాజిటివ్ ఎఫెక్ట్ ను కలిగిస్తుంది. ఇది బ్లడ్ ప్రెజర్ ను కంట్రిబ్యూట్ చేస్తుంది. స్ట్రెస్ తగ్గిస్తుంది. హైపర్ టెన్షన్ తగ్గించుకోవడం వల్ల హార్ట్ సమస్యలుండవు.

అనీమియా తగ్గిస్తుంది:

అనీమియా తగ్గిస్తుంది:

కొత్తిమీర బ్లడ్ ఫ్యూరిఫైయర్ అంతే కాదు, బ్లడ్ బిల్డర్ కూడా. కొత్తిమీరలో పోషకాలతో పాటు, ఐరన్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల ఇది అనీమీయాను తగ్గిస్తుంది.

మౌత్ అల్సర్ తగ్గిస్తుంది:

మౌత్ అల్సర్ తగ్గిస్తుంది:

కొత్తమీరలో ఉండే ముఖ్యమైన గుణాలు, యాంటీ సెప్టిక్ లక్షణాలు. ఇంకా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా గాయాలను లేదా నోటి అల్సర్స్ ను తగ్గిస్తుంది. ఉదయం కొత్తిమీరను తినడం వల్ల రోజుకు మూడుసార్లు తింటే మంచి ఫలితం ఉంటుంది. అల్సర్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

 బోన్ హెల్త్ మెరుగుపరుస్తుంది:

బోన్ హెల్త్ మెరుగుపరుస్తుంది:

కొత్తిమీరలో ఉండే క్యాల్షియం, బోన్స్ హెల్త్ ను ప్రోత్సహిస్తుంది. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ఉండే క్యాల్షియం, ఇతర మినిరల్స్, బోన్ హెల్త్ కు సహాయపడుతాయి. డ్యూరబులిటిని పెంచుతాయి. .

జీర్ణ శక్తిని పెంచుతుంది:

జీర్ణ శక్తిని పెంచుతుంది:

కొత్తిమీర ఆహారాన్ని రుచి గానే కాకుండా, జీర్ణక్రియ రేటుని కూడా పెంచును. అంతే కాకుండా జీర్ణక్రియ వ్యాధులను, అజీర్ణం, వాంతులు, వంటి వాటిని తగ్గించును. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడటానికి కొత్తిమీర సహకరిస్తుంది. అలాగే మధుమేహంతో బాధపడేవాళ్లకు కొత్తిమీర మంచి ఔషధం. రక్తంలోని చక్కెర నిల్వల్ని తగ్గిస్తుంది. కొత్తిమీరను ఇష్టపడేవాళ్లు దాని రసం తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

 కళ్ళ ఆరోగ్యానికి మంచిది:

కళ్ళ ఆరోగ్యానికి మంచిది:

కొత్తిమీర ఎక్కువగా యాంటీ-ఆక్సిడెంట్స్'లను కలిగి ఉండటము వలన కంటికి సంబంధించిన వ్యాధులను రాకుండా ఆపుతుంది.

 చికెన్ పాక్స్ నివారిస్తుంది:

చికెన్ పాక్స్ నివారిస్తుంది:

కొత్తిమీరలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, మరియు ఇతర యాంటీఆక్సిడెంట్స్ కళ్ళు మంచిది, కొత్తిమీరలో ఉండే మినిరల్స్ కారణంగా కంటి సమస్యలను దూరం చేస్తుంది. కళ్ళ అలసటను, ఒత్తిడిని తగ్గిస్తాయి.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

కొత్తిమీర చాలా యాంటీ-ఆక్సిడేంట్స్'ని కలిగి ఉండటము వలన ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలోని కొవ్వు పదార్థాల స్థాయిలను సమన్వయ పరుస్తుంది. కొత్తిమీర ఆకులు హానికరమైన కొవ్వు పదార్థాలను తగ్గించి, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతుంది.

English summary

Amazing Health Benefits Of Coriander

Coriander, or cilantro, also called Chinese parsley is considered as a magical herb in Indian markets. Coriander is the leaf that grows from coriander seeds and is used in flavouring gravies or chilli dishes. So, keep reading to know the health benefits of this awesome green veggie - Coriander!
Story first published: Wednesday, September 28, 2016, 7:30 [IST]
Desktop Bottom Promotion